
సాక్షి, కాకినాడ: టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్ అయ్యారు. యనమల ఓ రాజకీయ శకుని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు పెట్టించడం యనమల సోదరులకు పైశాచిక ఆనందం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరిపై కేసులు పెడదామా అని యనమల ఆలోచిస్తాడు. ఎన్నికొలొస్తున్నాయనే తునిలో యనమల మోకాళ్ల యాత్ర చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లోనూ యనమలకు ఓటమి ఖాయం. 1989లో తునిలో వంగవీటి విగ్రహం పెడితే యనమల సోదరులు పొడిపించేశారు. గత 40 ఏళ్ళుగా యనమలకు తుని ప్రజలు గుర్తుకు రాలేదు. బెంగళూరులో ఉండే యనమల కుమార్తె తుని వచ్చి రాజకీయం చేస్తానంటే కుదరదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: విశాఖలో నోట్ల మార్పిడి కలకలం.. జనసేన నాయకుడి అనుచరుడి అరెస్ట్