
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ఓ ‘మెగా’ అభిమాని కుటుంబాన్ని ఆదుకొని నిజమైన హీరో అనిపించుకున్నాడు. గతేడాది డిసెంబర్ 8న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్ అహ్మద్(55) మృతి చెందిన సంగతి తెలిసిందే. తమను ఎంతగానో ఆరాధించే అభిమాని చనిపోయిన వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన నూర్ అహ్మద్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాదు వారిని ఆర్ధికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
(చదవండి : చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ అధ్యక్షుడి మృతి)
ఆ తర్వాత మెగా పవన్ స్టార్ రామ్ చరణ్.. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అప్పట్లో ప్రకటించాడు. ఇచ్చిన మాటను చెర్రీ నిలబెట్టుకున్నాడు. ఆదివారం ఉదయం నూర్ మహమ్మద్ కుటుంబసభ్యులను తన ఇంటికి పిలిపించుకున్న చరణ్.. రూ.10 లక్షల చెక్కుని వారికి అందజేశారు. వారితో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. దటీజ్ రామ్ చరణ్ అని కొనియాడారు.
(చదవండి : అభిమాని కుటుంబానికి అండగా నిలిచిన చెర్రీ)
Comments
Please login to add a commentAdd a comment