
సీఆర్డీఏ బిల్లులో సవరణలకు ఆమోదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బుధవారం సాయంత్రం నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సీఆర్డీఏ బిల్లులో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మార్కెట్ యార్డులలో సభ్యుల సంఖ్య 19 పెంచాలని కూడా నిర్ణయించింది. అటవీ చట్టంలో సవరణలకూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పంటల రుణమాఫీ, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు.