R and B Department
-
రోడ్లు బాగు చేస్తున్నా.. విషప్రచారం ఆగట్లేదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై దురుద్దేశంతోనే కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన రోడ్లు, భవనాల శాఖపై పంచాయితీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల వద్ద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయండి. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయండి. మరలా రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం కనిపించకూడదు. కనీసం ఏడేళ్లైనా అవి పాడవ్వకుండా ఉండేలా చూసుకోండి. తద్వారా నిర్వహణ కూడా సజావుగా, నాణ్యతతో సాగుతుందని అధికారులను ఆదేశించారాయన. ఇందుకోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తిచేయాలని సూచించారాయన. నేల స్వభావంతోనే సమస్య.. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు. అయితే.. ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీని వాడితే ప్రయోజనం ఉంటుందని అధికారులు ప్రతిపాదించగా.. అందుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందన్న సీఎం జగన్.. మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో చేపట్టాలని ఆదేశించారు. వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని, అలాగే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. కడప, బెంగళూరు రైల్వేను లైనుపై దృష్టిపెట్టాలని, విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని అధికారులకు తెలిపారాయన. బాగు చేస్తున్నా.. విషప్రచారమే! అధికారులతో సీఎం జగన్.. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ఆ వివరాలను ప్రజల ముందు ఉంచాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ‘‘ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్ ప్రచారం తప్పట్లేదు. దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా.. కంటగింపుతో విష ప్రచారం చేస్తున్నాయి. వాళ్ల కడుపుమంటకు మందులేదు. అందుకే మనం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలి. అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలి. ఆయా ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలి అని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఏపీసీఎం ఎంఎస్ యాప్ ప్రారంభం పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్ యాప్‌ను ఈ సమీక్షా సమావేశంలోనే సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులు ఎవరైనా ఈ యాప్ ద్వారా రోడ్ల గురించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అలాగే.. ఫొటోలను సైతం అప్లోడ్ చేసే అవకాశం ఉంది ఈ యాప్‌లో. జియో కోఆర్డినేట్స్‌తో పాటుగా ఫిర్యాదు నమోదుతో పాటు దీనిపై కమాండ్ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే.. ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని వెంటనే చర్యలు చేపడతారు అధికారులు. రిపేర్ మాత్రమే కాదు.. నాణ్యత మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు ఏ సమస్యలు రావని సీఎం జగన్.. అధికారులతో అన్నారు. పట్టణాలు, నగరాలు ఎక్కడైనా సరే రోడ్ల మరమ్మతులు నాణ్యమైన ప్రమాణాలతో జరగాలని పేర్కొన్నారాయన. ఫలానా చోట రోడ్డు రిపేరు చేయాలని ఏపీసీఎం ఎంఎస్ ద్వారా ఫిర్యాదు అందితే.. 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలి. ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. అంతేకాదు.. యాప్ పనితీరు, అందులో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతరం సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి. రోడ్ల మరమ్మతులపై అధికారులంతా ప్రత్యేక దృష్టిపెట్టాలి. కేవలం రిపేర్ మాత్రమే కాదు.. నాణ్యత మీదా ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్ల రిపేర్‌లో దీర్ఘకాలం నిలిచేలా టెక్నాలజీ సాయం తీసుకోండి. ఇకపైన కూడా రోడ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులు రావాలని సీఎం జగన్ అధికారుల వద్ద ఆకాంక్షించారు. -
హౌజింగ్బోర్డును ఎత్తేసిన తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హౌజింగ్ బోర్డును ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. గృహ నిర్మాణ శాఖ ఆస్తులు, పథకాలు, ఉద్యోగులను.. ఆర్ అండ్ బీ శాఖలో విలీనం చేసింది. హౌజింగ్ బోర్డుతో పాటు రాజీవ్ స్వగృహ, దిల్(దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్) సంస్థలకూ ఈ కీలక నిర్ణయం వర్తించనుంది. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అందుకోసం అదనపు నిధులను కూడా మంజూరు చేసింది. ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ చేసిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో అధికారులు స్వీయ నిర్ణయంతో ప్రజావసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కేబినెట్ అవకాశమిచ్చింది. పోలీస్‌శాఖలో నియామకాలు రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మొత్తం 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. వీటితోపాటు.. మూడు కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గురుకులాల్లో పోస్టుల భర్తీ తెలంగాణ మంత్రివర్గం మహాత్మా జ్యోతి బాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ గురుకులాల్లోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. మొత్తం 2,591 నూతన ఉద్యోగాల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో, అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. వరాలు... రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో.. కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు, 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు, 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 102 డి.ఈ.ఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. చదవండి: పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం పెరిగిన నూతన ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బీ శాఖలో పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖ లోని.., రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో... 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను., 10 సర్కిల్ కార్యాలయాలను., 13 డివిజన్ కార్యాలయాలను., 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను కేబినెట్ ఆదేశించింది. రోడ్లు భవనాల శాఖను మరింత పటిష్ట పరిచేందుకు ప్రజావసరాల దృష్ట్యా పనులు చేపట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతుల (పీరియాడిక్ రెన్యువల్స్) కోసం, కూ. 1865 కోట్లను మంజూరు చేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు గాను.. రూ. 635 కోట్ల నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. వానలు వరదలు తదితర ప్రకృతి విపత్తుల సందర్భంలో, ప్రజావసరాలకు అనుగుణంగా, అసౌకర్యాన్ని తొలగించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు.. వీలుగా కింది స్థాయి డీఈఈ నుంచిపై స్థాయి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకుని పనులు చేపట్టేందుకు డిఈఈకి ఒక పనికి రూ. 2లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు), ఈఈకి 25 లక్షల వరకు(ఏడాదికి 1.5 కోట్లు), ఎస్ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి 2 కోట్లు), సీఈ పరిధిలో రూ.1 కోటి వరకు(సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందు కోసం ఏడాదికి రూ.129 కోట్లు ఆర్అండ్బీ శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది. ఇదే పద్దతిని అనుసరిస్తూ.. భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. అత్యవసర పనులు చేపట్టేందుకు పరిమిత నిధులతో స్వీయ నిర్ణయాధికారాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దాడిశెట్టి రాజా
సాక్షి, అమరావతి: సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్లో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు దాడిశెట్టి తీసుకున్నారు. ఆయన తన ఛాంబర్లో బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు చెప్పట్టారు. కాగా, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. దాడి శెట్టి రాజాను మంత్రి సీటులో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ మినిస్టర్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. మంత్రిగా అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 3వేల కోట్లు రోడ్ల కోసం అప్పులు తెచ్చి ఎన్నికల కోసం ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పులు తీర్చటంతోపాటు కొత్తగా రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏపీని సింగపూర్, మలేషియా చేస్తామని చెప్పను కానీ.. రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ నేపథ్యం.. 2008లో ప్రజారాజ్యం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 2010లో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ తుని నియోజకవర్గం కో ఆర్డీనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2019 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవకాశం దక్కించుకున్నారు. -
‘ఆర్అండ్బీ’కి మెడికల్ ప్రాజెక్టులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణంలో తలమునకలై ఉన్న రోడ్లు, భవనాల శాఖ త్వరలో ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్ట నుంది. నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రు లు, ఏడు మెడికల్ కాలేజీలు, 13 నర్సింగ్ కాలే జీలను నిర్మించాలని ఇటీవలే కేబినెట్ నిర్ణయిం చిన విషయం తెలిసిందే. వీటి నిర్మాణానికి దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మెడికల్ ప్రాజెక్టుకు సంబంధించి త్వర లో ఆర్ అండ్ బీ స్థలాల పరిశీలన ప్రారంభించ నుంది. ఆ తర్వాత డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లు పిలవనుంది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే మెడికల్ ప్రాజెక్టు పూర్తి కోసం ఖాళీలు భర్తీ చేయాలని ఆర్అండ్బీ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. పలు కేటగిరీలకు చెందిన 200 ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదించింది. నిర్మించాల్సిన కొత్త మెడికల్ కాలేజీలు.. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు కొత్త నర్సింగ్ కళాశాలలు: సంగారెడ్డి, మహబూ బాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్త గూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట కొత్త సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు: వరంగల్, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలం, అల్వాల్–ఓఆర్ఆర్ మధ్య. -
రోడ్లపై ‘రైల్వే’ బ్రేకులకు సెలవు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై ఎక్కడా ‘రైల్వే’ బ్రేకులు పడకుండా ప్రయాణం సాఫీగా సాగడానికి మార్గం సుగమమయ్యింది. రోడ్డు ప్రయాణంలో రైల్వే గేట్ల వద్ద నిరీక్షణకు ఇక ముగింపు పడనుంది. రాష్ట్రంలో వాహనాల రద్దీ అధికంగా ఉండే నాలుగు జాతీయ రహదారులపై కొత్తగా ఎనిమిది ‘రోడ్ ఓవర్ బ్రిడ్జ్’(ఆర్వోబీ)లు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో రూ. 616 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. ఈ ఆర్వోబీల నిర్మాణం కోసం కొన్ని చోట్ల భూ సేకరణ ప్రక్రియ పూర్తవగా, మరికొన్ని చోట్ల వేగంగా కొనసాగుతోంది. ఆర్ అండ్ బీ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తయారు చేస్తున్నారు. మరికొన్నిటికి డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీలను నియమించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటన్నిటినీ నిర్మించేందుకు ఆర్ అండ్ బీ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. కొత్తగా నిర్మించనున్న ఆర్వోబీల వివరాలు... అనంతపురం– కృష్ణగిరి (తమిళనాడు) మధ్య 42వ నంబర్ జాతీయ రహదారిపై ముదిగుబ్బ (అనంతపురం జిల్లా) లెవల్ క్రాసింగ్ వద్ద రూ. 