సవాల్కు దీటుగా స్పందించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ వాడివేడిగా జరిగింది. రైతుల ఆత్మహత్యల అంశంలో చెప్పిన అంశాలకు కట్టుబడి ఉంటే నిరూపించాలని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రతిపక్షాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే వైఎస్ఆర్ సీపీ ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకోవాలని ఆయన సవాల్ విసిశారు.
దీనిపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీటుగా స్పందించారు. 'యావత్ టీడీపీ పార్టీకే..సవాల్ విసురుతున్నా...ఇప్పుడు ఎన్నికలకు వెళ్దాం, అందుకు సిద్దమేనా' అని ప్రతి సవాల్ విసిరారు.