హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మంగళవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి సరిపోదని టీడీఎల్పీ భావనగా పేర్కొన్న కాల్వ.. మిగతా నాలుగు రోజుల పాటు అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చ జరగాలన్నారు.
ప్రతిపక్షం ఏ అంశంపై డిమాండ్ చేసినా.. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై సభ్యులకు అవగాహన కల్పిస్తామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అభివృద్ధి పథఖాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని సీఎం ఆదేశించారన్నారు.