70 కోట్లతో ఆర్వోబీని నిర్మిస్తారు. ఇదే జాతీయ రహదారిపైనే కదిరి పట్టణంలో లెవల్ క్రాసింగ్ వద్ద మరో ఆర్వోబీని రూ. 70 కోట్లతో నిర్మిస్తారు. వీటికోసం భూ సేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. చిత్తూరు– కడప మధ్య 40వ నంబర్ జాతీయ రహదారిపై పీలేరు లెవల్ క్రాసింగ్ వద్ద రూ. 70 కోట్లతో నిర్మించనున్న ఆర్వోబీ కోసం ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. మదనపల్లి–నాయుడుపేట మధ్య 71వ నంబర్ జాతీయ రహదారిపై చిన్న తిప్ప సముద్రం వద్ద రూ. 70 కోట్లతో, పీలేరు సమీపంలో రూ. 90 కోట్లతో, నాయుడుపేట సమీపంలోని పండ్లూరు వద్ద రూ. 50 కోట్లతో ఆర్వోబీలను నిర్మించనున్నారు. వీటి కోసం భూసేకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. గుడివాడ– మచిలీపట్నం మధ్య 165వ నంబర్ జాతీయ రహదారిపై గుడివాడ సమీపంలో పాత వంతెన స్థానంలో రూ. 73 కోట్లతో కొత్త ఆర్వోబీ నిర్మిస్తారు. ఇందుకోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. డీపీఆర్ తయారీ కోసం ఓ కన్సల్టెన్సీని నియమించారు. విజయవాడ– భీమవరం మధ్య 165వ నంబర్ జాతీయ రహదారిపై మొంతూరు సమీపంలో పాత వంతెన స్థానంలో రూ. 123 కోట్లతో కొత్త ఆర్వోబీని నిర్మిస్తారు. ఇందుకోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదలయ్యింది. డీపీఆర్ తయారీ బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. -
సచివాలయం నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు
-
సచివాలయం నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణానికి గాను గురువారం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ శాఖ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేయనుంది. అంతేకాక ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చెన్నై ఆర్కిటెక్ట్స్ ఆస్కార్, పొన్నిలతో భేటీ అయ్యారు. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త సచివాలయ భవనంలో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలూ ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, సమావేశాల కోసం మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి ఉండేలా చూడాలని సూచించారు. -
ఆర్ అండ్ బిలో కీచకపర్వం
-
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
మంచిర్యాలటౌన్ : మంచిర్యాల పట్టణంలోని ఓవర్‌బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలో పడి సోమవారం రాత్రి బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు గాయపడ్డారు. మంచిర్యాలకు చెందిన ఎండీ అఫ్సర్, యాసీన్ నస్పూరుకు వెళ్లి సాయంత్రం తిరిగి మంచిర్యాలకు వస్తుండగా ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ఇద్దరూ గుంతలో పడ్డారు. దీంతో అప్సర్‌కు కుడికాలు కింది భాగంలో నరం తెగిపోయింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లిన వారిద్దరూ ఆర్అండ్బీ వారి నిర్లక్ష్యంతోనే రోడ్లపై గుంతలు ఏర్పడి పలువురు ప్రమాదాలకు కారణమవుతున్నారని, తమకు జరిగిన ప్రమాదానికి ఆర్అండ్బీ వారిపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల పోలీసులకు బాధితులు మంగళవారం ఫిర్యాదు చేశారు. అప్సర్ క్రీడాకారుడు కావడంతో, తనకు కాలి నరం తెగిపోవడం వల్ల తాను జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు ఇబ్బందులు ఉంటాయని, తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం ట్రాఫిక్ ఏఎస్సై భవానీ మట్టితో గుంతను పూడ్చివేయించారు. -
ఆర్అండ్బీ చేతికి పంచాయతీ రాజ్ రోడ్లు
శ్రీకాకుళం టౌన్: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న 738 రోడ్లను రహదారులు భవనాల శాఖకు బదలాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీనికి సంబంధించి జీఓ నంబరు 22ను విడుదల చేసిన ప్రభుత్వం అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 61 రోడ్లను చేర్చింది. జిల్లాలోని 61రోడ్ల పొడవు 346.730 కిలోమీటర్లు. శ్రీకాకుళం, పలాస, ఆమదాలవలస నియోజక వర్గాల్లో అత్యధికంగా రోడ్లు ఆర్అండ్బీ పరిధిలోకి మార్చారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండి తారురోడ్డుగా మార్చిన వాటిని మెయింటెనెన్సు, రిపేర్లు అవసరాల దృష్టిలో ఉంచుకుని మార్పు చేసిన ట్టు జీఓలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఈ మార్పు అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ జీఓ ఆధారంగా ఆర్అండ్బీ అధికారులు రోడ్ల మరమ్మతులకు నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కిలో మీటరుకు ఏటా రూ.10వేలు వంతున మెయింటెనెన్స్ నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇంతవరకు ఆ నిధులు విడుదల కాక ఇబ్బంది పడుతున్నామని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఈ నిధులు విడుదలైతే తప్ప మరమ్మతులు సాధ్యం కావని అంటున్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేపలు
లంగర్‌హౌస్ ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ మరో కేసులో ఆర్ అండ్ బీ ఇంజనీర్లు లంగర్‌హౌస్: లంచం తీసుకుంటూ వేర్వేరు ఘటనల్లో లంగర్‌హౌస్ ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, ఆర్ అండ్ బీ ఇంజనీర్లు చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్‌లో ఉండే మహమ్మద్ మతిన్ అలీ స్క్రాప్ వ్యాపారి. ఇదే వ్యాపారం చేసే అత్తాపూర్‌కు చెందిన అన్నాతమ్ముళ్లు ఫెరోజ్, షేక్ మతిన్, సద్దాం, ముబిన్‌తో వ్యాపార విషయంలో గొడవలు ఉన్నాయి. దీంతో బాధితుడు మతిన్ రాజేంద్రనగర్ పోలీసులతో పాటు, ఏసీపీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నలుగురు సోదరుల్లో ఒకరైన ఫెరోజ్‌ను ఇన్నోవా కారు ఢీకొనడంతో కాలు విరిగిందని వారం క్రితం లం గర్హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కారు మ తిన్కు చెందినదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, బాధితులతో మాట్లాడి రాజీ కుదురుస్తామని, అందు కు తమకు రూ.10 వేలు ఇవ్వాలని ఎస్సై బి.శ్రీనివాసరావు, హెడ్‌కానిస్టేబుల్ అశోక్‌రెడ్డిలు మహమ్మద్ మతి న్ను డిమాండ్ చేశారు. లేదంటే హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని బెదిరించారు. అతను ఏసీ బీని ఆశ్రయించడంతో సీఐ జేసుదాసు ఆధ్వర్యంలో బాధితుడికి రుంగురుద్దిన నగదును ఇచ్చి పంపి ఎస్సై, హె డ్కానిస్టేబుల్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆర్అండ్బీ ఇంజినీర్లు... ఖైరతాబాద్: హాస్టల్ భవనం అద్దె నిర్ణయించే విషయమై లంచం డిమాండ్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం వల పన్ని పట్టుకున్నారు. సోమయ్య అనే వ్యక్తికి ఎల్బీనగర్లో సొంత భవనం ఉంది. దీన్ని సాం ఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్వహించేందుకు అధికారు లు అద్దెకు అడిగారు. అద్దె నిర్ణయించే విషయంపై ఆర్అండ్బీ ఈఈ కె.నరేష్కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ ఎం.రాజశేఖర్‌ను సోమయ్య కలవగా రూ.10వేలు లం చం డిమాండ్ చేశారు. దీనిపై సోమయ్య మంగళవా రం ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు బుధవారం సోమయ్య ఖైరతాబాద్‌లోని ఆర్అండ్బీ కార్యాలయంలో ఇంజినీర్లకు లంచం ఇస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్ డీఎస్పీ ఎన్.చంద్రశేఖర్ సిబ్బందితో కలసి ఈఈ నరేష్కుమార్, ఏఈ ఎం.రాజశేఖర్‌ను అరెస్ట్ చే శారు. వారినుంచి రూ.10వేలు స్వాధీనం చేసుకున్నారు. -
‘ముంపు’లో మాయ..!
