Chellaboina venugopal krishna
-
లోకేష్ కి మంత్రి చెల్లుబోయిన అదిరిపోయే కౌంటర్
-
‘పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో’
సాక్షి, కోనసీమ: ద్వారంపూడిపై పోటీచేసి గెలిచే దమ్ము పవన్ కల్యాణ్‌కు ఉందా అని బీసీ సంక్షేమం, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో కుల చిచ్చు రగులుస్తున్న పవన్‌కు ఒక సొంత విధానం, ఆలోచనలే లేవని ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ ఆరాటమని విమర్శించారు. కాపు, శెట్టిబలిజల ఐక్యతపై పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. కులం లేదంటూనే.. 75సార్లు కులప్రస్తావనెందుకు తీశారని మంత్రి పవన్‌ను నిలదీశారు. మహిళల భద్రత, సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదని అన్నారు. ప్రాణహాని అంటూ సానుభూతి కబుర్లను జనం నమ్మరని పేర్కొన్నారు. ఈ మేరకు రామచంద్రాపురం క్యాంపు కార్యాలయంలో చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో ‘పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో. ప్రజాజీవితంలో ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకులు చరిత్రలో నిలబడతారు. ఈ మేరకు వారు ప్రజల సేవలో తరిస్తూ ముందుకెళ్తుంటారు. మరోవైపు ప్రజామోదం లభించకపోవడంతో తీవ్రమైన ఫ్రస్టేషన్‌కు గురై ప్రగల్భాల ద్వారా ప్రజల్లో ఆకర్షణ పొందుతామని తాపత్రయం పడేవారు మరికొందరుంటారు. వీరిలో రెండోవర్గానికి చెందిన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అని చెప్పుకోవచ్చు. నిన్న కాకినాడలో పవన్అనేక ప్రగల్భాలు పలికాడు. నిజ జీవితాన్నే ఆయన సినిమా అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలు తగినట్లు ప్రభుత్వాన్ని నడిపిస్తూ చరిత్రలో ముందెన్నడూ లేని పాలనను చూపిస్తున్నారని’ కొనియాడారు. ప్రగల్భాలకే ప్రాధాన్యమిచ్చే పవన్‌ను నమ్మేదెవరు..? పార్టీని పదేళ్లుగా పోషిస్తున్నానంటూ పదేపదే పవన్‌కళ్యాణ్ చెబుతున్నాడు కదా.. నిజానికి, ఆ పార్టీని ఇన్నాళ్లూ పోషించిన వారంతా నాశనమయ్యారు. ఆ పార్టీలో ఇన్నాళ్లూ మొదటి శ్రేణిలో పనిచేసిన వారంతా కూడా ఈరోజు పార్టీని వదిలిపెట్టి వెళ్లారు. ఇందుకు కారణం కేవలం పవన్‌కళ్యాణ్ ప్రవర్తన మాత్రమే. ఈ విషయంపై ఆత్మపరిశీలన చేసుకుని ఆయన ఎప్పుడైనా ఆలోచించారా..? అని అడుగుతున్నాను. నిన్ను నమ్మి రాజకీయ ప్రయాణంలో గమ్యానికి చేరాలని వచ్చిన సీనియర్ మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పారిశ్రామికవేత్తలు వచ్చి పార్టీలో చేరి పనిచేస్తే.. నీ మీద నమ్మకం లేక, నీ ప్రవర్తన నచ్చకపోవడంతోనే కదా..వారంతా పార్టీని విడిచి వెళ్లింది’ అని ప్రశ్నించారు. ‘ద్వారంపూడి’ ఫోబియాతో పవన్యాత్ర నాడు గెలవలేని మీరు.. రేపు ఓడిస్తారా..? 2019 ఎన్నికల్లో ప్రజామోదం ద్వారా గెలవలేని పవన్‌కళ్యాణ్ 2024లో వైఎస్ఆర్సీపీని ఓడిస్తారా..? ఇదెంత హాస్యాస్పదమైన మాట. గడచిన నాలుగు రోజులుగా మీ వారాహీ యాత్రను చూసినట్లయితే, మా పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఫోబియాతోనే నడుస్తున్నట్లు అర్థమౌతుంది. మొన్న అన్నవరం నుంచి యాత్ర మొదలుపెట్టినదగ్గర్నుంచి రోజూ పవన్‌కళ్యాణ్ మాత్రం ద్వారంపూడి చంద్రశేఖర్ ఫోబియా పట్టుకుని పదేపదే అబద్ధాలు చెబుతున్నాడు. ఆయన ఆరోపణలన్నీ పసలేనివని అక్కడ ప్రజలే చెబుతున్నారు. ఎవడో చెప్పినవి, రాసిచ్చిన స్క్రిఫ్టును పట్టుకుని పవన్ వీరావేశం పడటంలో అర్ధమేముంటుంది..? ఆయన పిచ్చి మాటలకు కాకినాడ ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యంగాస్త్రాలు’ సంధించారు. ద్వారంపూడి సవాల్‌ను స్వీకరించే దమ్ముందా..? తనపై పవన్‌కళ్యాణ్ చేసిన ఆరోపణల్ని రుజువు చేయాలని ద్వారంపూడి చంద్రశేఖర్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు మీకు బహిరంగ సవాల్ విసురుతున్నాడు. తనపై చేసిన ఆరోపణల్ని ఆధారాలతో సహా రుజువు చేయాలని.. లేదంటే, కాకినాడలో నాపై పోటీచేస్తానని కాకినాడ యాత్ర ముగించేలోపు చెప్పాలంటూ సవాల్ విసిరాడు కదా.. మరి, మా నాయకుడు సవాల్‌ను స్వీకరిస్తారా పవన్‌కళ్యాణ్..? జనసేన పార్టీ అధినేతగా మీకు మీరే నిర్ణయం తీసుకున్నా సరే..లేదంటే, చంద్రబాబును అడిగి చెబుతానని చెప్పినా సరిపోతుంది. ఖచ్చితంగా మా ద్వారంపూడి చంద్రశేఖర్ గారి సవాల్‌ను స్వీకరించి ఆయనపై పోటీచేస్తే పవన్‌కళ్యాణ్‌కు ఒక విలువ, గౌరవం ఉంటుందని హితవు’ పలికారు. ప్రాణహాని ఉందంటూ సానుభూతి కబుర్లు ఆపాలి 2018లో పవన్‌కళ్యాణ్ తనకు ప్రాణహాని ఉందని ఆరోజు తన మిత్రుడు అధికారంలో ఉండగా అడిగాడు. అప్పట్లో పోలీసుల్ని కూడా తాను నమ్మనన్నాడు. మరి, ఈరోజు వారాహీ యాత్ర గత నాలుగురోజులుగా పూర్తి స్వేచ్ఛగా పోలీసు సెక్యూరిటీతో.. వారంతా మేకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు గదా..? అలాంటిది, మళ్లీ ఇప్పుడు నాకు ప్రాణహాని ఉందని పదేపదే ఎందుకు చెబుతున్నాడు..? నిజానికి, ప్రజలకోసం పనిచేసే నాయకుడు తన సొంత ప్రాణాన్ని కూడా పణంగా పెడతానని అనడం పరిపాటి. ఏ నాయకుడైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే తన ప్రాణాల్ని సైతం లెక్కచేయనని చెప్పుకోవడం’ మంచిదన్నారు. దేశానికే దిక్సూచీగా ఉన్న జగన్ విమర్శిస్తారా..? బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాం వంటి ఆదర్శనీయుల స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ రాష్ట్రంలోని సకలవర్గాల్ని అక్కునజేర్చుకుని సుభిక్షమైన పరిపాలనను అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పంపిణీలో టీడీపీ శ్రేణులతో సహా శెభాష్ అనిపించుకుంటూ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే కేంద్రాలతో దేశానికే దిక్సూచీగా జగన్‌గారు ఆదరణ పొందుతున్నారు. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకుని పవన్‌కళ్యాణ్ ఇష్టానుసారంగా దూషిస్తాడా..? ఆయనకున్న అర్హతేంటి..? చంద్రబాబును అధికారంలోకి తేవాలనే లక్ష్యంతోనే జనసేన పార్టీని పెట్టడం, ఆయన భజన చేసుకుంటూ.. వైఎస్ఆర్సీపీని విమర్శిస్తూ ప్రజల ముందు ప్రగల్భాలు పలుకుతూ తిరుగుతున్నాడు పవన్‌కళ్యాణ్. సినిమాల్లో ఆయనెంత హీరోనైనా.. రాజకీయాల్లో మాత్రం ఆయనొక స్థిరత్వంలేని దిగజారుడు మనస్తత్వంతో ముందుకుపోతున్నారని అన్నారు. 175 స్థానాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం.. ‘చంద్రబాబు చెప్పాడని.. ఈయనొచ్చి ఆయన కోసం మా నాయకుడ్ని తిడతాడా..? కులరాజకీయాలేమీ ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగడంలేదు. అలాంటి రాజకీయాలకు మా జగన్ గారు పూర్తిగా వ్యతిరేకం. పవన్‌కళ్యాణ్ చేస్తున్న కులరాజకీయ ఆరోపణల్ని పసలేనివని చెబుతూ నేను ఖండిస్తున్నాను. టీడీపీ నేతలు, చంద్రబాబు మాదిరిగా మా పార్టీకి ఓటేస్తేనే ప్రభుత్వ పథకాలిస్తామనేది మా విధానం కాదు. మాకున్న ఏకైక సిద్ధాంతమల్లా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతంతో పాటు రాజకీయ పార్టీ కూడా చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమం అందించాలనే లక్ష్యంతో మా నాయకుడు జగన్‌గారి ఆదేశాల్ని పాటిస్తున్నాం. బాబు 2012 నుంచి జగన్ గారి వ్యక్తిగత ప్రతిష్టతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పట్నుంచి బాబు చేసిన ఆరోపణలన్నింటినీ ప్రజలు నమ్మలేదుకదా..? ఆయన చేసిన విమర్శల కారణంగానే మాకు 2019లో 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు పవన్‌కళ్యాణ్ చేసే విమర్శలతో 2024లో 175 స్థానాలకు 175 స్థానాల్ని కైవసం చేసుకోబోతున్నామని ధీమాగా చెబుతున్నాను’ అని మంత్రి వ్యాఖ్యానించారు. -
ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి వేణుగోపాలకృష్ణ
-
కోనసీమ జిల్లా : వైభవంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం (ఫొటోలు)
-
వలంటీర్లపై రామోజీ విషపు రాతలు
సాక్షి, రాజమహేంద్రవరం: నిస్వార్థ సేవకులైన గ్రామ, వార్డు వలంటీర్లపై ఈనాడు రామోజీరావు విషపు రాతలు రాస్తున్నారని సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల దోపిడీ రామోజీ కళ్లకు కనిపించలేదా అని ప్రశ్నించారు. పింఛన్లు, ఇళ్ల మంజూరు హక్కును జన్మభూమి కమిటీలకు ఇచ్చారని, ఆ మేరకు జీవోలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. ‘అప్పట్లో ప్రతి పథకానికీ రేటు పెట్టిమరీ వసూళ్లకు పాల్పడ్డారని, అవేమీ మీ కళ్లకు కనిపించలేదా రామోజీ. నిస్వార్థ సేవకులైన వలంటీర్లపై అంత అక్కసు ఎందుకు వెళ్లగక్కుతున్నారు’ అని ప్రశ్నించారు. చంద్రబాబును జాకీలతో ఎత్తేందుకు ఈనాడు, రామోజీ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ఆశ నెరవేరదని తేల్చి చెప్పారు. వారిపై ఎందుకంత అక్కసు ‘ఈనాడులో వలంటీర్లపై విషం చిమ్ముతూ క«థనం రాశారు. వలంటీర్లు అంత నిస్వార్థంగా పని చేస్తుంటే.. రామోజీరావుకు ఎందుకంత అక్కసు. పెన్షన్ లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత జన్మభూమి కమిటీలకు అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2017 సెప్టెంబర్ 17న జీవో 135 జారీ చేస్తే రామోజీకి అది కనిపించలేదా. అది తప్పనిపించలేదా. హౌసింగ్ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత కూడా జన్మభూమి కమిటీలకు ఇస్తూ జీవో 36 జారీ చేశారు. అవేవీ రామోజీరావుకు తప్పుగా కనిపించలేదు. ఆ కమిటీలు ఎంత అవినీతికి పాల్పడినా పట్టించుకోలేదు’ అని వేణు ధ్వజమెత్తారు. నిజం చెప్పాలంటే వలంటీర్లు నిరుపేదల పాలిట దేవుళ్ల మాదిరిగా ఉన్నారన్నారు. డోర్ డెలివరీపై ఏనాడైనా రాశారా ప్రతినెలా కచ్చితంగా 1వ తేదీన ఆదివారం అయినా.. సెలవు