mega fans association
-
పెద్ద మనసు చాటుకున్న రామ్‌చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ఓ ‘మెగా’ అభిమాని కుటుంబాన్ని ఆదుకొని నిజమైన హీరో అనిపించుకున్నాడు. గతేడాది డిసెంబర్ 8న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్ అహ్మద్(55) మృతి చెందిన సంగతి తెలిసిందే. తమను ఎంతగానో ఆరాధించే అభిమాని చనిపోయిన వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన నూర్ అహ్మద్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాదు వారిని ఆర్ధికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. (చదవండి : చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ అధ్యక్షుడి మృతి) ఆ తర్వాత మెగా పవన్ స్టార్ రామ్ చరణ్.. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అప్పట్లో ప్రకటించాడు. ఇచ్చిన మాటను చెర్రీ నిలబెట్టుకున్నాడు. ఆదివారం ఉదయం నూర్ మహమ్మద్ కుటుంబసభ్యులను తన ఇంటికి పిలిపించుకున్న చరణ్.. రూ.10 లక్షల చెక్కుని వారికి అందజేశారు. వారితో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. దటీజ్ రామ్ చరణ్ అని కొనియాడారు. (చదవండి : అభిమాని కుటుంబానికి అండగా నిలిచిన చెర్రీ) -
‘మెగా’ అభిమాని కుటుంబానికి 10 లక్షల విరాళం
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్ అహ్మద్(55) ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే హీరో చిరంజీవి, అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు నూర్ అహ్మద్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి రూ.10 లక్షల విరాళం అందిస్తున్నట్టుగా ప్రకటించారు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న చెర్రీ హైదరాబాద్ రాగానే నూర్ అహ్మద్ కుటుంబాన్ని కలుస్తానని వెల్లడించారు. రాంచరణ్ మాట్లాడుతూ.. ‘మెగా అభిమానులలో నూర్ అహ్మద్ గొప్ప వ్యక్తి. మెగా ఫ్యామిలీ కోసం ఎన్నోసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు సేవ చేశారు. గతంలో ఆయన ఆసుపత్రి పాలైతే నేనే స్వయంగా పరామర్శించాను. అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. కానీ నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఆయన లేని లోటు తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మెగా బ్లడ్ బ్రదర్ ‘నూర్ అహ్మద్’ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా’నని పేర్కొన్నారు. చదవండి: చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి Mega Power Star #RamCharan announced 10 lakh donation to #NoorBhai's family. pic.twitter.com/eXlCEE39nq — MOVIES Updates (@moviesupdatesIn) December 9, 2019 -
రాజకీయంగా చిరంజీవికే మద్దతు
మెగా అభిమానుల రాష్ట్రస్థాయి సమావేశంలో తీర్మానం కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం పవన్ తమ గుండెల్లో ఉంటారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌కల్యాణ్ రాజకీయంగా వేరుపడిన నేపథ్యంలో అన్నయ్యకే మద్దతు ప్రకటించాలని మెగా కుటుంబం సినీ అభిమానుల సంఘం నిర్ణయించింది. చిరంజీవి, ఆయన కుటుంబ హీరోల అభిమానుల సంఘంగా ఏర్పడిన ‘చిరంజీవి యువత’ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం హైదరాబాద్ ఫిలింనగర్ క్లబ్లో జరిగింది. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో జిల్లాలవారీగా ఉన్న అభిమాన సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిరంజీవి ఏ రాజకీయ పార్టీలో ఉంటే, తామూ ఆ పార్టీలో కొనసాగుతామని తీర్మానం చేశారు. అభిమానుల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న 15 వేల మందిని గుర్తించి, వారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయాలని నిర్ణయించారు. వీరికి చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు సంతకంతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని తీర్మానించారు. చిరుకు మద్దతు పలకడం ఆయన తమ్ముడు పవన్క ల్యాణ్‌ను వ్యతిరేకించినట్టు కాదని చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామినాయుడు అన్నారు. పవన్ తమ గుండెల్లో ఎప్పటికీ ఉంటారని.. ఒక హీరోను అభిమానించడమంటే మరో హీరోను వ్యతిరేకిస్తున్నట్టు కాదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెగా అభిమానులందరూ ఒక సంఘటిత శక్తిగా రూపొందడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిపారు. పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ స్థాపన తరువాత అభిమానుల పేరుతో కొందరు రకరకాల ప్రకటనలు చేస్తున్నందున, చిరంజీవి యువత నుంచి కూడా 25 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు. చిరంజీవి పెద్ద సోదరుడు నాగబాబు వారిని ఎంపిక చేసినట్టు సమాచారం. కాగా, ఈ సమావేశానికి 250 మందికి మాత్రమే అధికారికంగా రాంచరణ్ ఫోటోతో ఉన్న పాస్‌లను పంపిణీ చేశారు. పాస్‌లు లేనివారిని సిబ్బంది అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. బ్లడ్ బ్యాంక్‌లో కేక్ కట్ చేసిన చరణ్.. రాంచరణ్ తేజ తన పుట్టిన రోజున జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో బాబాయ్ నాగబాబు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాంచరణ్ అన్నారు. నిర్మాత బండ్ల గణేష్, ఫిలించాంబర్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.