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో నాణ్యత కొరవడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఇంజనీరింగ్ శాఖల పరిధిలో అయితే పనులు చేయకుండానే బిల్లులు కాజేస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. భద్రాచలం ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతుండటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. పనుల పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఓ కాంట్రాక్టర్ ఇక్కడి అధికారులు చేస్తున్న నిర్వాకంపై సమగ్ర సమాచారంతో ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ముంపులో మాయాజాలం వెలుగులోకి వచ్చింది. 2013 జనవరి నుంచి 2014 మే వరకు భద్రాచలం ఆర్అండ్బీ శాఖ పరిధిలో జరిగిన పనుల బాగోతంపై ఓ కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సదరు అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రధానంగా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నట్లు సదరు కాంట్రాక్టర్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయటంతో దీనిపై మిగతా కాంట్రాక్టర్లు తర్జన భర్జన పడుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప్రస్తుతం భద్రాచలం ఆర్అండ్బీ డివిజన్ పరిధిలోని జరిగిన పనులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తరువాతే బిల్లులు చెల్లించాలని ఆర్అండ్బీ సీఈ పీఐవో అధికారులకు సూచించారు. దీంతో బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. ఫిర్యాదుల నేపథ్యంలో స్వయంగా ఆ శాఖ ఎస్ఈ చింతూరు సబ్ డివిజన్లోని పనులను పరిశీలించి వెళ్లారు. ఈ నిర్వాకంతో చేసిన పనులకు కూడా సకాలంలో బిల్లు రాని పరిస్థితి ఏర్పడిందని మిగతా కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు మండలాల్లో చేసిన పనులకు ఈ నెలాఖరు నాటికి బిల్లులు రాకపోతే అవి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతున్నందున ఇబ్బందులు తప్పవని పనులు సవ్యంగా చేసిన కొంతమంది కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. కాగా, విచారణ పూర్తి అయితే ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన ఇక్కడి ఉద్యోగుల్లో నెలకొంది. విజిలెన్స్ అధికారులు విచారణకు వస్తున్నారని తెలియటంతో అసంపూర్తిగా వదిలేసిన పనులను సదరు కాంట్రాక్టర్లు హడావిడిగా పూర్తి చేస్తున్నారు. అసలే నాణ్యత లేకుండా పనులు జరిగాయని ఆరోపణలు ఉండగా, ప్రస్తుతం క్వాలిటీ కంట్రోల్ అధికారుల కళ్లు గప్పేందుకు చేసిన పైపై పూతలు ఎన్ని రోజులు ఉంటాయో అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఇదే రీతిన కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు విచారణ తరువాత దిగువ శ్రేణి ఉద్యోగులకు అలవెన్స్‌లలో కొతపెట్టారు. కానీ ఈ సారి పనులు చేయకుండానే ఎంబీ రికార్డులు చేసిన ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మిగతా శాఖల్లోనూ ఇదే తీరు.. ఈ నెలాఖరు నాటికి ముంపు మండలాల్లోని పనులన్నీ పూర్తి చేయాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఒక వేళ పనులు మిగిలినట్లైతే వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే బిల్లులు పొందాల్సి ఉంటుందని అధికారులు చెబుతుండటంతో కాంట్రాక్టర్లు హడావిడిగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. దీంతో ఆ పనుల్లో నాణ్యత కొరవడుతుందనే విమర్శలు ఉన్నాయి. ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై ఎటువంటి తనిఖీలు ఉండటం లేదు. దీంతో కింద స్థాయిలోని పర్యవేక్షణాధికారులు, కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయి పనులను ‘మమ’ అనిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ ప్రత్యేక ప్రాజెక్టు కింద చేపడుతున్న రహదారుల నిర్మాణాల్లోనూ కూలీలకు బదులుగా పొక్లైన్లతోనే పనులు చేస్తున్నట్లు సమాచారం. ముంపులో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. -
ఇంకా మేల్కోలే..!
