
సాక్షి,తాడేపల్లి : ప్రముఖ సంగీత విద్వాంసులు, శాస్త్రీయ సంగీత గాయకుడు, స్వరకర్త గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గరిమెళ్లకు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా బాలకృష్ణ ప్రసాదు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు వైఎస్ జగన్. సంగీత విద్వాంసుడిగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలనకు స్వరకల్పన చేసి.. అన్నమాచార్యుల వారి సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు వైఎస్ జగన్.
Comments
Please login to add a commentAdd a comment