'మార్చిలోగా ప్రత్యేక హోదాపై తెలిసిపోతుంది'
హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి సంబంధించిన సీఆర్డీఎ బిల్లు సభలో ప్రవేశపెట్టామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం అసెంబ్లీలో తెలిపారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందాక గవర్నర్ దగ్గరకు వెళ్తుందని అన్నారు. గవర్నర్ ఆమోదం పొందాక భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.
భూసేకరణ సమయంలో భూములు ఇస్తున్నట్లు రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకుంటామన్నారు. వీజీటీఎం పరిధిలోని ఆస్తులు, అప్పులు సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్ర నిర్ణయం వచ్చే ఏడాది మార్చిలోపు తెలిసిపోతుందని యనమల తెలిపారు.