సర్పంచ్ కూడా కాని వ్యక్తికి మంత్రి పదవా ? | Noor Mahmood takes on Minister P. Narayana | Sakshi
Sakshi News home page

సర్పంచ్ కూడా కాని వ్యక్తికి మంత్రి పదవా ?

Published Thu, Jun 19 2014 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

సర్పంచ్ కూడా కాని వ్యక్తికి మంత్రి పదవా ?

సర్పంచ్ కూడా కాని వ్యక్తికి మంత్రి పదవా ?

తన విద్యా వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలను కనుమరుగు చేయడానికి రాష్ట్ర మంత్రి పి.నారాయణ ప్రయత్నిస్తున్నారని భారత విద్యార్థి సమైక్య (ఎస్ఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్ ఆరోపించారు. బుధవారం అనంతపురంలో విలేకర్ల సమావేశంలో నూర్ మహ్మద్ మాట్లాడారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పదవి చేపట్టిన నారాయణ గ్రామ సర్పంచ్ పదవికి అనర్హుడు ఆయన ఎద్దేవా చేశారు.

 

అలాంటి వ్యక్తికి రాష్ట్ర మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.  పాఠశాలలో అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు కత్తిరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలన్నీ అసౌకర్యాల మధ్య నడుస్తున్నాయని నూర్ మహ్మద్ ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement