తూర్పు గోదావరి/విశాఖపట్నం: తూర్పు గోదావరి జిల్లాలో వేటకు వెళ్లిన 38 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలంటూ జిల్లా కలెక్టర్ ను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కోరారు. కోస్తా అంతటా మరో 24 గంటల్లో గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిషా సంబల్ పూర్కు 110 కి.మీ దూరంలో ఆగ్నేయ దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం క్రమేణ బలహీనపడి రేపటిలోగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని పేర్కొన్నారు. విశాఖ, గన్నవరం, భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు ప్రమాద హెచ్చిరికలు జారీచేశారు. ఉత్తర తెలంగాణకు మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
38 మంది మత్స్యకారుల గల్లంతు
Published Sun, Jun 21 2015 10:11 PM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM
Advertisement