పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రస్తుతం దేశ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. సందేశ్‌ఖాలీలో మహిళలను కొందరు టీఎంసీ నేతలు లైంగికంగా వేధించారని, వారి భూములు ఆక్రమించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపధ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పశ్చిమ బెంగాల్‌లోని మమత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సందేశ్‌ఖాలీకి వెళ్తున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత వారిని విడుదల చేశారు. ఇప్పుడు ఆ నిజనిర్ధారణ బృందం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌తో సమావేశమైంది. వారు సందేశఖలీ అంశంపై తమ అభిప్రాయాన్ని గవర్నర్ ముందు వెల్లడించారు.
సందేశ్‌ఖాలీకి వెళ్లేందుకు తాము వెళుతుండగా పోలీసులు తమను అడ్డుకున్నారని వారు గవర్నర్‌కు తెలిపారు. దాదాపు గంటన్నర పాటు తమను నిర్బంధించి, ఆ తరువాత విడుదల చేశారని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తాము గవర్నర్‌ను కోరామని నిజనిర్ధారణ బృందం మీడియాకు తెలిపింది. రాష్ట్రంలో సెక్షన్ 144 అమలు చేయాలని కోరామని, దేశ పౌరులు స్వేచ్ఛగా తిరగలేకపోవడం కన్నా దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదని వారు వాపోయారు.
తమ అరెస్టు చట్ట విరుద్ధమని ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ గవర్నర్‌తో భేటీ సందర్భంగా పేర్కొంది. కాగా ఈ బృందానికి పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, ఇతర సభ్యులు నాయకత్వం వహించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ఆరోపణలపై వెంటనే డీజీపీ నుంచి నివేదిక తీసుకోవాలని గవర్నర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment