
సాక్షి, తూర్పుగోదావరి : శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హెచ్చరించారు. తునిలో శుక్రవారం జరిగిన ఆందోళనకారుల దాడిలో అన్నక్యాంటీన్ ద్వంసమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఏర్పడ్డ అన్నక్యాంటీన్లు అవినీతిమయంగా మారాయని, టీడీపీకి చేందిన వారే క్యాంటీన్లను ద్వంసం చేసి దానిని ప్రభుత్వం మీదకు నెట్టివేస్తున్నారని ఆరోపించారు.