internal clashes
-
దందాలో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ ఎంపీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ ప్రజాప్రతినిధికి, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఎంపీ ఎన్నికల ముందు అతి వినయం ప్రదర్శించి, నాయకులను, కార్యకర్తలను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేశారని.. ఎన్నికల్లో గెలుపొందాక ఆయన నిజస్వరూపం బయట పడుతోందని.. సొంత పార్టీ నాయకులకే చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో జరిగే అక్రమ దందాలో తనకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య అంతరం పెరుగుతోందని వినికిడి. ఎన్నికల సమయంలో తనతో సన్నిహితంగా మెలిగిన నాయకులను సైతం పార్టీ ఆఫీసుకు వెళ్తే ఎందుకు వస్తున్నారని అక్కడి సిబ్బంది ముఖం మీదే అడుగుతుండటంతో.. ఇంతలోనే ఎంత తేడా అని వారు నిట్టూరుస్తున్నారు. ⇒ మైలవరం నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీ నేతలకు కాసులు కురిపించే కల్ప వృక్షం. ఎన్నికల ముందు వరకు ఎంపీ, ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే చాలా సఖ్యతగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. తీరా ఎన్నికలయ్యాక వాటాల విషయంలో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ తనకు అన్నింటిలోనూ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. వీటీపీఎస్‌లో బూడిదపై ఇద్దరి మధ్య షేర్ కుదిరినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ఎన్నికల సమయంలో ఖర్చంతా నేనే పెట్టుకున్నానని. నీకేం సంబంధం. మిగతా వాటిలో మీకు వాటా ఇవ్వలేను. నా నియోజకవర్గ సరిహద్దులోకి రావద్దు’ అని ఎమ్మెల్యే కరాఖండిగా చెప్పడంతో వారి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది. ⇒ నందిగామ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఇరువురు నేతలు పైకి బాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ రోజురోజుకు అంతరం పెరుగుతోందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని రెండు ఇసుక రీచ్‌లను ఎంపీ తన కంట్రోల్లో ఉంచుకొని, పెద్ద ఎత్తున ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు చివరకు రైతుబజార్లలో కూరగాయల సరఫరా కాంట్రాక్టుకు సంబంధించి వచ్చే మామూళ్లలో సైతం ఇద్దరికీ తేడాలు వచ్చినట్లు ఆ నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ⇒ తిరువూరులో నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ ఉప్పు, నిప్పు మాదిరి ఉన్నారు. అక్కడ అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక, మద్యం, పేకాట వంటి మామూళ్లకు సంబంధించిన విషయాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే తనను కేర్ చేయకపోవడంతో, ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎంపీనే ఓ వర్గాన్ని రెచ్చగొట్టి, నియోజకవర్గ పెద్దలకు స్థానిక నేతలతో ఫిర్యాదులు చేయిస్తున్నట్లు, అక్కడ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ⇒ జగ్గయ్యపేటలో పాగా వేసేందుకు ఎంపీ ప్రయత్నించారు. అయితే అక్కడ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకించారు. అయినప్పటికీ ఇసుక క్వారీల విషయంలో కొన్నింటిని తన వాటాగా తీసుకున్నారు. అక్కడ పరిశ్రమలు ఉండటంతో, ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకొనేందుకు ఎంపీ ప్రయతి్నస్తుండటంతో వారి మధ్య వివాదం చెలరేగుతోంది. ⇒ విజయవాడలోని ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, ఎంపీకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాము సీనియర్లం అనే భావనలో ఎమ్మెల్యేలు ఉంటే, తన పెత్తనం సాగాల్సిందేనని రీతిలో ఎంపీ వ్యవహరిస్తున్నారు. చినబాబు అండతోనేనా? ఎన్నికల ముందు వరకు ఎంపీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలందరికీ ఆయన చుక్కలు చూపిస్తుండటంతో లోలోన వారి మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయంలో ఎంపీ జోక్యాన్ని వారు సహించలేకపోతున్నారు. కొంత మంది టీడీపీ నేతలైతే చినబాబు అండతోనే ఎంపీ తన ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారనే భావన వ్యక్తం అవుతోంది. -
తెలంగాణ బీజేపీలో చీలికలు
-
బీజేపీ ఎమ్మెల్యేల్లో వైరాగ్యం
-
కర్నూలులో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
కర్నూలు, సాక్షి: అధికార పార్టీలో పాత గొడవలు బయటికొస్తున్నాయి. అటు మంత్రాలయంలో, ఇటు కొడుమూరులో తమ్ముళ్లు రోడ్డు మీదకు చేరి తన్నుకున్నారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడి.. ఆస్పత్రి పాలయ్యారు. మంత్రాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ నేత రాఘవేంద్ర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వంట పథకం ఏజెన్సీ విషయాల్లో తొలుత వాగ్వివాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయి ఇరు వర్గాలు బాహబాహీకి దిగాయి. కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో జరిగిన ఫించన్ల పంపిణీ కార్యక్రమం.. తన్నుకున్నేదాకా వెళ్లింది. ఇరువర్గాలకు చెందిన నాయకుల మధ్య మొదలైన గొడవతో ఇరు శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఈ గొడవలో టీడీపీ నేత సురేష్‌కు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. -
ప్రభుత్వం మా మధ్య చిచ్చు పెట్టింది ఎట్టి పరిస్థితిలో సమ్మె ఆగదు
-
టీడీపీలో తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి, పార్వతిపురం మన్యం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా సాలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగారు. ఫ్లెక్సీలు చించుకోవటంతో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సాలూరు టౌన్లో సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం ఇందుకు వేదికైంది. స్థానిక శంబర జాతరకు సందర్భంగా టీడీపీ నేత తేజోవతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని తెలుగుదేశంలోని కొందరు నేతలు చించేయడంతోపాటు మరోనేత సంధ్యారాణి ఫ్లెక్సీలు అతికించారు. దీంతో మామిడిపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రజలు ఆ ఫ్లెక్సీలను చూసి టీడీపీ రోజురోజుకు దిగజారిపోయిందని అనుకుంటున్నారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఫోటోలను ఒకరి వర్గం ఒకరు చించుకున్నారు. వాటి స్థానంలో తమ నాయకురాలు ఫొటో పెట్టిన నేపథ్యంలో టీడీపీలో వర్గ విభేదాలపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై స్థానికంగా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. చదవండి: AP: ESMSపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం -
తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. చదవండి: రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి -
గోపాలపురం టీడీపీలో ఏం జరుగుతోంది ?
