dadishetty raja
-
యనమల ఓ రాజకీయ శకుని: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్ అయ్యారు. యనమల ఓ రాజకీయ శకుని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు పెట్టించడం యనమల సోదరులకు పైశాచిక ఆనందం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరిపై కేసులు పెడదామా అని యనమల ఆలోచిస్తాడు. ఎన్నికొలొస్తున్నాయనే తునిలో యనమల మోకాళ్ల యాత్ర చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లోనూ యనమలకు ఓటమి ఖాయం. 1989లో తునిలో వంగవీటి విగ్రహం పెడితే యనమల సోదరులు పొడిపించేశారు. గత 40 ఏళ్ళుగా యనమలకు తుని ప్రజలు గుర్తుకు రాలేదు. బెంగళూరులో ఉండే యనమల కుమార్తె తుని వచ్చి రాజకీయం చేస్తానంటే కుదరదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: విశాఖలో నోట్ల మార్పిడి కలకలం.. జనసేన నాయకుడి అనుచరుడి అరెస్ట్ -
పవన్ ను సీఎం కాదు ఎమ్మెల్యే చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు
-
యనమలపై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం
-
రోడ్లపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది
-
టీడీపీ హయంలో గుడులు కూలగొడితే ఏం చేశారు: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టు సత్యనారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న(శనివారం) సోము వీర్రాజు దేవాదాయ, ధర్మాదాయ శాఖా గురించి, హిందూ దేవాలయాల గురించి మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనే అన్నింటికీ అధిపతి అని ఫీల్ అవుతున్నట్లు అనుకుంటున్నారా?. హిందూ దేవాలయాల జోలికి వస్తే కబడ్ధార్ అంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతం?. టీడీపీ హయాంలో నిర్దాక్షిణ్యంగా దేవాలయాలను కూలగొడితే అప్పుడు ఏం చేశారు?. చట్టం, విధి విధానాలు గురించి తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. దిగజారిపోయి.. ఏ మాత్రం దేవాదాయ శాఖ గురించి అవగాహన లేకుండా సోము వీర్రాజు మాట్లాడుతున్నారు. మీ బీజేపీ మంత్రి హయాంలో 44 దేవాలయాలు కూలదోస్తే ఏమైనా మాట్లాడరా?. దేవాదాయ శాఖలో ఒక్క రూపాయి అవినీతి జరగకుండా కాపలా కాసున్నాము. దీనిపై సవాల్ చేస్తున్నాం కావాలంటే చూసుకోండి. దేవాలయాల ఆదాయం దేవాలయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చట్టంలో ఉంది. ప్రభుత్వం ఖజానా నుండి ప్రత్యేకంగా ఖర్చు చేయదని కూడా మీకు తెలియదా?. మీరు దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. నిబంధనలకు లోబడి మా ప్రభుత్వం పనిచేస్తుంది. నిబంధనలు అతిక్రమించి పనిచేస్తే చెప్పండి. సెక్షన్ 65/1,2,3, సెక్షన్ 70లను పరిశీలించండి. రాష్ట్రానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు ఉన్నప్పుడు అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు. బీజేపీకి దేశవ్యాప్తంగా దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయం చేయడం అలవాటైపోయింది.పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటో, ఆయన గమ్యం ఏంటో.. ఆయనకి కూడా తెలియదు. పవన్‌కు తెలిసింది ఒక్కటే.. పై నుండి వచ్చిన సూచనలు పాటించడమే. ఒక్క వైఎస్సార్సీపీతో తప్ప అన్ని పార్టీలతో సావాసం చేసిన ఘనత పవన్ కళ్యాణ్‌కే దక్కింది. పవన్ కళ్యాణ్ చేసేది పార్ట్ టైం పాలిటిక్స్. ఖాళీ ఉన్నప్పుడు వచ్చి షూటింగ్ ఉంటే వెళ్ళిపోతారు. ఇక, రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. వరదలను కూడా పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు అర్ధరహితం. మొదటి దశలోనే రోడ్లపై రూ. 2205 కోట్లు కేటాయించాము. 60 శాతం పనులు పూర్తి చేశాము. వర్షాల కారణంగా ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. 95 శాతం హామీలను అమలు చేశాము. జనసేన జోకర్ పార్టీలా ఉంది. మేనిఫెస్టోను దాచేసి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. పేదల సంక్షేమాన్ని చూసి చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబును సీఎం చేయాలన్నదే పవన్ తాపత్రయం. సోమవారం నుంచి శుక్రవారం వరకు తండ్రీకొడుకులు రాజకీయం చేస్తారు. శని, ఆదివారాల్లో పవన్‌కు కాల్షీట్లు ఇచ్చారు. పనిలేని పవన్.. పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కులాలు, మతాల గురించి పవన్ రాజకీయం చేస్తున్నారు అని విమర్శించారు. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దాడిశెట్టి రాజా
సాక్షి, అమరావతి: సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్లో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు దాడిశెట్టి తీసుకున్నారు. ఆయన తన ఛాంబర్లో బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు చెప్పట్టారు. కాగా, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. దాడి శెట్టి రాజాను మంత్రి సీటులో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ మినిస్టర్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. మంత్రిగా అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 3వేల కోట్లు రోడ్ల కోసం అప్పులు తెచ్చి ఎన్నికల కోసం ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పులు తీర్చటంతోపాటు కొత్తగా రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏపీని సింగపూర్, మలేషియా చేస్తామని చెప్పను కానీ.. రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ నేపథ్యం.. 2008లో ప్రజారాజ్యం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 2010లో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ తుని నియోజకవర్గం కో ఆర్డీనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2019 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవకాశం దక్కించుకున్నారు. -
‘చంద్రబాబు మద్దతు తెలపడం హాస్యాస్పదం’
సాక్షి, చీరాల: కరోనా కష్టకాలంలో ప్రాణ భయంతో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు నాయుడు, రాజధాని పేరుతో తన సామాజిక వర్గం చేస్తున్న 200 రోజుల కృత్రిమ ఉద్యమానికి మద్దతు తెలపడం హాస్యాస్పదం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో భూములు కాపాడుకునేందుకు చంద్రబాబు విదేశాల్లో ఉన్న తన సామాజిక వర్గంతో అమరావతిలో దొంగ దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో 300 కోట్ల రూపాయలతో చంద్రబాబు విదేశాల్లో జల్సాలు చేశారని విమర్శించారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజధాని వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యం అని ఆమంచి పేర్కొన్నారు. చంద్రబాబుకు మతి భ్రమిస్తోంది: కిలివేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి చంద్రబాబు మతి భ్రమిస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. శనివారం ఆయన నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిని గ్రాఫిక్స్ లో చూపెట్టి భ్రమరావతి చేసిన చంద్రబాబుకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 108, 104ల వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఒకేసారి 1088 అంబులెన్స్ వాహనాలను సీఎం జగన్ ప్రవేశపెడితే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు తాపత్రాయం : దాడిశెట్టి చంద్రబాబు నాయుడు అమరావతి లో ఉన్న తన భూముల కోసం తాప్రతాయ పడుతున్నడు తప్పా, ప్రజల అభివృద్ధి కోసం తాపత్రయం పడడం లేదని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. రాష్ట్ర బాగోగుల కంటే అమరావతిలో ఉన్న 30 గ్రామాల రియల్ ఎస్టేట్ బాగోగులే చంద్రబాబుకు ముఖ్యమని విమర్శించారు. శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ప్రకటిస్తే దానికి మోకాలడ్డుతూ చంద్రబాబు కోర్టుఓల కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. -
'ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు'
సాక్షి, తూర్పుగోదావరి : శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హెచ్చరించారు. తునిలో శుక్రవారం జరిగిన ఆందోళనకారుల దాడిలో అన్నక్యాంటీన్ ద్వంసమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఏర్పడ్డ అన్నక్యాంటీన్లు అవినీతిమయంగా మారాయని, టీడీపీకి చేందిన వారే క్యాంటీన్లను ద్వంసం చేసి దానిని ప్రభుత్వం మీదకు నెట్టివేస్తున్నారని ఆరోపించారు. -
పదో రోజుకు రిలే దీక్షలు
తుని : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యే దాడిశెట్టి ఆధ్వర్యంలో స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం పదో రోజుకు చేరాయి. కోటనందూరు మండలం బొద్దవరం, తొండంగి మండలం దానవాయిపేట, ఎ.కొత్తపల్లి పంచాయతీల పరిధిలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. వారికి పార్టీ తుని పట్టణ శాఖ అ«ధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వేంకటేష్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. రిలే దీక్షలో బొద్దవరానికి చెందిన దొడ్డి బాబ్జీ, సుర్ల నానాజీ, వేగి అప్పలనాయుడు, సుర్ల అప్పలనాయుడు, యల్లపు దొరబాబు, లగుడు వరహాలు, యల్లపు రామసూరి, మళ్ల శ్రీను, యల్లపు రాము, తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన మేరుగు ఆనందహరి, యనమల నాగేశ్వరరావు, గరికిన రాజు, మొసా సత్తిబాబు, అంగుళూరి శ్రీను, మడదా శ్రీనివాసరావు, మారేటి లక్ష్మణరావు, కుక్కా నాగరాజు, పిరాది గోపి, పి.పోలారావు, నేమాల రామకృష్ణ, అంబుజాలపు అచ్చారావు, ఎ.కొత్తపల్లికి చెందిన వనపిర్త సూర్యనారాయణ, సాపిశెట్టి చిన్న, వడ్లమూరి కృష్ణ, బెక్కం చంద్రగిరి, గర్లంక బాబ్జీ, డి.నాగు, మెయ్యేటి సత్యానందం, వనపర్తి రాఘవ, శివకోటి శేషారావు, గణ్ణియ్య, వెలుగుల చిట్టిబాబు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉద్యమాలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని దీక్షలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రుణపడి ఉన్నారన్నారు. అందరూ సమష్టిగా పోరాటం చేయకపోతే భావి తరాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఏకతాటిపై పోరాటం చేస్తే ఢిల్లీ పెద్దలు దిగివస్తారని నాయకులు స్పష్టం చేశారు. పదో రోజు దీక్ష చేస్తున్న వారికి పార్టీ నాయకులు షేక్ ఖ్వాజా, అనిశెట్టి నాగిరెడ్డి, కీర్తి రాఘవ, కుసనం దొరబాబు, నాగం గంగబాబు, గాబు రాజబాబు, బర్రే అప్పారావు, చోడిశెట్టి పెద్ద, వాసంశెట్టి శ్రీను, షేక్ బాబ్జి, కొప్పన రాజబాబు తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. -
38 మంది మత్స్యకారుల గల్లంతు
తూర్పు గోదావరి/విశాఖపట్నం: తూర్పు గోదావరి జిల్లాలో వేటకు వెళ్లిన 38 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలంటూ జిల్లా కలెక్టర్ ను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కోరారు. కోస్తా అంతటా మరో 24 గంటల్లో గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిషా సంబల్ పూర్‌కు 110 కి.మీ దూరంలో ఆగ్నేయ దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం క్రమేణ బలహీనపడి రేపటిలోగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని పేర్కొన్నారు. విశాఖ, గన్నవరం, భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు ప్రమాద హెచ్చిరికలు జారీచేశారు. ఉత్తర తెలంగాణకు మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.