
హౌజింగ్ బోర్డును రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హౌజింగ్ బోర్డును ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు..
గృహ నిర్మాణ శాఖ ఆస్తులు, పథకాలు, ఉద్యోగులను.. ఆర్ అండ్ బీ శాఖలో విలీనం చేసింది. హౌజింగ్ బోర్డుతో పాటు రాజీవ్ స్వగృహ, దిల్(దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్) సంస్థలకూ ఈ కీలక నిర్ణయం వర్తించనుంది.