'ప్రతిపక్షం సలహాలిస్తే పరిశీలిస్తాం'
హైదరాబాద్: ప్రభుత్వంలోని ప్రతిపక్షం సలహాలిస్తే.. పరిశీలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్ సీపీ సలహాలిస్తే తాము తప్పకుండా పరిశీలిస్తామన్నారు. చట్టాలను జనరల్ గా చేస్తారని.. తరువాత దానికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేస్తారన్నారు. మంత్రి నారాయణ సీఆర్డీఏ బిల్లును ప్రవేశపెట్టిన అంశాలు ప్రభుత్వం చెప్పిన వాటిలో లేవని జగన్ స్పష్టం చేయగా.. చంద్రబాబు తన అసహనం వ్యక్తం చేశారు.
ఎవరైనా మాట్లాడితే రూల్స్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. మంత్రి నారాయణ ఏదో నేరం చేసినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మంత్రి చెప్పినవన్నీ రూల్స్ పరిధిలోకి వస్తాయని బాబు తెలిపారు.