
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో బీసీలకు నష్టం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
కాగా, మంత్రి వేణుగోపాలకృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు మేలు జరిగింది. వంచన, కుట్ర, అబద్ధాలు చంద్రబాబు నైజం. బీసీలకు చంద్రబాబు శాపం. బీసీలను బాబు అవమానించారు. బీసీలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదు. కొడుకు సంక్షేమం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన వ్యక్తి చంద్రబాబు. రేపు జరిగే బీసీ సభ చంద్రబాబుకు కనువిప్పు కలిగిలిస్తుంది అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment