
కాకినాడ: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హల్‌లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.
యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు.
చదవండి: రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి
Comments
Please login to add a commentAdd a comment