Tirumala Laddu Row: రేపు తిరుమలకు వైఎస్‌ జగన్‌ | Tirupati Laddu Prasadam Row: YS Jagan Tirumala Visit Schedule Details | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూ వివాదం: రేపే తిరుమలకు వైఎస్‌ జగన్‌.. ఎల్లుండి స్వామివారి దర్శనం, పూజలు

Published Thu, Sep 26 2024 10:34 AM | Last Updated on Thu, Sep 26 2024 10:53 AM

Tirupati Laddu Prasadam Row: YS Jagan Tirumala Visit Schedule Details

గుంటూరు, సాక్షి:  శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకతీతంగా ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పిలుపు ఇచ్చారు.

ఈ శనివారం(సెప్టెంబర్‌ 28) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ కేడర్‌కు ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రే ఆయన తిరుమల చేరుకోనున్నారు. శనివారం ఉదయమే ఆయన స్వామివారిని దర్శించుకుంటారు.

అంతకు ముందు.. తిరుమల పవిత్రతను, వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విశిష్టతను, స్వామి వారి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను చంద్రబాబు తన రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారని జగన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బాబు లడ్డు కుట్ర.. పోలీసుల వత్తాసు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement