విజయవాడ, సాక్షి: రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా?. తన తనయుడు, మంత్రి నారా లోకేష్ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలపై అధికార వర్గాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెడ్ బుక్ పాలనతో రెచ్చిపోమ్మని చినబాబుకు హక్కులు కట్టబెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు పాలనాపరమైన వ్యవహారాలను సైతం తనయుడి కోసం వాయిదా వేస్తుండడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
నారా లోకేష్ పర్యటనల వివరాలు టీడీపీ వర్గాలకే తెలియకుండా రహస్యంగా ఉంచుతుంటారు చంద్రబాబు. తాజాగానూ ఆయన అలాంటి పర్యటనలోనే ఉన్నారట. ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం.. రేపటికి వాయిదా పడింది. ఇందుకు లోకేషే కారణం. తొలుత ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయి. అయితే.. లోకేష్ విహార యాత్ర ఉందని తెలియక ఆ ఆదేశాలు పంపిన సీఎస్.. ఆ వెంటనే తేదీని మార్చేసి మరోసారి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదేం కొత్త కాదు.
ఈ నెలలోనే ఇలా జరగడం రెండోసారి. ఈ నెల రెండో తేదీ జరగాల్సిన కేబినెట్ భేటీని లోకేష్ విహారయాత్ర నేపథ్యంలోనే.. 7వ తేదీకి మార్చారు. ఇప్పుడు కూడా రహస్య పర్యటన నేపథ్యంలోనే మరోసారి మార్చారు. ఒక మంత్రి లేకుండా కేబినెట్ సమావేశం వాయిదా వేసిన దాఖలాలు గత ప్రభుత్వాల్లో ఏనాడూ లేదని, లోకేష్ సీఎం చంద్రబాబు కొడుకు కాబట్టే ఇలా నడుస్తోందని అధికార వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇంకెన్ని చిత్రాలు చూడాలో?!.
ఇదీ చదవండి: కాల్చుకు తింటున్న కూటమి సర్కార్!
Comments
Please login to add a commentAdd a comment