సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు ఒక్కటవుతార’నే సామెత టీడీపీలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడి విషయంలో నిజమైనట్టే కనిపిస్తోంది. నమ్ముకున్న నాయకులను చంద్రబాబు నట్టేట ముంచేసిన సందర్భాలు కోకొల్లలు. అనుకున్న పని అయిపోయిందంటే చాలు.. ఇక వారిని దూరం పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇందులో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారనే విమర్శ ఉంది. చంద్రబాబుతో సావాసమో ఏమో కానీ తునికి చెందిన ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు మాత్రం ప్రస్తుతం అధినేత పంథానే అనుసరిస్తున్నారు. టీడీపీలో నంబర్–2గా, శాసన మండలి ప్రతిపక్ష నేతగా రామకృష్ణుడు వ్యవహరిస్తున్నారు. ఆ స్థాయిలో ఉన్న ఆయన చంద్రబాబు మాదిరిగానే.. వరుసకు సోదరుడయ్యే కృష్ణుడిని టీడీపీ నుంచి వెళ్లగొట్టేందుకు ‘దివ్య’ంగా పొగ పెట్టేస్తున్నారు. నేరుగా పొమ్మనకుండానే ఈ కుటిల రాజకీయం నడిపించేస్తున్నారు.
పార్టీకి దూరం చేస్తున్నారిలా..
టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ దాదాపు మూడు దశాబ్దాల పాటు తునిలో యనమల సోదరుల అరాచక పాలన సాగించారనే విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా తునిలో ఆ పార్టీ వరుసగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటూ వచ్చింది. చివరకు టీడీపీ గ్రాఫ్ మరింత దిగజారిపోయిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో తన కుమార్తె దివ్యను తుని నుంచి టీడీపీ తరఫున రామకృష్ణుడు బరిలోకి దింపారు. ఆమెకు అడ్డంకిగా ఉన్నారనే అక్కసుతో సోదరుడైన కృçష్ణుడిని పారీ్టకి దాదాపు దూరం చేసే ఎత్తులు వేస్తున్నారు.
► నియోజకవర్గంలో ఇంత కాలం కృష్ణుడి వెన్నంటి నడిచిన మండల స్థాయి నాయకులు ఒక్కొక్కరినీ ఆయనకు దూరం చేస్తూ, ఏకాకిని చేశారు.
► రాష్ట్ర పార్టీ అంతర్గత వ్యవహారాల్లో రామకృష్ణుడిదే పెత్తనమైనా.. తుని టీడీపీలో మాత్రం కృష్ణుడి హవాయే నడిచేది. కుమార్తె దివ్యకు టిక్కెట్టు ఇప్పించుకున్న రామకృష్ణుడు.. టీడీపీ తెరపై కృష్ణుడు కనిపించకూడదనే నిశ్చయానికి వచ్చారు. దివ్యను తుని టీడీపీ అభ్యరి్థగా ప్రకటించిన మరుక్షణం నుంచే కృష్ణుడిని పారీ్టకి దూరం చేసే ప్రయత్నాలను తెర వెనుక ముమ్మరంగా సాగిస్తున్నారు.
► కృష్ణుడికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావును దూరం పెట్టాలని కృష్ణుడికి చెప్పకనే చెప్పారు. ఆ తరువాత కృష్ణుడు ప్రచారంలో తన వెంట ఉండటానికి వీలు లేదని దివ్య కరాఖండీగా చెప్పారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. కృష్ణుడు ఉంటే ప్రచారానికి వెళ్లబోనని ఆమె ఇటీవల తండ్రి రామకృష్ణుడికి తెగేసి చెప్పారనే చర్చ పార్టీ నేతల మధ్య జరుగుతోంది. ఆయన తన వెంట ప్రచారంలో తిరిగితే పడే నాలుగు ఓట్లు కూడా పడవనే లెక్కలతోనే దివ్య ఆ విధంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కొన్ని రోజులుగా కృష్ణుడు పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కృష్ణుడి ఏలుబడిలో అరాచకాలు, దోపిడీలు, కేసులు పార్టీపై ప్రభావితం చూపుతాయనే ఉద్దేశంతోనే ఆయన దూరంగా ఉండాలని రామకృష్ణుడు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
► అనేక అవినీతి ఆరోపణలతో వైఎస్సార్ సీపీ బయటకు గెంటేసిన వెంకటేషకు టీడీపీలో పెత్తనం అప్పగించడం ద్వారా కృష్ణుడిని దూరం పెట్టడానికి రామకృష్ణుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్టు కనిపిస్తోంది. కృష్ణుడి వల్లనే పార్టీ నష్టపోయిందనే సాకుతో ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించిందని అంటున్నారు.
► 30 ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించినందుకు తగిన శాస్తే జరిగిందని సహచరుల వద్ద కృష్ణుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేరుకుంపటికి యత్నాలు
తాము ఏం చేసినా అన్న రామకృష్ణుడి కోసమేనని ఆయనకు తెలియనిది కాదని, అయినప్పటికీ తనపట్ల కత్తి కట్టినట్టు వ్యవహరిస్తున్నారని కృష్ణుడు మండిపడుతున్నారు. సీటు కాదన్నా పార్టీ కోసం ఓపికగా భరించామని, ఇప్పుడు ప్రచారంలో కూడా వద్దని చెబుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన వర్గం ప్రశి్నస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఇంతలా అవమానించిన రామకృష్ణుడి వెంట తిరగాల్సిన అవసరం లేదని చెబుతూ.. వేరుకుంపటి పెట్టేందుకు కృష్ణుడి వర్గం సన్నద్ధమవుతోంది. వాస్తవానికి దివ్యను పార్టీ అభ్యరి్థగా ఎంపిక చేయడాన్ని మొదట్లోనే కృష్ణుడి వర్గం వ్యతిరేకించింది.
ఇప్పుడు పారీ్టకి దూరం చేయాలనే రామకృష్ణుడు ఎత్తులను ఎదుర్కొనే దిశగా భవిష్యత్ నిర్ణయం కోసం మంతనాలు జరుపుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తునిలో సోమవారం అనుచరులతో భేటీ కావాలని కృష్ణుడు భావించారు. ఈ మేరకు అందరికీ పిలుపులు కూడా వెళ్లాయి. కారణాంతరాలతో చివరి నిమిషంలో సమావేశాన్ని మరో రెండు రోజులు వాయిదా వేశారు. ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment