Noor Mahmood
-
పెద్ద మనసు చాటుకున్న రామ్‌చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ఓ ‘మెగా’ అభిమాని కుటుంబాన్ని ఆదుకొని నిజమైన హీరో అనిపించుకున్నాడు. గతేడాది డిసెంబర్ 8న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్ అహ్మద్(55) మృతి చెందిన సంగతి తెలిసిందే. తమను ఎంతగానో ఆరాధించే అభిమాని చనిపోయిన వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన నూర్ అహ్మద్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాదు వారిని ఆర్ధికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. (చదవండి : చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ అధ్యక్షుడి మృతి) ఆ తర్వాత మెగా పవన్ స్టార్ రామ్ చరణ్.. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అప్పట్లో ప్రకటించాడు. ఇచ్చిన మాటను చెర్రీ నిలబెట్టుకున్నాడు. ఆదివారం ఉదయం నూర్ మహమ్మద్ కుటుంబసభ్యులను తన ఇంటికి పిలిపించుకున్న చరణ్.. రూ.10 లక్షల చెక్కుని వారికి అందజేశారు. వారితో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. దటీజ్ రామ్ చరణ్ అని కొనియాడారు. (చదవండి : అభిమాని కుటుంబానికి అండగా నిలిచిన చెర్రీ) -
‘మెగా’ అభిమాని కుటుంబానికి 10 లక్షల విరాళం
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్ అహ్మద్(55) ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే హీరో చిరంజీవి, అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు నూర్ అహ్మద్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి రూ.10 లక్షల విరాళం అందిస్తున్నట్టుగా ప్రకటించారు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న చెర్రీ హైదరాబాద్ రాగానే నూర్ అహ్మద్ కుటుంబాన్ని కలుస్తానని వెల్లడించారు. రాంచరణ్ మాట్లాడుతూ.. ‘మెగా అభిమానులలో నూర్ అహ్మద్ గొప్ప వ్యక్తి. మెగా ఫ్యామిలీ కోసం ఎన్నోసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు సేవ చేశారు. గతంలో ఆయన ఆసుపత్రి పాలైతే నేనే స్వయంగా పరామర్శించాను. అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. కానీ నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఆయన లేని లోటు తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మెగా బ్లడ్ బ్రదర్ ‘నూర్ అహ్మద్’ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా’నని పేర్కొన్నారు. చదవండి: చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి Mega Power Star #RamCharan announced 10 lakh donation to #NoorBhai's family. pic.twitter.com/eXlCEE39nq — MOVIES Updates (@moviesupdatesIn) December 9, 2019 -
చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి
బన్సీలాల్‌పేట్: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్ మహ్మద్(55) ఆదివారం గుండెపొటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రాత్రి మహ్మద్ ముషీరాబాద్ స్పెన్సర్ ఎదురుగా ఉన్న ఓ దర్గాలో నిద్రించాడు. తెల్లవారుజామున దర్గా నిర్వాహకులు అతడిని లేపేందుకు ప్రయత్నించగా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు మహ్మద్ మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. గుండెపోటు రావడంతో నూర్ మహ్మద్ నిద్రలోనే కన్నుమూసినట్లు సమాచారం. మోండా మార్కెట్లో తమల పాకుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న నూర్ మహ్మద్ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి కుటుంబసభ్యుల చిత్రాల విడుదల సందర్భంగా సినిమా థియేటర్ల వద్ద హడావిడి చేసేవాడు. చిరంజీవి కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నూర్ మహ్మద్ మరణవార్త తెలియగానే చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో న్యూబోయిగూడలోని ఆయన ఇంటికి తరలి వచ్చారు. చిరంజీవి, అల్లు అరవింద్,అల్లు అర్జున్ పరామర్శ.... నూర్ మహ్మద్ మరణవార్త తెలియగానే చిరంజీవి, అల్లు అర్జున్, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆయన ఇంటికి వచ్చి నూర్ మహ్మద్ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. చిరంజీవి, అల్లు అర్జున్ను చూడగానే నూర్ మహ్మద్ భార్య పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. చిరంజీవి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నూర్ మహ్మద్ అంత్యక్రియలకు చిరంజీవి ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని ముస్లిం శ్మశాన వాటికలో నూర్ మహ్మద్ అంత్యక్రియలు నిర్వహించారు. -
సర్పంచ్ కూడా కాని వ్యక్తికి మంత్రి పదవా ?
తన విద్యా వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలను కనుమరుగు చేయడానికి రాష్ట్ర మంత్రి పి.నారాయణ ప్రయత్నిస్తున్నారని భారత విద్యార్థి సమైక్య (ఎస్ఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్ ఆరోపించారు. బుధవారం అనంతపురంలో విలేకర్ల సమావేశంలో నూర్ మహ్మద్ మాట్లాడారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పదవి చేపట్టిన నారాయణ గ్రామ సర్పంచ్ పదవికి అనర్హుడు ఆయన ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తికి రాష్ట్ర మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. పాఠశాలలో అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు కత్తిరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలన్నీ అసౌకర్యాల మధ్య నడుస్తున్నాయని నూర్ మహ్మద్ ఆరోపించారు.