మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నం (బందరు) టీడీపీలో ముసలం పుట్టింది. పచ్చ తమ్ముళ్ల మధ్య అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పట్టణ మున్సిపల్ ఛైర్మన్ బాబా ప్రసాద్ అనుసరిస్తున్న వైఖరిపై స్థానిక కౌన్సిలర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బాబా ప్రసాద్కు వ్యతిరేకంగా 10 మంది కౌన్సిలర్లు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు.
బాబా ప్రసాద్పై టీడీపీ అగ్రనేతలకు ఫిర్యాదు చేయాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. బందరు మున్సిపల్ ఛైర్మన్ బాబా ప్రసాద్ కి... ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు మధ్య దూరం బాగా పెరిగింది. ఈ విషయంపై స్థానిక నాయకులు జోక్యం చేసుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు... పార్టీ అగ్ర నాయకులతో భేటీ కానున్నారు.