మంత్రి నారాయణ వెల్లడి
నెల్లూరు: తమిళనాడు తరహాలో ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లు రాష్ట్రంలో నవంబరు నుంచి ప్రారంభమవుతాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలక మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి పథకాల గురించి వాక బు చేసి, అటువంటి వాటిని మన రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నామన్నారు. అందు లో భాగంగానే తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లను పరిశీలించి, ఆ తరహాలో రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఆయన మంగళవారం నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నమైన పథకాలను రాష్ట్రానికి తీసుకురావాలని ఆశిస్తున్నారని తెలిపారు. అన్న క్యాంటీన్లు నవంబర్‌లో ప్రారంభిస్తామన్నారు. అక్టోబరు 2న వెయ్యి రూపాయల పింఛన్ అమలు మొదలుపెట్టడంతో పా టు, ఎన్టీఆర్ సుజల పథకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను గుర్తించేందుకు పింఛన్ పరిశీలన కమిటీలను ఏర్పాటుచేశామని, ఆధార్ అనుసంధానం కూడా అందుకేనని మంత్రి అన్నారు.
నవంబర్‌లో అన్న క్యాంటీన్లు
Published Wed, Oct 1 2014 2:49 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement