సాక్షి, పశ్చిమ గోదావరి : రూ. 10 లక్షలు ఖర్చు అయ్యే అన్నా క్యాంటీన్‌ల వ్యయాన్ని రూ. 35 లక్షలకు పెంచి టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు దోచేశాడని రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ ఆరోపించారు. ‘‘నువ్వ తిన్న అవినీతి సొమ్ము మొత్తాన్ని కక్కిస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత రామానాయుడుకు లేదంటూ మండిపడ్డారు. ఆరు నెలలు అన్నా క్యాంటీన్ డబ్బులు చెల్లించకుండా గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment