
ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డు సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న అన్న క్యాంటీన్
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని రాగమయి బార్ అండ్ రెస్టారెంట్ బోర్డుకు ముసుగు వేశారు. బార్ పక్కనే ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్‌ను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నందున ఆయనకు కనబడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తగా బార్‌కు రెండు వైపులా పేరుతో ఉన్న బోర్డుకు ముసుగు వేయించేశారు. బుధవారం మాత్రం మద్యం దుకాణాన్ని మూసివేయాల్సిందిగా అధికారులు బార్ యజమానిని హెచ్చరించటంకూడా జరిగింది.
కాగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీకి వెళ్లిన సందర్భంలో కాలనీకి వెళ్లే రోడ్డు ప్రారంభంలో ఒక వైన్ షాపు ఉండటాన్ని గమనించి ఆ వైన్ షాప్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆ తరువాత జిల్లాకు చెందిన మంత్రి ఒకరు దానిని పునఃప్రారంభించేలా లాబీయింగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందుగానే అన్న క్యాంటిన్ పక్కనే ఉన్న బార్‌ను చంద్రబాబుకు కనబడకుండా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment