తాండూరు మున్సిపల్ భేటీలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిల మధ్య మాటలయుద్ధం
సాక్షి, తాండూరు: ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. సమావేశంలో ఆవేశకావేశాలకు లోనయ్యారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ మాటలయుద్ధానికి దిగారు. ఫలితం గా సమావేశం రసాభాసగా మారింది. తాండూరు మున్సిపల్ సమవేశం సోమవారం చైర్‌పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. చదవండి: (ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు)
తాను సూచించిన మూడు అంశాలను తొలగించారని, మున్సిపల్ అభివృద్ధికి తగినట్లుగా ఎజెండాలేదని, దానిని చెత్తబుట్టలో వేయాలని ఎమ్మెల్యే మండిపడ్డారు. అదేసమయంలో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ ఫ్లోర్ లీడర్లు ఎజెం డా ప్రతులను చించివేశారు. కౌన్సిలర్ల మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు నువ్వెంత.. అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగారు. ఈ పరిణామాల మధ్యే ఎమ్మెల్సీ సూచన మేరకు మెజార్టీ కౌన్సిలర్లు ఎజెండాను ఆమోదించారు. కాగా, ఇరువర్గాలకు చెందిన ఇద్దరు నేతలు సమావేశం ముగిసిన తర్వాత కౌన్సిల్ ఎదుట ఘర్షణకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment