Dadisetti Raja Takes Charge as R&B Minister - Sakshi
Sakshi News home page

Dadisetti Raja: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దాడిశెట్టి రాజా

Published Wed, Apr 13 2022 12:22 PM | Last Updated on Wed, Apr 13 2022 1:58 PM

Dadisetti Raja Who Took Charge As R And B Minister In AP - Sakshi

సాక్షి, అమరావతి: సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు దాడిశెట్టి తీసుకున్నారు. ఆయన తన ఛాంబర్‌లో బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు చెప్పట్టారు. కాగా, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. దాడి శెట్టి రాజాను మంత్రి సీటులో కూర్చోబెట్టారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ మినిస్టర్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. మంత్రిగా అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 3వేల కోట్లు రోడ్ల కోసం అప్పులు తెచ్చి ఎన్నికల కోసం ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పులు తీర్చటంతోపాటు కొత్తగా రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏపీని సింగపూర్, మలేషియా చేస్తామని చెప్పను కానీ.. రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 

రాజకీయ నేపథ్యం..
2008లో ప్రజారాజ్యం పార్టీ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు 
మేరకు 2010లో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ తుని నియోజకవర్గం కో ఆర్డీనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.  2014, 2019 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో అవకాశం దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement