అనంతపురం : అనంతపురం జిల్లా కదిరి టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే చాంద్ బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట మధ్య వైరం పెరుగుతుంది. స్థానిక మార్కెట్ కమిటీ పదవులను కందికుంట వర్గీయులు దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారానికి గురువారం అట్టహాసంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్ఏ చాంద్బాషాను కందికుంట వర్గం ఆహ్వానించలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన నారా లోకేష్కు కందికుంటపై ఫిర్యాదు చేశారు. లోకేష్ జోక్యంతో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.