సాక్షి, కొత్తగూడెం: జిల్లాలో ఘోర ప్రమాదాలు జరిగినా ఆర్అండ్బీ అధికారులు కళ్లు తెరవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. అయినా ప్యాచ్ వర్కులు లేవు. పెను ప్రమాదాలు జరిగిన చోట కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. లోతువాగు వద్ద రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెంది ఏడాది అయినా నేటికీ అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా ఆయా అధికారులు నిద్రావస్థలో ఉన్నారు.గత ఏడాది డిసెంబర్ 23న వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన రెండు కుటుం బాలకు చెందిన 11 మంది దుమ్ముగూడెం వెళ్తూ కొత్తగూడెం మండలం లోతువాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రోడ్డుపై పోసిన కంకర కుప్పును తప్పించబోయిన టిప్పర్ అతివేగంగా ఆటోను ఢీ కొట్టడంతో వీరు మృతి చెందారు. ప్యాచ్ వర్క్‌లు చేయకుండా రోడ్డుపై పోసిన కంకర కుప్ప వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించిన అధికారులు కాంట్రాక్టర్‌పై నామమాత్రపు కేసు పెట్టి వదిలేశారు. ఇంత భారీ ప్రమాదం జరిగినా సంబంధిత అధికారులు ఇప్పటికీ కళ్లు తెరవకపోవడం శోచనీయం. లోతువాగు వద్ద ఇంకా రోడ్డు అధ్వానంగానే ఉంది. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో తరచూ ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. అంతేకుండా ఇటీవల కురిసన వర్షాలతో కొత్తగూడెం క్రాస్ రోడ్డు ఇరువైపులా కోతకు గురైనా కనీసం ఈ రోడ్డు పక్కన మట్టి కూడా పోయించలేదు. 2012 మార్చి 21న కొత్తగూడెం మండలం రాఘవాపురం వద్ద పెద్దవాగులో స్కూల్ బస్సు పడి 8 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగి రెండేళ్లు కావస్తున్నా అధికారులు ఇంకా అలసత్వం వీడలేదు. ఇటీవల వచ్చిన వరదలకు ఈ వాగుపై ఉన్న బ్రిడ్జి కిందకు కుంగింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం తమ పరిధిలోకి రాదంటూ ఇటు పంచాయతీరాజ్, అటు ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదు. కుంగిపోయిన బ్రిడ్జిపై నుంచే సుజాతనగర్, చండ్రుగొండ వైపు వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. చేస్తాం, చూస్తామంటూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం గమనార్హం. భారీ వర్షాలతో గతుకులమయం.. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో ప్రధాన రహదారులన్నీ కోతకు గురయ్యాయి. కొత్తగూడెం - భద్రాచలం, కొత్తగూడెం - ఇల్లెందు, కొత్తగూడెం - చండ్రుగొండ, తల్లాడ- సత్తుపల్లి, అశ్వారావుపేట - సత్తుపల్లి, బోనకల్ - ఖమ్మం రహదారులు గతుకులమయంగా మారాయి. ప్యాచ్ వర్క్‌లు అంటూ కాంట్రాక్టర్లు హడావుడిగా పని చేయిస్తున్నా.. వాటిలో నాణ్యత లేక కొద్దిరోజులకే మళ్లీ గుంతలు పడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేసేందుకు నిధులు మంజూరు కాలేదని సంబంధిత అధికారులు చెపుతున్నారు. అయితే ప్యాచ్ వర్క్‌ల పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. కాంట్రాక్టర్లు ఆయా అధికారుల చేయి తడుపుతూ ప్యాచ్ పనుల్లో నాణ్యత పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లెందు, భద్రాచలం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న వాహనాలు అతివేగంగా వెళ్తుంటాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రధాన గ్రామాల సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాలతో రోడ్లు అధ్వానం.. కేటీపీఎస్, నవభారత్, స్పాంజ్ఐరన్ కంపెనీలకు బొగ్గు రవాణా కోసం నిత్యం టిప్పర్లు వస్తుంటాయి. ఇవి భారీ లోడుతో ఉండడంతో రోడ్లు గుంతలు పడుతున్నాయి. అంతేకాకుండా జిల్లా నలుమూలల నుంచి లారీలు గ్రానైట్ రాళ్ల లోడ్‌తో కాకినాడ, విశాఖపట్నం వెళ్తుండడంతో.. ఈ బరువుకు రహదారులు నామరూపం లేకుండా పోతున్నాయి. సరైన సమయంలో వీటికి మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో ఈ గుంతలను తప్పించబోతున్న ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. దీనికి తోడు ప్రమాదాలు జరిగే చోట హెచ్చరిక బోర్డులను రేడియం స్టిక్కర్లతో ఏర్పాటు చేయడం లేదు. మూలమలుపులు అధికంగా ఉండే దారిలో కూడా కనీసం బోర్డులు ఏర్పాటు చేయాలనే ఆలోచన అధికారుల్లో లేదు. కాగా, రాత్రి వేళ వాహనాలు నడిపే డ్రైవర్లకు రోడ్డు సరిగ్గా కనిపించకనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులే చెపుతుండడం గమనార ్హం.