
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్ అహ్మద్(55) ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే హీరో చిరంజీవి, అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు నూర్ అహ్మద్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి రూ.10 లక్షల విరాళం అందిస్తున్నట్టుగా ప్రకటించారు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న చెర్రీ హైదరాబాద్ రాగానే నూర్ అహ్మద్ కుటుంబాన్ని కలుస్తానని వెల్లడించారు.
రాంచరణ్ మాట్లాడుతూ.. ‘మెగా అభిమానులలో నూర్ అహ్మద్ గొప్ప వ్యక్తి. మెగా ఫ్యామిలీ కోసం ఎన్నోసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు సేవ చేశారు. గతంలో ఆయన ఆసుపత్రి పాలైతే నేనే స్వయంగా పరామర్శించాను. అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. కానీ నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఆయన లేని లోటు తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మెగా బ్లడ్ బ్రదర్ ‘నూర్ అహ్మద్’ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా’నని పేర్కొన్నారు.
చదవండి: చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి
Mega Power Star #RamCharan announced 10 lakh donation to #NoorBhai's family. pic.twitter.com/eXlCEE39nq
— MOVIES Updates (@moviesupdatesIn) December 9, 2019