కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో కాళీమాత విగ్రహం నిమజ్జనంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. రాజాబజార్ పరిధిలోని నార్కెల్‌దంగ ప్రాంతంలో కాళీమాత విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలంలో ఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు.
కాళీమాత విగ్రహం నిమజ్జనం ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఘటన స్థానికంగా కలకలంరేపింది. అప్రమత్తమైన పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియా సైట్‌లో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. పార్కింగ్ విషయంలోవివాదం జరిగిందని, దీనిని బీజేపీ నేతలు రాళ్లదాడి ఘటనగా చెబుతున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
హిందువులు చేపట్టిన ఊరేగింపుపై మమతా బెనర్జీవర్గానికి చెందినవారు రాళ్లు రువ్వారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. మమతా బెనర్జీ వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తక్షణమే పదవి నుండి వైదొలగాలని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ రాజాబజార్‌లో కాళి నిమజ్జనం ఊరేగింపుపై దాడి జరిగిందని, పోలీసులు భక్తులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత
Comments
Please login to add a commentAdd a comment