సీఆర్డీఏ బిల్లుకు గవర్నర్ ఆమోదం | Governor approved CRDA bill | Sakshi
Sakshi News home page

సీఆర్డీఏ బిల్లుకు గవర్నర్ ఆమోదం

Published Tue, Dec 30 2014 5:15 PM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

గవర్నర్ నరసింహన్

గవర్నర్ నరసింహన్

హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతానికి సంబంధించిన కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) బిల్లుపై గవర్నర్ నరసింహన్ ఆమోదం లభించింది. ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు. ఏపీ ప్రభుత్వం ఇంగ్రీష్, తెలుగు, ఉర్దూ భాషలలో గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

17 చాప్టర్లు, 117 పేజీలతో రూపొందించిన ఈ బిల్లును   ఈనెల 22న   శాసనసభలో ఆమోదించారు. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు.  బిల్లులోని రైతు వ్యతిరేక విధానాలను, భూములు అదనంగా తీసుకోవడాన్ని వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకించింది.

గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలో ఏపీ కొత్త రాజధానిని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు మండలాలలోని 29 గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement