సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఉదయం విఐపి దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న యాగానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలన్నారు. మంచి కార్యక్రమాలు చేసే వారికే కష్టాలు వస్తుంటాయి, స్వామివారి అనుగ్రహంతో అన్ని సవ్యంగా జరుగాతాయని తెలిపారు. అంతర్వేదిలో నూతన రథం పూర్తి అయిందని, తన నియోజకవర్గంలో 95 శాతం వైస్సార్‌సీపీ మద్దతుదారులు సర్పంచ్లుగా ఎన్నికలలో గెలిచారని తెలిపారు.
అదే విధంగా ఈ రోజు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, విశాఖపట్నం ఎమ్మెల్యే వి గణేష్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment