హైదరాబాద్ : ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్లు లేక 3,200 మంది మరణించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా భావించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని నిర్లక్ష్యం వల్లే ఈ మరణాలు సంభవించాయని విమర్శించారు. జనవరిలోనే వెంటిలేటర్లు కొనుగోలు చేసి ఉంటే.. వీరంతా బతికుండేవారన్నారు. ఈ మరణాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్కు వెంటనే నిధులు కొరత తీర్చాలని ప్రభుత్వానికి వేణుగోపాలకృష్ణ సూచించారు.