![Kurnool TDP Internal Clashes Party Leaders Workers Fight](/styles/webp/s3/article_images/2024/07/1/TDP_3.jpg.webp?itok=bdFnukkp)
కర్నూలు, సాక్షి: అధికార పార్టీలో పాత గొడవలు బయటికొస్తున్నాయి. అటు మంత్రాలయంలో, ఇటు కొడుమూరులో తమ్ముళ్లు రోడ్డు మీదకు చేరి తన్నుకున్నారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడి.. ఆస్పత్రి పాలయ్యారు.
మంత్రాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ నేత రాఘవేంద్ర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వంట పథకం ఏజెన్సీ విషయాల్లో తొలుత వాగ్వివాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయి ఇరు వర్గాలు బాహబాహీకి దిగాయి.
కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో జరిగిన ఫించన్ల పంపిణీ కార్యక్రమం.. తన్నుకున్నేదాకా వెళ్లింది. ఇరువర్గాలకు చెందిన నాయకుల మధ్య మొదలైన గొడవతో ఇరు శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఈ గొడవలో టీడీపీ నేత సురేష్‌కు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు.
![](/sites/default/files/inline-images/30_3.png)
Comments
Please login to add a commentAdd a comment