
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కి ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి దివ్య ఆశీస్సులతో సొంత ఇంటి కల నెరవేరే విధంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారని తెలిపారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరగాలి అన్నారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు సీఎం సంకల్పం సిద్దించి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. చదవండి: ఏపీ పోలీస్.. దేశానికే ఆదర్శం