రోజైనా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను లబ్ధిదారుల చేతిలో పెడుతున్న విషయాన్ని మంత్రి వేణు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే.. ఒక్క రోజైనా రాశారా అని నిలదీశారు. అలాంటివి రాయరని, ఎందుకంటే రామోజీకి కావాల్సిన వ్యక్తి సీఎం పదవిలో లేరని ఎద్దేవా చేశారు. వలంటీర్లు జన్మభూమి కమిటీల మాదిరిగా అవినీతికి పాల్పడే వారు కాదని, కాబట్టి వలంటీర్లు ఎలా ఉండాలో తెలుగుదేశం పార్టీ వలంటీర్లయిన రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు చెప్పడం మానేస్తే మర్యాదగా ఉంటుందని హితవు పలికారు. -
బీసీల పక్షపాతి సీఎం వైఎస్ జగన్ : మంత్రి చెల్లుబోయిన
-
‘లోకేష్ సంక్షేమం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో బీసీలకు నష్టం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, మంత్రి వేణుగోపాలకృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు మేలు జరిగింది. వంచన, కుట్ర, అబద్ధాలు చంద్రబాబు నైజం. బీసీలకు చంద్రబాబు శాపం. బీసీలను బాబు అవమానించారు. బీసీలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదు. కొడుకు సంక్షేమం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన వ్యక్తి చంద్రబాబు. రేపు జరిగే బీసీ సభ చంద్రబాబుకు కనువిప్పు కలిగిలిస్తుంది అని వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ మంత్రి గంగుల వ్యాఖ్యలు సరికావు : మంత్రి చెల్లుబోయిన వేణు
-
Jahnavi Dangeti: వ్యోమగామి కలకు సీఎం జగన్ చేయూత
సాక్షి, అమరావతి/పాలకొల్లు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలనే కలను సాకారం చేస్తూ సీఎం వైఎస్ జగన్ రూ.50 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసినట్టు పౌరసంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. సచివాలయంలో బుధవారం జాహ్నవికి చెక్కును అందజేశారు. చదవాలనే తపన ఉండి నిరుపేద విద్యార్థులకు సీఎం జగన్ ఎప్పుడూ అండగా నిలుస్తారని చెప్పారు. జాహ్నవి పంజాబ్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. వ్యోమగామి అవ్వాలనే లక్ష్యంతో నాసాతో పాటు పోలాండ్‌లో అనలాగ్ ఆస్ట్రోనాట్ శిక్షణ పొందింది. అయితే వ్యోమగామికి అంతర్జాతీయ సంస్థలో పైలెట్ శిక్షణ పొందాల్సి ఉండగా ఆర్థిక సాయం నిమిత్తం సీఎంని కలిసి కోరగా సానుకూలంగా స్పందించారు. నెలలోపే ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. జాహ్నవి మాట్లాడుతూ సీఎం దీవెనలతో త్వరలోనే శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తానని చెప్పారు. వ్యోమగామిగా దేశ కీర్తిని పెంచేందుకు కష్టపడతానని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాసరావు ఉన్నారు. విజయవాడలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను జాహ్నవి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా జాహ్నవిని పద్మ సత్కరించారు. (క్లిక్ చేయండి: చరిత్ర సృష్టించిన జాహ్నవి.. స్పేస్ కావాలి!) -
మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు ఏకపక్షం: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
-
బీసీలంటే టీడీపీకి ఎందుకంత ద్వేషం..?
