
సాక్షి, అమరావతి: మంత్రి శంకర్ నారాయణ బుధవారం రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సదర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక- జి.ముళ్లపాలెం రహదారి కొత్త వంతెన పనులకు సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తనకు ఆర్ అండ్ బి శాఖ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల అమలులో తనను ముఖ్య భాగస్వామిని చేశారని పేర్కొన్నారు. మొదటి సారిగా గెలిచిన తనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు కీలక శాఖలు ఎస్సీ, ఎస్టీ బలహీన, మైనారిటీ వర్గాలకు కేటాయించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు వేల కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు గాను రూ. 6400 కోట్లతో ఎన్డీబితో చేసుకున్న ఒప్పందంపై మొదటి సంతకము చేశానని పేర్కొన్నారు.
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
అదే విధంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని డోన్‌లో బాలికల రెసిడెన్సియల్ స్కూల్, బేతంచెర్లలో బాలుర రెసిడెన్సియల్ స్కూల్‌ను జానియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసే ఫైళ్లపై మంత్రి వేణుగోపాలకృష్ణ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. తను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన వరాలన పంచుతానని తెలిపారు. తమకు గుర్తింపు లేదని ఆత్మ నూన్యతతో ఉన్న బలహీనవర్గాలకు సీఎం వైఎస్ జగన్ పాలనలో గుర్తింపు ఉంటుందన్నారు. బలహీన వర్గాల సంఘల నాయకుల సమస్యను సరైన రీతిలో పరిష్కరిస్తామని తెలిపారు.
మంత్రి శంకర్ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు. (గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు)
Comments
Please login to add a commentAdd a comment