-
KPMG report: 2050 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్యం కష్టమే!
న్యూఢిల్లీ: సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని 2050 నాటికి సాధించేందుకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు చాలవని కేపీఎంజీ సంస్థ పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, పరిశ్రమలు గుణాత్మక మార్పు దిశగా కృషి చేయాల్సి ఉందని తెలిపింది. అయితే, ఎన్నో అడ్డంకులు, గణనీయ స్థాయిలో ప్రభుత్వాల రుణ భారం, అంతర్గత ఉద్రిక్తతలు, కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికలపై పెరుగుతున్న వ్యతిరేకత, ఇంధన సరఫరా విషయంలో భరోసా కలి్పంచాల్సిన అవసరం కర్బన ఉద్గారాల విషయంలో అవరోధంగా మారుతున్నట్టు వివరించింది. ఈ మేరకు కేపీఎంజీ ఓ నివేదికను విడుదల చేసింది. కాలుష్యాన్ని అధికంగా విడుదల చేసే యూఎస్, చైనా, బ్రెజిల్, కెనడా, యూఈ దేశాల్లో తక్కువ కర్బన ఆధారిత ఇంధనాల ఉత్పత్తి విషయంలో కొంత పురోగతి సాధించినప్పటికీ.. ఈ విషయంలో భారీగా అవుతున్న ఖర్చు, దేశీయ పరిశ్రమపై పడే ప్రభావం దృష్ట్యా వస్తున్న వ్యతిరేకత అవరోధంగా మారినట్టు తెలిపింది. విడిగా దేశాల వారీగా చూస్తే.. ప్రజల జీవనోపాధికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయన్నవ్యతిరేకతతో అర్థవంతమైన పురోగతికి ఆటంకం కలుగుతున్నట్టు వెల్లడించింది. వివిధ రంగాల్లో కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో పురోగతి వేర్వేరుగా ఉందని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో పెద్ద ఎత్తున వృద్ధి.. కొన్ని రంగాల్లో వేగంగా కర్బన ఉద్గారాలను ఎలా తగ్గించవచ్చన్న దానికి విజయవంతమైన నమూనాగా పేర్కొంది. విమానయానం, షిప్పింగ్ పరిశ్రమల్లో దీనికి సంబంధించి పురోగతి చాలా నిదానంగా ఉన్నట్టు వివరించింది. 2050 నాటికి సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం అన్నది సుస్థిర విమానయాన ఇంధనాలను అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత్‌లో పురోగతి.. భారత్ పునరుత్పాదక ఇంధనాల విషయంలో వేగవంతమైన పురోగతి సాధిస్తున్నట్టు కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. 2047 నాటికి ఇంధనాల విషయంలో స్వతంత్ర దేశంగా అవతరించాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నట్టు తెలిపింది. ఫేమ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండడాన్ని పస్త్రావించింది. కాకపోతే వ్యవసాయ రంగం నుంచి వెలువడుతున్న వ్యర్థాల తగ్గింపు భారత్‌కు సవాలేనని పేర్కొంది. సబ్సిడీతో అందిస్తున్న ఎరువులను అధికంగా వాడుతుండడంతో, పశుగ్రాసం నుంచి మీథేన్ విడుదల తగ్గించడం కష్టమని అభిప్రాయపడింది. ‘‘భారత్ సోలార్, విండ్, హైడ్రోజన్ నుంచి మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే, భారత్ ఏటా 6 శాతానికి పైగా వృద్ధి చెందే క్రమంలో ఏర్పడే ఇంధన అవసరాల దృష్ట్యా.. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం ఇక ముందూ కొనసాగుతుంది. కాకపోతే కొంత కాలానికి సంప్రదాయ ఇంధనాల వినియోగం మొత్తం ఇంధన వినియోగంలో తగ్గుతుంది’’అని కేపీఎంజీ ఇంటర్నేషనల్ ఎనర్జీ హెడ్ అనిష్ అన్నారు. -
కాంగ్రెస్‌కు షాక్! కోమటిరెడ్డి ఎఫెక్ట్.. హైదరాబాద్‌కు కుంభం.. కారులో షి‘కారు’
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. నిన్న ఘట్ కేసర్ లో అనిల్ కు వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశమైంది. ఈనేపథ్యంలో అనిల్ కుమార్ రెడ్డి భువనగిరిలో సోమవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యతిరేకవర్గంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ దెబ్బతినేలా ఎంపీ వెంకట్‌రెడ్డి గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని అనిల్ ఆరోపించారు. ఆయన పార్టీని డిస్టర్బ్ చేస్తున్నారని అన్నారు. తన ఇంట్లోనే ఐదు ఆరు సీట్లు తీసుకున్నప్పుడు కోమటిరెడ్డికి బీసీలు గుర్తు రాలేదా? అని అనిల్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్నది తప్పు అని వ్యాఖ్యానించారు. పార్టీ పటిష్టంగా ఉంది, గెలిచే అవకాశాలు ఉన్న సమయం లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంచి సహకారం అందిస్తున్నారని కార్యకర్తల సమావేశంలో అనిల్ చెప్పుకొచ్చారు. (బండి వ్యాఖ్యల సెగలు.. ఢిల్లీలో అమిత్‌షాతో కరీంనగర్ ఎంపీ భేటీ, కీలక సూచన) కారెక్కనున్న కుంభం కాంగ్రెస్‌లో వర్గపోరుతో కుంభం అనిల్‌కుమార్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పొసగకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని వార్తలు వెలువడుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డితోపాటు అనిల్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో కనిపించడం వార్తలకు బలం చేకూరింది. (బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్) -
కిషన్‌రెడ్డికి తొలిరోజే షాక్! బీజేపీలో మళ్లీ అసమ్మతి గోల.. వేదికపైనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డికి తొలిరోజే షాక్ తగిలింది. వేదికపైనే ఆ పార్టీ నాయకుల ఇంటిపోరు బయటపడింది. అసంతృప్త నేతలపై ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలని, కనీసం కిషన్‌రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని హితవు పలికారు. ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లడంతోనే తన పదవి పోయిందని బండి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎడమొహం, పెడమొహం ఇక వేదికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కిషన్‌రెడ్డి ముందు నుంచే వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డికి అటు వైపు, ఇటువైపు ఉన్నవారితో కరచాలనం చేశారు తప్ప ఆయనను పట్టించుకోలేదు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. (చదవండి: తమాషాలొద్దు.. ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్) అందుకే త్వరగా వెళ్లిపోయా.. మరోవైపు కిషన్‌రెడ్డి పదవీ స్వీకార కార్యక్రమం నుంచి విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోయారనే వార్తలు సైతం హాట్‌టాపిక్‌గా మారాయి. ‘నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది’ అని ఆమె ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమం వెనుదిరిగానని విజయశాంతి చెప్పుకొచ్చారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీల్లో వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా, నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. (చదవండి: ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్) -
పల్నాడు: రొంపిచర్లలో అర్ధరాత్రి కాల్పుల కలకలం
సాక్షి, పల్నాడు: జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపి.. పరారయ్యారు. ఈ ఘటనలో బాలకోటిరెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాలకోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని చికిత్స కోసం నర్సరావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. టీడీపీ అంతర్గత కుమ్ములాట నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే.. గతంలో.. ఆరు నెలల కిందట బాలకోటిరెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఆ సమయంలో ఈ దాడిని రాజకీయం చేసేందుకు టీడీపీ తీవ్రంగా యత్నించింది. నారా లోకేష్‌ను సైతం రంగంలోకి దించాలనుకుంది. అయితే.. ఈలోపే దాడికి తానే బాధ్యుడినంటూ స్థానిక టీడీపీ నేత పమ్మి వెంకట్‌రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. పార్టీలో విభేధాలు ఉన్నాయని, నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు.. డబ్బులు తాను ఖర్చు పెడుతుంటే బాలకోటిరెడ్డిని ప్రొత్సహిస్తున్నాడని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయి.. బాలకోటిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు అప్పుడు పోలీసులకు వెల్లడించాడు. దీంతో.. తాజా దాడి కూడా ఈ కోణంలోనే జరిగిందా? లేదా మరేదైనా కోణం ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టీ గ్లాస్లో తుఫాన్?.. ఉన్నదే గుప్పెడు మంది.. అందులో ముఠాలు
టీ గ్లాస్లో తుఫాన్ వచ్చిందట. అదేనండి.. గాజు గ్లాస్ పార్టీ.. కాకినాడ జిల్లాలో ఉన్నదే గుప్పెడు మంది. అందులోనూ ముఠాలు.. కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. ఉన్న ఇద్దరి మధ్యే వార్ నడుస్తుంటే.. మరో నేత ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇక మూడు ముక్కలాట ఆడుకోవడమే అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. పిఠాపురంలో మూడు ముక్కలాట పార్టీ నిర్మాణం అనే మాటే వినిపించని జనసేనలో అక్కడక్కడా ఒకరిద్దరు నాయకులు కనిపిస్తారు. అలా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడంతో కార్యకర్తలుగా చెప్పుకునేవారికి తలనొప్పులు ప్రారంభమయ్యాయట. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్‌గా కాకినాడ నగరంలోని మాజీ టిడిపి కార్పోరేటర్ మాకినీడి శేషుకుమారి వ్యవహరిస్తున్నారు. 2017లో కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి కార్పోరేటర్‌గా గెలిచిన శేషుకుమారి మేయర్ పదవి ఆశించి భంగ పడ్డారు. వెంటనే టిడిపికి స్వస్తి చెప్పి గాజు గ్లాస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ తిరిగి కాకినాడ వెళ్ళకుండా పిఠాపురంలోనే రాజకీయాలు చేస్తున్నారు శేషుకుమారి. పిఠాపురానికే చెందిన జనసేన పిఎసి సభ్యుడు పంతం నానాజీతో శేషుకుమారికి కోల్డ్ వార్ సాగుతోంది. డాక్టర్ పాలిట్రిక్స్ ఇక ఇటీవలే పిఠాపురంకు చెందిన ప్రముఖ వైద్యుడు పిల్ల శ్రీధర్‌తో పాటుగా ఆయన సతీమణీ డా.పిల్ల దీపిక కూడా జనసేనలో చేరారు. వీరికి పార్టీ పెద్దల అండదండలు ఉండడంతో ..శేషుకుమారితో సంబంధం లేకుండా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న డాక్టర్ శ్రీధర్ నియోజకవర్గంలో పట్టు సాధించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఉచిత వైద్య శిభిరాలు నిర్వహిస్తూ గత ఎన్నికల అభ్యర్థి శేషుకుమారి క్యాడర్ ను తనవైపు రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శేషుకుమారి కాకినాడకు చెందిన నేత కావడంతో ఆమెపై నాన్ లోకల్ అనే ముద్ర ఉంది. ఇలా నియోజకవర్గంలో రెండు వర్గాలుగా చీలిపోగా.. మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేనలో చేరేందుకు సిద్దమైయ్యారు. 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి టిడిపిలో చేరిన వర్మ..2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. ఐతే నియోజకవర్గంలో టిడిపిపై ఉన్న వ్యతిరేకత 2024 ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్న అంచనాతో వర్మ జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఒకవేళ అదే జరిగితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో మూడు ముక్కలాట తప్పదని అంటున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సత్తెనపల్లి టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు
-
Chandrababu Naidu: ఇదేం ఖర్మరా 'బాబూ'
సాక్షి, కాకినాడ: స్వపక్ష నేతల మధ్య వైషమ్యాలను చక్కదిద్ద లేక చేతులెత్తేసిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటూ బయలుదేరడం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై బురదజల్లే ఎత్తుగడతో తలపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం ప్రజా స్పందన లేక అభాసుపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నాయకుడు ‘రాష్ట్రానికి ఇదేమి ఖర్మ’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ నినాదంతో గురువారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నారు. కొత్త నినాదం మాట దేవుడెరుగు.. కనీసం ఆయన పర్యటించే నియోజకవర్గాల పరిధిలోనైనా పార్టీ అంతర్యుద్ధాలను చక్కదిద్దారా అంటే అదీలేదు. ప్రజల నుంచి స్పందన లేక టీడీపీ అధినేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చాన్నాళ్లుగా ముఖం చాటేశారు. తెలుగు తమ్ముళ్లు వర్గాల బాట పట్టిన చోటే ఆయన తన పర్యటనకు శ్రీకారం చుట్టడంపై పార్టీ వర్గాలూ విస్తుపోతున్నాయి. పర్యటన సాగే కొవ్వూరు, నిడదవోలుతో పాటు పొరుగున ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో తమ్ముళ్ల తగువులతో పార్టీ ఇప్పటికే మూడు ముక్కలైంది. సొంత సామాజికవర్గ నేతలు మాటలు ఆధారంగా ఏకపక్షంగా ఇన్చార్జిలను మార్చేయడం ఈ వివాదాలకు ఆజ్యం పోసింది. గోపాలపురం– కయ్యాలకాపురం గోపాలపురంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ముప్పిడి వెంకటేశ్వరరావును ఉన్నపళంగా ఇన్చార్జి నుంచి తొలగించాలరని ఎస్సీ సామాజికవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ ఇన్చార్జిగా మద్దిపాటి వెంకట్రాజును చంద్రబాబు నియమించారు. దీనిపై ముప్పిడి వర్గం బాబును కలిసింది. కారణం చెప్పాలంటూ నిలదీసింది. వచ్చే ఎన్నికల్లో మద్దిపాటే పోటీచేస్తారని ఆయన ప్రకటించారు. పర్యవసానంగా విభేదాల అగ్గి మరింత రాజుకుంది. వీరిద్దరూ తలోదారి పట్టినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఈ వైరుధ్యాల మధ్య జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాజీ ఎమ్మెల్యే ముప్పిడికి మద్ధతుగా నిలవడం చర్చనీయాంశమైంది. సంజాయిషీ కూడా అడకుండా కరివేపాకులా తీసిపడేసినందుకు సరైన సమయంలో సరైన రీతిలో స్పందించేందుకు ముప్పిడి వర్గం గుట్టుగా పావులు కదుపుతోంది. నిడదవోలులో తలోదారి వైఎస్సార్సీపీ రాకతో అడ్రస్ గల్లంతైన నిడదవోలుకు చంద్రబాబు రానున్నారు. గత ఎన్నికల్లో 21వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు ఇక్కడ బాధ్య తలు అప్పగించవద్దంటూ ఆవిర్భావం నుంచి పార్టీ నేతలు మొత్తుకున్నారు. ఓటమి తరువాత బూరుగుపల్లి పార్టీని చాప చుట్టేసి కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఆయన రావడాన్ని పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. మూడేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ హడావిడి చేయడం ద్వితీయ శ్రేణికి రుచించడం లేదు. మున్సిపాలిటీలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోయింది. గత ఎన్నికల్లో చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డ కుందూరు సత్యనారాయణ శేషారావుకు వ్యతిరేకంగా ఒక గ్రూపుతో టిక్కెట్టు కోసం పావులు కదుపుతున్నారు. పార్టీ ద్వితీయ శ్రేణిలో మెజార్టీ నేతలు టిక్కెట్టు తెచ్చుకుంటే పనిచేస్తామని తెరవెనుక శేషారావుకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఈ రెండు గ్రూపుల పంచాయతీ గురువారం చంద్రబాబు వద్దకు వెళ్లేలా ఉంది. కొవ్వూరు.. విభేదాల జోరు ఎస్సీలకు రిజర్వు అయిన కొవ్వూరులో గత ఎన్నికల్లో టీడీపీ ఘెరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతోంది. చంద్రబాబు గురువారం తన కార్యక్రమాన్ని కొవ్వూరు నుంచే శ్రీకారం చుడుతున్నారు. ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిని కూడా నియమించుకోలేని దీనావస్థ ఉంది. కొవ్వూరులో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి తమను అవమానానికి గురిచేశారని ఎస్సీ సామాజికవర్గీయులు గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వంగలపూడి అనిత పత్తా లేకుండా పోయారు. 2014లో గెలిచి మంత్రి అయిన కేఎస్ జవహర్‌ను గత ఎన్నికల్లో పక్కనపెట్టారు. జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా కొవ్వూరు పార్టీ వ్యవహారాలకు ఆయన్ను దూరం పెట్టారు. పెండ్యాల అచ్చిబాబు ఆధిపత్యం తగ్గకూడదనే దోరణిలో చంద్రబాబు ఉన్నారంటూ ద్వితీయశ్రేణి గర్హిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ‘ఇదేం ఖర్మరా.. బాబు’ అంటూ పార్టీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నాయి. బూత్ కమిటీలు వేసే పరిస్థితే లేదు చంద్రబాబు ఏలూరులో ప్రవేశించగానే ప్రజలందరూ ఇదే ఖర్మరా బాబు అని అనుకుంటున్నారు. బూత్ కమిటీలు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి ఆ పార్టీ క్యాడర్ దూరంగా ఉంది. జగన్ పాలనలో ప్రజలందరూ సంక్షేమ పథకాలు అందుకుని ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి ఏంచెప్పి మభ్య పెడతారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోవడానికి జనాలు సిద్ధంగా లేరు. – రాజమహేంద్రవరంలో మీడియాతో మంత్రి రోజా -
కొవ్వూరు టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విబేధాలు
-
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కొట్లాట
-
Ramagundam: స్వపక్షంలో విపక్షం.. గులాబీ పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల స్వపక్షంలో విపక్షం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. విపక్షాల పాత్ర సొంత పార్టీ వారే పోషిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్లో మేయర్ నిర్ణయాలను డిప్యూటీ మేయర్ వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు.. తెరాస కార్పొరేటర్లు నగరపాలక సంస్థ సమావేశాన్నే బహిష్కరించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లోని గులాబీ పార్టీలో వర్గ విభేదాలు రచ్ఛకెక్కాయి. టీఆర్ఎస్ మేయర్‌పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఏకపక్ష నిర్ణయాలపై అధికార పార్టీ వారే నిరసన గళం విప్పారు. రాజకీయంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రామగుండం కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే.. వాటిలో 37 డివిజన్లకు టీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశాన్ని అధికార పార్టీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు బహిష్కరించారు. మేయర్‌పై అసంతృప్తితో నిరసనకు దిగారు. సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో మేయర్ బంగి అనిల్ కుమార్ సమావేశాన్ని గంటన్నర పాటు వాయిదా వేశారు. నామినేషన్ల బిల్లుల చెల్లింపు ఎజెండాపై సమావేశాన్ని బహిష్కరించిన కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావుతో మేయర్ తన చాంబర్లో రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. నామినేషన్ పనులపై ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతున్న తరుణంలో వాటికి బిల్లులు ఎలా చెల్లిస్తారని కార్పొరేటర్లు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎజెండాలో ఎందుకు పెట్టారని, పెట్రోల్ బంకు కోసం మున్సిపల్ ఆఫీసులోని స్థలాన్ని కేటాయిస్తూ ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించినట్లు తెలిసింది. డివిజన్లలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వారు మేయర్ మీద దండెత్తారు. మేయర్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఒక దశలో మేయర్, కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని తెలిసింది. చివరికి శాంతించిన అధికారపార్టీ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఎజెండాలో చేర్చిన 430 అంశాలపై కౌన్సిల్లో చర్చించారు. రూ.280 కోట్ల నామినేషన్ పనుల బిల్లుల చెల్లింపు అంశాలను కార్పొరేటర్లు వ్యతిరేకించడంతో వాటిని పక్కకు పెట్టారు. పెట్రోల్ బంక్‌కు స్థలం కేటాయింపు అంశాన్ని కూడా పక్కన పెట్టారు. ఈ వ్యవహారంపై రామగుండంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు మాయం అయిన ఫైల్స్ మళ్లీ ఎజెండాలోకి ఎందుకు తీసుకు రావాల్సి వచ్చింది?. కాంట్రాక్టర్లు, మేయర్ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చేలా పాలన ఉండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామగుండంలోని వంటి పరిస్థితే సిరిసిల్లలోనూ ఏర్పడింది. అక్కడి విభేదాలను స్వయానా సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి పరిష్కరించారు. కరీంనగర్‌లోనే ఉన్న రామగుండం కార్పొరేషన్లో కూడా ఇలాంటి పరిస్థితే రావడం గులాబీ పార్టీ పెద్దలకు తలనొప్పే అంటున్నాయి పార్టీ శ్రేణులు. -
చంద్రబాబు పర్యటనలో.. తమ్ముళ్ల వర్గపోరు
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే తమ్ముళ్ల వర్గపోరు బట్టబయలైంది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లిలో నిర్వహించిన రోడ్డు షో సాక్షిగా తమ బలాబలాల నిరూపణకు సిద్ధమయ్యారు. గ్రూపు తగాదాలను తెరపైకి తెచ్చారు. స్వాగత ఏర్పాట్లు మొదలు పర్యటన ఆద్యంతం రెండు నియోజకవర్గాల్లో ఎవరికి వారే అన్నట్లు నేతలు వ్యవహరించారు. ఇక విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతిరాజుతో మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు సయోధ్య కుదరలేదు. దీంతో ఆరోగ్య కారణం చూపించి అధినేత పర్యటనకు ఆమె డుమ్మా కొట్టినట్టు తెలిసింది. నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని భోగాపురం మండలంలో ఉన్న సన్‌రే రిసార్ట్సులో చంద్రబాబు గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ బస చేశారు. అక్కడ నుంచి ఆయన పర్యటన ప్రారంభానికి ముందు టీడీపీ నాయకులు చాలామంది అక్కడకు వెళ్లారు. ఆయన బయటకు వచ్చేవరకూ దాదాపు మూడు గంటల సేపు కేంద్ర మాజీ మంత్రి అశోక్ చుట్టూ ఒక గ్రూపు, వారికి కొంత దూరంలో రాష్ట్ర మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు చుట్టూ కొంతమంది నాయకులు సిట్టింగ్ వేశారు. అశోక్ గ్రూప్‌లో సుజయకృష్ణ రంగారావు, ఆర్పీ భంజ్‌దేవ్, శత్రుచర్ల చంద్రశేఖరరాజు కుమార్తె పావని తదితర ఉన్నతవర్గ నాయకులు కనిపించారు. వారితో పాటే ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీష్ మాత్రమే కూర్చున్నారు. చదవండి: (Konaseema: కోనసీమలో సాగుకు శ్రీకారం) కళావెంకటరావు గ్రూపులో మాజీ మంత్రి కిమిడి మృణాళిని, మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కిమిడి గణపతిరావు, తెంటు లకు‡్ష్మనాయుడుతో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. తర్వాత అక్కడకు వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు ఆ రెండు శిబిరాల దగ్గరకూ వెళ్లి నేతలకు ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. గీతకు దక్కని భరోసా... రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనైనా తనకు విజయనగరం టికెట్ వస్తుందనే ఆశతో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇటీవల తాడేపల్లిలో చంద్రబాబు ముందు పంచాయితీ (నియోజకవర్గ సమీక్ష)కి వెళ్లారు. తీరా ఆయన ఏమీ తేల్చకుండా అశోక్‌కే పగ్గాలు అప్పగించేశారు. దీంతో కినుక వహించిన గీత... ఇటీవల అశోక్ బంగ్లాలో నిర్వహించిన మినీమహనాడుకు గైర్హాజరయ్యా రు. విజయనగరం టీడీపీ వేదికపై మళ్లీ అదితికే ప్రాధాన్యం ఇవ్వడంతో గీత రాజకీయ భవిష్యత్తు కు భరోసా లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా చంద్ర బాబు పర్యటకు ఆమె డుమ్మా కొట్టేశారు. దాసన్నపేట కూడలిలో రోడ్‌షో ఆపి మాట్లేందు కు అశోక్, అదితి ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు జరిగాయి. చంద్రబాబు పక్కన వారిద్దరే ఉన్నారు. గీత రాకపోవడానికి ఆరోగ్యం బాగోకపోవడమే కారణమని ఆమె అనుచరులు చెబుతున్నా అసలు కథ ఆధిపత్య పోరేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: (అగ్నిపథ్ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం) అర్ధరాత్రి నుంచి మొదలు... గురువారం అర్ధరాత్రి 2.15 గంటల సమయంలో సన్‌రే రిసార్ట్స్‌కు చేరుకున్న చంద్రబాబుకు భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు ఆయన వర్గీయులతో స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాట్లు అన్నీ ఆయనే చూసుకున్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్న డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు వర్గీయులు ఎవరూ అక్కడ కనిపించలేదు. శుక్రవారం ఉదయం మాత్రం చంద్రబాబుకు ఎదురేగి డెంకాడ మండలానికి రాకముందే జాతీయ రహదారి టోల్గేట్ వద్ద కంది చంద్రశేఖర్‌రావు, ఆయన వర్గీయులు స్వాగతం పలికారు. అదే నెల్లిమర్ల నుంచి టీడీపీ సీటు ఆశిస్తున్న బంగార్రాజుకు పోటీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇద్దరూ వేర్వేరుగానే ఎవరి మండలాల పరిధిలో వారు బైక్ ర్యాలీ చేశారు. వారిద్దరినీ కాదని తనకు ఏమైనా నెల్లిమర్ల టికెట్ వస్తుందేమోనని కడగల ఆనంద్ నెల్లిమర్లలో సభ, ఇతరత్రా ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇలా మూడు మండలాల్లో ముగ్గురు నాయకులు వేర్వేరుగా అధినేత ముందు తమ‡బల ప్రదర్శన నిరూపణకు భారీగానే చేతిచమురు వదిలించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
Sathya Sai District: వర్గపోరుతో సై‘కిల్’.. దిగజారుతున్న టీడీపీ పరిస్థితి
టికెట్ నాదే... అంతా నేనే. ఎవరొచ్చినా మన తర్వాతే. టీడీపీలో ప్రతి నాయకుడూ అనుచర వర్గానికీ, కార్యకర్తలకు చెబుతున్న మాటలివి. దీంతో ఎవరి వెంట నడవాలో తెలియని తమ్ముళ్లు తలోదారి పట్టారు. ఫలితంగా శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాయకులంతా వర్గపోరు రాజేస్తుండగా... కార్యకర్తలు జెండా పక్కనపెట్టి మిన్నకుండిపోయారు. సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి: కొత్తగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీని కాపాడే నాయకుడు కరువయ్యారు. నేతల నడుమ వర్గపోరుతో కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులు, ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. దీంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. భారీ స్థాయిలో మహానాడు నిర్వహించి శ్రేణుల్లో ఉత్తేజం నింపామని రాష్ట్ర నాయకత్వం చెబుతున్నా.. ఇక్కడ మాత్రం కార్యకర్తలంతా నిస్తేజంలో ఉండిపోయారు. సొంతపార్టీలోనే వేరు కుంపట్లు రాజుకుంటుండగా కార్యకర్తలు ఏ కుంపటి దగ్గర చలికాచుకోవాలో అర్థం కాని పరిస్థితి. పల్లెకు పొగ పెట్టిన సైకం.. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సొంత పార్టీకే చెందిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పల్లె రఘునాథరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికి గట్టిగా పోరాడుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోతాడని బహిరంగంగానే చెబుతున్నారు. పైగా తన అనుచరుడు సైకం శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అధిష్టానం నిర్వహించిన సర్వేలోనూ పల్లె బాగా వెనుకబడ్డారని తేలింది. దీంతో పాటు పల్లె రఘునాథరెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేక ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు సైతం ఆయన్ను వెంటాడుతున్నాయి. దీంతో సొంతపార్టీలోనే పల్లె ఒంటరిగా మిగిలిపోయారు. చివరకు సీఎంను విమర్శిస్తేనైనా చంద్రబాబు మెప్పు పొందచ్చునేమోనన్న ఆశతో ఆయన తన స్థాయిని మించి విమర్శలు చేస్తుండగా... నియోజకవర్గ ప్రజలు ఈయనపై సెటైర్లు వేస్తున్నారు. చదవండి: (టీడీపీలో మహిళలకు గౌరవం లేదు) ధర్మవరంలో సూరికి సెగ.. భూదందాల్లో ఆరితేరిన వరదాపురం సూరికి ధర్మవరంలో నిరసన సెగ తగలుతోంది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూరి బీజేపీలో చేరారు. తిరిగి ఇప్పుడు పచ్చజెండా కప్పుకోవాలని చూస్తుండగా... సూరీని ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదని పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరారు. కండువా కప్పుకోవాలంటే ‘నేనే కండువా వెయ్యాలి, ఇలాంటి వారు వస్తుంటారు పోతుంటారు’ అని శ్రీరామ్ విమర్శించారు. దీంతో అక్కడ టీడీపీ నాయకుడెవరో కార్యకర్తలకు అర్థం కాక ఇప్పటికే మెజార్టీ కేడర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లింది. మిగిలిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కదిరిలో కందికుంటకు చెక్.. చెక్‌బౌన్స్ కేసులో శిక్ష పడిన మాజీ ఎమ్మెల్యే కందికుంట పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. కదిరిలో టీడీపీ కేడర్ అత్తర్ చాంద్‌బాషా, కందికుంట వర్గాలుగా విడిపోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. చాంద్‌బాషా 2014లో వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లారు. ఇదే సమయంలో కందికుంటపై కేసులు నమోదయ్యాయి. దీంతో కందికుంట పక్కన పెట్టిన టీడీపీ కేడర్... అత్తార్ వైపు కూడా నడవలేక పోతోంది. గెలిపించిన పార్టీని మోసం చేసి టీడీపీలోకి వెళ్లారని సొంత సామాజికవర్గమే అత్తార్‌పై గుర్రుగా ఉండగా.. కదిరి తెలుగు తమ్ముళ్లు ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. బీకేకు దీటుగా సబిత .. పెనుకొండలో బీకే పార్థసారధి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పార్టీ కార్యక్రమాలు సరిగా చేయడం లేదని ఇప్పటికే ఆయనపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు మాజీమంత్రి రామచంద్రారెడ్డి కూతురు సబిత ఇక్కడ టీడీపీ టికెట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వర్గాన్ని కూడగడుతున్నారు. కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలు బీకేకు తలనొప్పిగా మారాయి. అసలు బీకేకు టికెట్ వస్తుందో రాదోనన్న పరిస్థితి నెలకొంది. చదవండి: (చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు) మడకశిరలో ఎవరికి వారే.. మడకశిరలో వింతపరిస్థితి. 2019లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిన ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఉప్పూ నిప్పులా మారారు. దీంతో కార్యకర్తలూ రెండు వర్గాలుగా విడిపోయారు. ఏ కార్యక్రమమైనా వేర్వేరుగా జరుపుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఒక వర్గానికి టికెట్ ఇస్తే మరో వర్గం ఓట్లు వేసే పరిస్థితి లేదు. అధిష్టానం ఇరువురినీ పిలిపించి రాజీ చేసినా తెల్లారేసరికి మళ్లీ గ్రూపులుగా విడిపోయారు. ఇలా వర్గపోరుతో కేడర్ మడకశిరలో ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయింది. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలూ ప్రభుత్వ పథకాలపై ఆకర్షితులవుతుండగా.. వారిని కాపాడుకోవడం తలకుమించిన భారమైంది. బాలయ్యను మర్చిపోయిన ‘పురం’వాసులు.. రెండున్నర దశాబ్దాలుగా ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపురం ప్రజలు పట్టం కడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణను గెలిపించినా ఏడాదికి ఒకసారి కూడా ఆయన హిందూపురం నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు వర్గం, పార్టీ అనేది లేకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో హిందూపురంలో అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో నియోజకవర్గ జనం ఎమ్మెల్యే బాలకృష్ణను పూర్తిగా మర్చిపోయారు. ఈ సారి అందుబాటులో ఉండేవారికి ఓటేస్తే బావుంటుందన్న ఆలోచన ఉన్నారు. ఇదే జరిగితే ఈసారి హిందూపురంలోనూ టీడీపీకి గల్లంతు ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. -
కమలంలో ‘ప్రొటోకాల్’ కలకలం! పైకి అంతా బాగా ఉన్నట్టు కనిపిస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: కమలం పార్టీలో ప్రొటోకాల్ కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీలో అంతా బాగానే ఉన్నట్టుగా పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా గ్రూపు తగాదాలు బయటపడుతున్నాయి. ప్రజాసంగ్రామ యాత్ర–2 ప్రారంభానికి ముందే ఇలాంటివి వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా పాదయాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తనను వేదికపైకి పిలవకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. తమకు గౌరవం, ప్రాధాన్యతనివ్వడం లేదంటూ కొన్నిరోజుల క్రితం వివిధ జిల్లాల్లోని పలువురు సీనియర్ నేతలు ఇటీవల సమావేశాలు నిర్వహించగా, జాతీయపార్టీ వారిని బుజ్జగించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ఉల్లంఘన రూపంలో అసంతృప్తి బట్టబయలైంది. తన ఫిర్యాదును పరిష్కరించకపోతే జాతీయ నాయకత్వాన్ని ఆశ్రయించాలని, వారం రోజుల్లో తగిన స్పందన రాకపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రఘునందన్ భావిస్తున్నట్టు తెలిసింది. గతేడాది తొలివిడత ›ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి మొదలు పెడితే ము గింపు సభ హుస్నాబాద్ దాకా, ఆ తర్వాత మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం దాకా పదిసార్లు అవమానాలు ఎదురయ్యాయని ఆయన తన అనుయాయులతో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొందరు ముఖ్యనేతలు ఇతర ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కించపరుస్తూ తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ఒంటెద్దు పోకడపోవడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్టు తెలిసింది. (చదవండి: తెలంగాణ జడ్జీల స్థానంలో ఆంధ్రా జడ్జీలు? ) -
టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
-
టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయట పడ్డాయి. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈనెల 29న(ఎల్లుండి)పార్టీ ఆవిర్భావదివ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో వివాదం చెలరేగింది. వైవీ ఆంజనేయులు వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కోడెల శివరాం వర్గం పడివేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి యత్నించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. -
రసాభాసగా టీఆర్ఎస్ సమావేశం
సాక్షి, వికారాబాద్(యాలాల): టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు పట్టణ శివారులోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం టీఆర్ఎస్ యాలాల మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఇక్కడకు చేరుకున్నారు. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్త సమావేశాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆతర్వాత ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్‌కు మైక్ అందిస్తుండగా.. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్ అడ్డుకున్నారు. ఇది పార్టీకి సంబంధించిన సమావేశమని, ముందుగా పార్టీ అధ్యక్షుడికి మాట్లాడే అవకాశం ఇవ్వరా..? అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పార్టీ మండల అధ్యక్షుడికి మొదట మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ అప్పగించారు. ఇదే సమయంలో తాను రెండు నిమిషాల్లో ప్రసంగం ముగిస్తానని విఠల్ నాయక్ చెప్పడంతో సిద్రాల శ్రీనివాస్ ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మధ్యలో కల్పించుకున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డిపై సిద్రాల శ్రీనివాస్ మండిపడ్డారు. ‘ఇది యాలాల మండల పార్టీ సమావేశం.. తాండూరు మండలానికి చెందిన వాడివి, నీకు ఇక్కడ ఎలాంటి పని లేదు’ అని గద్దించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యక్రమంలో మండల అధ్యక్షుడికే అవమానం జరిగితే ఎలా అని అసహనం వ్యక్తంచేస్తూ కొంతమంది సర్పంచ్‌లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాయకులకు నచ్చజెప్పడంతో సిద్రాల శ్రీనివాస్ ప్రసంగం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల పార్టీకి కొందరు కొత్తబిచ్చగాళ్లు వచ్చారు’అనడంతో.. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్త అడ్డుకున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో స్టేజీపై ఇలా మాట్లాడటం తగదన్నారు. రెండు రోజులుగా సమావేశ ఏర్పాట్లు జరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా సమయానికి వచ్చి గొడవ చేయడం ఏమిటని నిలదీశారు. ఇలా కార్యక్రమం ముగిసే వరకూ నాయకుల మధ్య వాగ్వాదం కొనసాగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి కలి్పంచుకుని పరిస్థితిని మరింత ఉద్రిక్తం కాకుండా చక్కదిద్దారు. -
టీఆర్ఎస్లో రచ్చ: నువ్వెంతంటే.. నువ్వెంత!
సాక్షి, తాండూరు: ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. సమావేశంలో ఆవేశకావేశాలకు లోనయ్యారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ మాటలయుద్ధానికి దిగారు. ఫలితం గా సమావేశం రసాభాసగా మారింది. తాండూరు మున్సిపల్ సమవేశం సోమవారం చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. చదవండి: (ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు) తాను సూచించిన మూడు అంశాలను తొలగించారని, మున్సిపల్ అభివృద్ధికి తగినట్లుగా ఎజెండాలేదని, దానిని చెత్తబుట్టలో వేయాలని ఎమ్మెల్యే మండిపడ్డారు. అదేసమయంలో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ ఫ్లోర్ లీడర్లు ఎజెం డా ప్రతులను చించివేశారు. కౌన్సిలర్ల మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు నువ్వెంత.. అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగారు. ఈ పరిణామాల మధ్యే ఎమ్మెల్సీ సూచన మేరకు మెజార్టీ కౌన్సిలర్లు ఎజెండాను ఆమోదించారు. కాగా, ఇరువర్గాలకు చెందిన ఇద్దరు నేతలు సమావేశం ముగిసిన తర్వాత కౌన్సిల్ ఎదుట ఘర్షణకు దిగారు.