సాక్షి,సీటీఆర్ఐ (కాకినాడ): బీసీలంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకంత ద్వేషమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. రాజమహేంద్రవరం మంజీర కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన ‘పేదల సంక్షేమ సమ్మేళనం’లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా పెద్ద పీట వేయడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మంత్రులు నిర్వహించిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను అవహేళన చేసేలా నారా లోకేశ్ మాట్లాడారని, ఆ మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి వేణు అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహానాడును బూతుల వేదికగా మార్చారన్నారు. ఎంత ఎక్కువగా తిడితే అంత చంద్రబాబు దృష్టిలో పడవచ్చని ఆ పార్టీ నాయకులు భావించారన్నారు. నారా లోకేశ్ ఒక అడుగు ముందుకేసి సామాజిక న్యాయభేరిలో పాల్గొన్న బీసీలను అవహేళన చేసేలా మాట్లాడటం చాలా దారుణమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే బీసీలకు మంత్రి పదవులు, నామినేటేడ్ పోస్టులు దక్కాయని చెప్పారు. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడం లోకేశ్‌కు ఇష్టం లేదన్నారు. టీడీపీకి ఏనాడో బీసీలు దూరం అయ్యారని మంత్రి అన్నారు. చదవండి: Complaint Against Nara Lokesh: నారా లోకేశ్‌కు బిగ్ షాక్.. పోలీసులను ఆశ్రయించిన మాజీ టీడీపీ నేత -
జగనన్న ముద్దు.. బాబు అస్సలు వద్దు: మంత్రి వేణుగోపాలకృష్ణ
-
అమలాపురం ఘటనను పవన్ ఎందుకు ఖండించలేదు: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, కాకినాడ: అమలాపురంలో జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గు పడేలా ఉందని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. 35 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. అమలాపురం ఘటనను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాటలు వింటే అంబేద్కర్ జిల్లాకు వ్యతిరేకమని అర్దం అవుతుందని, అంబేద్కర్ పేరు పెట్టడానికి పవన్ అనుకూలమా? వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు మంత్రి వేణుగోపాల్ కాకినాడలో బుధవారం మాట్లాడుతూ.. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పవన్ చదివినట్లు కనిపిస్తోందన్నారు. ఉద్యమం ముసుగులో వచ్చిన ఎవరిని విడిచిపెట్టమని తెలిపారు. వినతులు స్వీకరణ కోసం 30 రోజుల సమయం ప్రభుత్వం ఇచ్చిందని, జిల్లా మార్పుపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే పద్ధతి ఇదేనా అని నిలదీశారు. కోనసీమ అల్లర్ల సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎంతో సహనాన్ని వహించారన్నారు. కోనసీమ వాసులందరూ సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ వికృత కీడకు యువకులు బలికావొద్దని మంత్రి కోరారు. చదవండి: ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్సార్సీపీ -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దాడిశెట్టి రాజా
సాక్షి, అమరావతి: సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్లో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు దాడిశెట్టి తీసుకున్నారు. ఆయన తన ఛాంబర్లో బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు చెప్పట్టారు. కాగా, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. దాడి శెట్టి రాజాను మంత్రి సీటులో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ మినిస్టర్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. మంత్రిగా అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 3వేల కోట్లు రోడ్ల కోసం అప్పులు తెచ్చి ఎన్నికల కోసం ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పులు తీర్చటంతోపాటు కొత్తగా రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏపీని సింగపూర్, మలేషియా చేస్తామని చెప్పను కానీ.. రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ నేపథ్యం.. 2008లో ప్రజారాజ్యం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 2010లో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ తుని నియోజకవర్గం కో ఆర్డీనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2019 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవకాశం దక్కించుకున్నారు. -
లోకేశ్‌వి మతి తప్పిన మాటలు : మంత్రి చెల్లుబోయిన
సాక్షి, అమరావతి: ప్రజాబలంతో గెలవలేని నారా లోకేశ్ అజ్ఞానంతో ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కా ర్యాలయంలో మంత్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఆక్షేపించారు. చంద్రబాబు చిటికేస్తే జగన్ బయటకి వచ్చే వాడే కాదనీ వైఎస్సార్సీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని లోకేశ్ మతి తప్పి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని లోకేశ్ లాంటి వ్య క్తి ఆవిష్కరిస్తే ఆ మహానుభావుడి ఆత్మ క్షోభి స్తుందని ఎద్దేవా చేశారు. మాయ మాటలతో మభ్యపెట్టడం బాబు నైజమని ధ్వజమెత్తారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఉదయం విఐపి దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న యాగానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలన్నారు. మంచి కార్యక్రమాలు చేసే వారికే కష్టాలు వస్తుంటాయి, స్వామివారి అనుగ్రహంతో అన్ని సవ్యంగా జరుగాతాయని తెలిపారు. అంతర్వేదిలో నూతన రథం పూర్తి అయిందని, తన నియోజకవర్గంలో 95 శాతం వైస్సార్సీపీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా ఎన్నికలలో గెలిచారని తెలిపారు. అదే విధంగా ఈ రోజు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, విశాఖపట్నం ఎమ్మెల్యే వి గణేష్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
సీఎం సంకల్పం సిద్ధించాలి: మంత్రి గోపాలకృష్ణ
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కి ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి దివ్య ఆశీస్సులతో సొంత ఇంటి కల నెరవేరే విధంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారని తెలిపారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరగాలి అన్నారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు సీఎం సంకల్పం సిద్దించి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. చదవండి: ఏపీ పోలీస్.. దేశానికే ఆదర్శం -
అబద్దాలు చెబితే జనం నమ్ముతారని బాబు అనుకుంటున్నారు
-
ఆయన మంత్రివర్గంలో పని చేయడం అదృష్టం
సాక్షి, విజయవాడ: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నెరవేరుస్తూ బలహీనవర్గాలకి అండగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులతో కలిసి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకి ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలె అని గుర్తు చేశారు. పూలే ఆశయాలని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని సీఎం వైఎస్ జగన్ బలహీనవర్గాలని బ్యాక్‌బోన్‌గా చూస్తున్నారని తెలిపారు. ఎన్నో సంక్షేమ పధకాలతో బలహీన వర్గాలకి అండదండగా నిలబడిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమన్నారు. చదవండి: మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే బలహీనవర్గాలకి 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని కొనియాడారు. ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి లాంటి సంక్షేమ పధకాలతో సీఎం వైఎస్ జగన్ బలహీనవర్గాల జీవితాలలో పెను మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహిళలకి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా సీంఎ జగన్ బీసీ మహిళల జీవితాలలో వెలుగులు నింపారన్నారని తెలిపారు. విద్యకి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా బీసీలు ఉన్నత చదువులు అభ్యసించడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడిన సీఎం జగన్ మంత్రివర్గంలో పనిచేయడం మా అదృష్టమని తెలిపారు. బలహీనవర్గాలకి అండగావుంటున్న తమ ప్రభుత్వానికి మహాత్మా జ్యోతిరావు పూలె ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. -
‘సంక్షేమ యజ్ఞాన్ని అడ్డుకునే రాక్షషులు’
సాక్షి, తాడేపల్లి: పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ‘వైఎస్సార్ చేయూత’ పధకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో మహిళలు తమ కష్టాలను సీఎం జగన్‌కు చెప్పుకున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా మహిళలను ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మహిళలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల మహిళకు ‘వైస్సార్ చేయూత’ ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు. 23లక్షల మంది మహిళలు ఈ పధకం ద్వారా లబ్ధి పొందుతారని తెలిపారు. ఓట్లు కొనడం కోసం ఎన్నికలు ముందు ‘పసుపు కుంకుమ’ పథకాన్ని చంద్రబాబు ప్రవేశ పెట్టారని మండిపడ్డారు. కానీ, ఆ పథకాన్ని ప్రవేశ పెట్టిన బాబుకు 23 స్థానాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. సంక్షోభంలో సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అడ్డం పెట్టుకొని బాబు తన కొడుకు క్షేమం కోసం పాటుపడ్డాడని దుయ్యబట్టారు. ఇష్టానుసారంగా రాసే మీడియా బాబు చేతిలో ఉండడంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ చేయూతపై విమర్శలు చేస్తే బాబుకు మళ్లీ మహిళలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళను మోసం చేశారని విమర్శించారు. మహిళల ఇంటికి బంగారం పంపిస్తామని చెప్పి బాబు బ్యాంక్‌ల నుంచి నోటీసులు పంపించారని విరుచుకుపడ్డారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలు జగనన్న తమకు తోడుగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బీసీలను అనేక రకాలుగా చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసే మంచిని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. పురాణాల్లో రాక్షషులు యజ్ఞాన్ని అడ్డుకున్నట్లు సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని అన్నారు. బీసీ సంక్షేమంపై టీడీపీ నేతలతో చర్చకు తాము సిద్ధమని తెలిపారు. బీసీల వెన్ను చంద్రబాబు నాయుడు విరిచారని మండిపడ్డారు. -
బాధ్యతలు చేపట్టిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
-
బాధ్యతలు చేపట్టిన మంత్రి శంకర్ నారాయణ
సాక్షి, అమరావతి: మంత్రి శంకర్ నారాయణ బుధవారం రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సదర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక- జి.ముళ్లపాలెం రహదారి కొత్త వంతెన పనులకు సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తనకు ఆర్ అండ్ బి శాఖ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల అమలులో తనను ముఖ్య భాగస్వామిని చేశారని పేర్కొన్నారు. మొదటి సారిగా గెలిచిన తనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు కీలక శాఖలు ఎస్సీ, ఎస్టీ బలహీన, మైనారిటీ వర్గాలకు కేటాయించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు వేల కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు గాను రూ. 6400 కోట్లతో ఎన్డీబితో చేసుకున్న ఒప్పందంపై మొదటి సంతకము చేశానని పేర్కొన్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అదే విధంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని డోన్‌లో బాలికల రెసిడెన్సియల్ స్కూల్, బేతంచెర్లలో బాలుర రెసిడెన్సియల్ స్కూల్‌ను జానియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసే ఫైళ్లపై మంత్రి వేణుగోపాలకృష్ణ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. తను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన వరాలన పంచుతానని తెలిపారు. తమకు గుర్తింపు లేదని ఆత్మ నూన్యతతో ఉన్న బలహీనవర్గాలకు సీఎం వైఎస్ జగన్ పాలనలో గుర్తింపు ఉంటుందన్నారు. బలహీన వర్గాల సంఘల నాయకుల సమస్యను సరైన రీతిలో పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రి శంకర్ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు. (గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు) -
బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చింది సీఎం జగన్ ఒక్కరే
-
‘బీసీలకు వెన్నుదన్నుగా సీఎం జగన్’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను తనకు ఇవ్వటం ఎంతో సంతోషం ఉందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు బీసీలందరికీ సేవ చేసే అవకాశం దక్కిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని ప్రాధాన్యత బీసీలకు సీఎం జగన్ ఇస్తున్నారని గుర్తుచేశారు. బీసీలకు ఏడాదిలోనే రూ. 22 వేల కోట్ల సంక్షేమ పధకాలిచ్చారని తెలిపారు. బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చింది సీఎం జగన్ ఒక్కరే అన్నారు. (మంత్రులుగా చెల్లుబోయిన, సీదిరి) త్వరలో 52 కార్పొరేషన్లతో బీసీలకు గొప్ప మేలు జరగబోతోందని మంత్రి పేర్కొన్నారు. బీసీలకు నామినేటెడ్ పదవుల్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. బీసీలకు సీఎం జగన్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని తెలిపారు. బీసీలను చంద్రబాబు మోసం చేస్తే సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జనాభాకు తగ్గట్టుగా బీసీలకు పధకాలు ఇస్తున్న ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. ఇక బుధవారం శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బీసీ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
మంత్రులుగా చెల్లుబోయిన, సీదిరి
సాక్షి, అమరావతి/ విజయవాడ పశ్చిమ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో కొత్తగా నియమితులైన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు బుధవారం రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మధ్యాహ్నం 1.29 గంటలకు వారి చేత ప్రమాణం చేయించారు. కొత్తగా మంత్రివర్గంలో చేరుతున్న వారి పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ప్రకటించారు. తొలుత వేణుగోపాలకృష్ణ, తరువాత అప్పలరాజు ఇద్దరూ దైవసాక్షిగా పదవీ ప్రమాణం చేశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఉపముఖ్యమంత్రిగా నియమితులైన ధర్మాన కృష్ణదాస్, మంత్రులు ఆళ్లనాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పాదాభివందనాన్ని వారించిన సీఎం జగన్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వద్దకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌కు పాదాభివందనం చేయబోయారు. ఆయన వెంటనే అడ్డుకుని వారిని వారించారు. బీసీలకు పెద్ద పీట: ధర్మాన కృష్ణదాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గంలోనూ, రాజకీయ పదవుల్లోనూ బీసీలకు పెద్ద పీట వేశారని ఉపముఖ్యమంత్రిగా నియమితులైన ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడారు. ► ఒకేసారి ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత వైఎస్ జగన్‌దే. ► మంత్రివర్గ కూర్పులో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను తీసుకుని అందరికీ సామాజిక న్యాయం చేశారు. ► నాకు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. రాజ్‌భవన్‌లో చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజులతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. చిత్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెట్లెక్కే కాళ్లను పార్లమెంటు మెట్లు ఎక్కించారు: శ్రీనివాసవేణుగోపాలకృష్ణ ► శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి సుభాష్ చంద్రబోస్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా చెట్లెక్కే కాళ్లను పార్లమెంటు మెట్లు ఎక్కించిన ఘనత వైఎస్ జగన్‌దే. ► దివంగత రాజశేఖరరెడ్డి 2006, జూలై 22న నన్ను జడ్పీ చైర్మన్‌ను చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020, జూలై 22న నన్ను రాష్ట్రమంత్రిని చేశారు. పారదర్శకతతో పనిచేస్తా: అప్పలరాజు ► నాపై నమ్మకం ఉంచి మంత్రి పదవిని ఇచ్చినందుకు పారదర్శకతతో పని చేస్తా. ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి కృషి చేస్తా. జడ్పీటీసీ నుంచి మంత్రి పదవి వరకు చెల్లుబోయిన... తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం శంకరగుప్తం శివారు అడవిపాలెంలో చెల్లుబోయిన వెంకన్న, సుభద్రమ్మ దంపతులకు 1962లో శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జన్మించారు. 2001లో రాజోలు జడ్పీటీసీ సభ్యునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2006లో మరోసారి జడ్పీటీసీ సభ్యునిగా గెలిచి, జడ్పీ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీలో పీసీబీ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్సార్సీపీలో చేరి, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి 2014లో పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి తోట త్రిమూర్తులుపై విజయం సాధించి, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఏపీ బాక్సింగ్ సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వైద్య వృత్తి నుంచి మంత్రి వరకు సీదిరి... శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో సీదిరి దానమ్మ, నీలయ్య దంపతులకు 1980లో సీదిరి అప్పలరాజు జన్మించారు. పదో తరగతిలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి జనరల్ మెడిసిన్‌లో ఎండీ పట్టా పొందారు. కొంతకాలం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనంతరం 12 ఏళ్లపాటు కాశీబుగ్గలో వైద్యసేవలు అందించారు. 2017లో వైఎస్సార్ సీపీలో చేరి, పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ శాసనసభా కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాలీబాల్ క్రీడాకారుడి నుంచి డిప్యూటీ సీఎం వరకు కృష్ణదాస్... గతంలో జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడు అయిన ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాం. ఆయన 1952లో జన్మించారు. విశాఖ బుల్లయ్య కాలేజీలో బీకాం చదివి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో 15 ఏళ్లపాటు ఉద్యోగం చేశారు. 2003లో రాజకీయ ప్రవేశం చేసి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున, 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, విజయనగరం జిల్లా పార్టీ పరిశీలకుడిగా గతంలో పనిచేశారు. 2014లో ఓడినా... మళ్లీ 2019లో గెలిచి మంత్రి పదవి చేపట్టారు. గతంలో జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడు అయిన కృష్ణదాస్ ఐదేళ్ల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ వాలీబాల్ పోటీలకు జాతీయ జట్టు మేనేజర్‌గా పనిచేశారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయనకు సోదరుడు. సాక్షి, అమరావతి: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదోన్నతి కల్పించారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. శాఖలు కూడా మార్చారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన ఇద్దరు మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. ► ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి పొందిన ధర్మాన కృష్ణదాస్‌కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలను ఇచ్చారు. ఇటీవలి వరకూ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ వద్ద ఉన్న ఈ శాఖలను.. ధర్మానకు కేటాయించారు. ► మంత్రివర్గం నుంచి వైదొలగిన మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వద్ద ఉండిన పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలను సీదిరి అప్పలరాజుకు కేటాయించారు. ► ఇక చెల్లుబోయినకు బీసీ సంక్షేమ శాఖను ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈ శాఖ మంత్రిగా ఉన్న ఎం.శంకరనారాయణను రోడ్లు–భవనాలు శాఖకు మార్చారు. ఇప్పటి వరకూ మంత్రి హోదాలో ధర్మాన కృష్ణదాస్ రోడ్లు, భవనాల శాఖను చూసేవారు. బోసు, వెంకటరమణారావు రాజీనామాల ఫలితంగా వీరి శాఖలు నిబంధనల ప్రకారం సీఎం వైఎస్ జగన్ వద్ద ఉండేవి. కొత్త మంత్రులు చేరడంతో ఈ మార్పులు అవసరమయ్యాయి. కొత్త మంత్రుల శాఖలు ఇలా.. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ బీసీ సంక్షేమం సీదిరి అప్పలరాజు పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ పదోన్నతి ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మార్పు ఇలా.. శంకరనారాయణ రోడ్లు, భవనాల శాఖ