
సాక్షి, అమరావతి: ప్రజాబలంతో గెలవలేని నారా లోకేశ్ అజ్ఞానంతో ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కా ర్యాలయంలో మంత్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఆక్షేపించారు.
చంద్రబాబు చిటికేస్తే జగన్ బయటకి వచ్చే వాడే కాదనీ వైఎస్సార్‌సీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని లోకేశ్ మతి తప్పి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని లోకేశ్ లాంటి వ్య క్తి ఆవిష్కరిస్తే ఆ మహానుభావుడి ఆత్మ క్షోభి స్తుందని ఎద్దేవా చేశారు. మాయ మాటలతో మభ్యపెట్టడం బాబు నైజమని ధ్వజమెత్తారు.