
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణానికి గాను గురువారం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ శాఖ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేయనుంది. అంతేకాక ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చెన్నై ఆర్కిటెక్ట్స్ ఆస్కార్, పొన్నిలతో భేటీ అయ్యారు. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కొత్త సచివాలయ భవనంలో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలూ ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, సమావేశాల కోసం మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి ఉండేలా చూడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment