ramanaidu
-
షష్టి పూర్తి!
తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రోడక్షన్స్ షష్టి పూర్తి (60 ఏళ్లు) ప్రయాణం పూర్తి చేసుకుంది. పద్మభూషణ్, దివంగత నిర్మాత డా. డి. రామానాయుడు 1964లో స్థాపించిన సురేష్ ప్రోడక్షన్స్ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు పొందడంతో పాటు ప్రేక్షకుల మన్ననలను పొందింది. ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టారు రామానాయుడు. రైసు మిల్లు వ్యాపారం చేస్తున్న సమయంలో ఆయన మద్రాసు వెళ్లారు. అక్కడ కొందరు సినీ ప్రముఖుల పరిచయం ఆయన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. భాగస్వామ్యంతో ‘అనురాగం’ చిత్రం నిర్మించారు రామానాయుడు.ఆ చిత్రం విజయవంతం అయింది. ఆ తర్వాత తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరుతో సురేష్ ప్రోడక్షన్స్ స్థాపించి, ఎన్టీఆర్‌తో ‘రాముడు–భీముడు’ (1964) సినిమా నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్నుంచి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ వస్తోంది సురేష్ ప్రోడక్షన్స్. శతాధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుని, చరిత్ర సృష్టించారు రామానాయుడు.2015 ఫిబ్రవరి 18న ఈ మూవీ మొఘల్ తుది శ్వాస విడిచారు. అప్పటికే తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సురేష్‌బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు వెంకటేశ్ హీరోగా కొనసాగుతున్నారు. మనవడు రానా నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్ కూడా హీరో (‘అహింస’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు)గా చేసిన విషయం తెలిసిందే. ఇక సురేష్ ప్రోడక్షన్స్ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది. -
నా పెద్ద కొడుకు చాలా పిరికివాడు..!
-
మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
-
అర్థరాత్రి చంద్రబాబు ఫోన్ చేసి..!
-
శ్రీదేవి అంటే నాకు చాలా గౌరవం : రామానాయుడు
-
ఆ క్రెడిట్ ఆ వ్యక్తికి చెందాలి : దగ్గుబాటి రామానాయుడు
-
మా జూ.ఎన్టీఆర్ తో 'రాముడు భీముడు' తీయాలనేది చిరకాల కోరిక
-
శ్రీదేవిని ఎత్తుకుంటే పక్కన హీరోలు అలిగేవారు.. ఆ రోజులు వేరు..
-
తండ్రి వర్థంతి: హీరో వెంకటేష్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలన చిత్ర నిర్మాతగా వచ్చి దేశవ్యాప్తంగా ఎన్నో బాషల్లో సినిమాలు నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచారు ప్రముఖ దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు. నేడు ఆయన 6వ వర్థంతి. 2015 ఫిబ్రవరి 18న ఆయన అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెండవ కుమారుడు, హీరో విక్టర్ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. తన ట్విటర్ ఖాతాలో తండ్రి చిత్ర పటాన్ని గురువారం షేర్ చేస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘ఇన్నేళ్లు గడిచాయి. కానీ ఈ రోజు మిగిల్చిన చేదు అనుభవాన్ని మాత్రం అంత ఈజీగా మరవకలేకపోతున్నాం. ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న. లవ్ యూ. మిస్ యూ’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే ఆయన పెద్ద కూమారుడు, నిర్మాత సురేష్ బాబు.. తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఫిల్మ్ నగర్‌లోని రామానాయడు విగ్రహానికి సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి నివాళులు ఘటించారు. Even after all these years, this day is never easy. Thank you for all the memories Nana. Love you and miss you 😞♥️ pic.twitter.com/lLPGe9nyMH — Venkatesh Daggubati (@VenkyMama) February 18, 2021 (చదవండి: ఆసక్తి రేపుతున్న నారప్ప టీజర్) (వెంకీ మామ ఇంటి పని అదిరింది) -
వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా ‘సోగ్గాడు’. అది ఎంత స్పెషల్ అంటే, ‘వెండితెర సోగ్గాడు’ అంటే శోభన్ బాబే అనేటంతగా స్పెషల్. సరిగ్గా 45 ఏళ్ళ క్రితం 1975 డిసెంబర్ 19న రిలీజైన ‘సోగ్గాడు’ చిత్రంలోని ఉర్రూతలూపిన పాటలు, బాక్సాఫీస్‌ను ఊపేసిన వసూళ్ళు ఇవాళ్టికీ ఓ చెరిగిపోని చరిత్రే! గ్రామీణ నేపథ్యంలోని ఓ కథ గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని కేంద్రాలలో విజయఢంకా మోగించడం విశేషమే. శోభన్ బాబు హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అందించిన అలాంటి బాక్సాఫీస్ విశేషం ‘సోగ్గాడు’. ఊరంతా సోగ్గాడుగా పిలిచే శోభనాద్రి (శోభన్ బాబు), అతని మరదలు (జయసుధ), అనుకోకుండా నగరంలోని హోటల్ రూమ్‌లో అతను పెళ్ళాడిన అమ్మాయి (జయచిత్ర) మధ్య నడిచే కథ ఇది. కృష్ణాజిల్లా కోలవెన్ను, ఈడ్పుగల్లు, అలాగే రామానాయుడు తన స్వగ్రామం కారంచేడులో తొలిసారిగా షూటింగ్ చేసిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషనల్ హిట్. నిజజీవితంలోని తన బాబాయిని అనుకరిస్తూ, కోరమీసం, పంచెకట్టుతో, ఎడ్లబండి నడుపుతూ, ‘తస్సాదియ్యా’ అనే ఊతపదంతో ఆ రోజుల్లో శోభన్ బాబు చేసిన నటన, జయసుధ, జయచిత్రల గ్లామర్ అండగా ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమా ఇది. స్టార్ డమ్ తెచ్చిన సూపర్ హిట్: శోభన్ బాబు కబడ్డీ ఆటగాడుగా కనిపించే ఈ చిత్రం అప్పట్లో ఎదురులేని ప్రజాదరణతో అఖండ విజయం సాధించింది. ‘సోగ్గాడు’ రిలీజవడానికి సరిగ్గా వారం ముందు... 1975 డిసెంబర్ 12న ఇదే చిత్ర దర్శకుడు కె. బాపయ్య డైరెక్షన్లోనే పెద్ద ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్‌కు అదే తొలి సినిమా. ఎన్టీఆర్‌ను ఓ కొత్త పంథాలో చూపించిన ఆ సినిమా ఓ పక్కన ఆడుతుండగానే, సీనియర్ టాప్ హీరోతో పోటాపోటీగా శోభన్ బాబును నిలిపింది ‘సోగ్గాడు’. థియేటర్లలో విజయఢంకా మోగించిన ఈ చిత్రం విడుదలైన అనేక కేంద్రాలలో విజయ విహారం చేస్తూ, వసూళ్ళలో నూతన అధ్యాయం çసృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. విడుదలైన 31 కేంద్రాలలో 50 రోజుల పండగ జరుపుకొంది. 19 కేంద్రాలలో వందల రోజుల పైగా ఆడింది. శోభన్ బాబు కెరీర్లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇదే. వెరసి... సరికొత్త స్టార్ హీరోగా శోభన్ బాబు అవతరించడానికి తోడ్పడింది. తమిళ స్టార్ శివాజీగణేశన్ ముఖ్య అతిథిగా చిత్రయూనిట్ అంతా పాల్గొనగా, విజయవాడలో వందరోజుల వేడుక జరుపుకొన్న ఈ చిత్రం బాపయ్యను కూడా దర్శకుడిగా మరో మెట్టు పైన పెట్టింది. దర్శకులు బాపయ్య, కె. రాఘవేంద్రరావు కజిన్స్. గమ్మత్తేమిటంటే, ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమండ్రిలో బాపయ్య మరో యూనిట్‌తో బిజీగా ఉండడంతో, రాఘవేంద్రరావు స్వయంగా హైదరాబాద్‌లో కొన్ని షాట్లు, ఇండోర్ సీన్లు తీసిపెట్టారు. కెరీర్ బెస్ట్ ఇయర్: నిజానికి, శోభన్ బాబు కెరీర్లోనే ఓ మరపురాని సంవత్సరం – 1975. ఆ ఏడాది శోభన్ బాబు సినిమాలు ఏకంగా 8 రిలీజయ్యాయి (‘దేవుడు చేసిన పెళ్ళి, అందరూ మంచివారే, బాబు, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, గుణవంతుడు, సోగ్గాడు’). వాటిలో 5 సూపర్ హిట్లు. అలా ఆ ఏడాది శోభన్ బాబుకు బాగా కలిసొచ్చింది. ఆయన స్టార్ అయిపోయారు. ఒకే ఏడాది ‘జీవన జ్యోతి, సోగ్గాడు’– ఈ రెండు సూపర్ హిట్లతో శోభన్‌బాబు ఇమేజ్ తార స్థాయికి చేరింది. ఈ సినిమాతోనే నటి జయచిత్ర తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు. అప్పటికి వర్ధమాన నటి అయిన జయసుధ హీరో మరదలిగా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. తమిళ రచయిత బాలమురుగన్ అందించిన కథకు మోదుకూరి జాన్సన్ మాటలు, కె.వి. మహదేవన్ సంగీతంలో ఆచార్య ఆత్రేయ పాటలు ఆకట్టుకున్నాయి. గమ్మత్తేమిటంటే, నిజానికి ఈ చిత్రాన్ని నాగిరెడ్డి వారసుల విజయ కంబైన్స్, రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సమర్పించినట్టు సినిమా టైటిల్ కార్డుల్లో ఉన్నా, పోస్టర్లు, పబ్లిసిటీలో మాత్రం విజయా కంబైన్స్ పేరు కనిపించదు. ఈ తెలుగు సూపర్ హిట్‌ను ఆ తరువాత హిందీలో జితేంద్ర, రేఖ జంటగా ‘దిల్ దార్’ పేరిట రీమేక్ చేశారు. అందరూ కోరిన అందాల నటుడు: ఆ రోజుల్లో ఎక్కడ విన్నా... మహదేవన్ బాణీల్లోని ‘సోగ్గాడు’ పాటలే. ‘సోగ్గాడు లేచాడు చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు...’ పాట వస్తూ ఉంటే, మాస్లో ఓ హిస్టీరియా. ఫ్యాన్స్ అయితే, తమ అభిమాన హీరో బాక్సాఫీస్ వద్ద జూలు విదిలించి, రికార్డుల దుమ్ము దులుపుతున్నాడని కేరింతలు కొట్టారు. ఈ సినిమాలోని ‘ఏడుకొండలవాడా వెంకటేశా.. ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా’ అనే పాట రేడియోలో కొన్నేళ్ళు ఓ అభిమాన జనరంజక గీతం. అలాగే, ‘అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి’ పాట. ‘చలివేస్తోంది... చంపేస్తోంది...’ పాట కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టింది. ‘సోగ్గాడు’తో పతాక స్థాయికి చేరిన ఇమేజ్‌తో... పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకు ఇలాంటి అబ్బాయి కావాలనే కోరిక పుట్టింది. కన్నవాళ్ళకు అలాంటి కొడుకు కావాలనే ప్రేమ వచ్చింది. తోడబుట్టినవాడు శోభన్ బాబు లాంటి తమ్ముడైతే బాగుండనే అభిమానం వెల్లువెత్తింది. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇద్దరు ప్రేయసుల మధ్య నలిగే అందాల నటుడిగా శోభన్ బాబు తెలుగుతెరను ఏలారు. అదీ ‘సోగ్గాడు’గా శోభన్‌బాబు చేసిన మేజిక్. – రెంటాల జయదేవ -
ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
-
కలకలం రేపిన చోరీ: ఆ దొంగ దొరికాడు!
సాక్షి, కారంచేడు: బాపట్ల మాజీ ఎంపీ, మూవీ మొఘల్ దివంగత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో జరిగిన దొంగతనం కేసును కారంచేడు పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి.. అతడి వద్ద నుంచి రూ. 3 లక్షల 60వేల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కారంచేడు నడిబొడ్డు చినవంతెన సెంటర్ లైబ్రరీ బజారులో సినీ నిర్మాత, మూవీ మోఘల్‌గా పేరొందిన గ్రామానికి చెందిన డాక్టర్ దగ్గుబాటి రామానాయడు ఇంట్లో ఇటీవల దొంగలు పడిన సంగతి తెలిసిందే. రామానాయుడు ఇంట్లో ప్రస్తుతం ఆయన సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్రావు (మోహన్‌బాబు) నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటుండటంతో దంపతులు తరుచూ హైదరాబాద్ వెళ్లి వారం, పది రోజులు ఉండి వస్తుంటారు. అదే క్రమంలో ఈ నెల 16వ తేదీన మోహన్‌బాబు దంపతులు హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో పనులు చేసే నరసింహారావు, సుజాత దంపతులు శనివారం ఉదయం వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి గ్రామంలోనే ఉండే ఆఫీస్ మేనేజర్ తాళ్లూరి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అన్ని బీరువాలు, అరమరలు పగులగొట్టి ఉండటంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల రూరల్ సీఐ జె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి క్లూస్ టీమ్‌తో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విషయం తెలిసిన సినీ నిర్మాత, నటుడు, మోహన్‌బాబు బావమరిది కొల్లా అశోక్‌కుమార్ వచ్చి పోలీసులకు వివరాలు అందించారు. -
మూవీ మొఘల్ రామానాయుడు ఇంట్లో చోరీ
సాక్షి, కారంచేడు: బాపట్ల మాజీ ఎంపీ, మూవీ మొఘల్ దివంగత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో దొంగలు చేతివాటం చూపించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీభత్సం సృష్టించారు. బీరువాలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మండల కేంద్రం కారంచేడు చినవంతెన సమీపంలో జరిగింది. రామానాయుడు ఇంట్లో దొంగలు పడ్డారని తెలియడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కారంచేడు నడిబొడ్డు చినవంతెన సెంటర్ లైబ్రరీ బజారులో సినీ నిర్మాత, మూవీ మోఘల్‌గా పేరొందిన గ్రామానికి చెందిన డాక్టర్ దగ్గుబాటి రామానాయడు ఇంట్లో దొంగలు పడ్డారు. రామానాయుడు ఇంట్లో ప్రస్తుతం ఆయన సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్రావు (మోహన్‌బాబు) నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటుండటంతో దంపతులు తరుచూ హైదరాబాద్ వెళ్లి వారం, పది రోజులు ఉండి వస్తుంటారు. అదే క్రమంలో ఈ నెల 16వ తేదీన మోహన్‌బాబు దంపతులు హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంట్లో పనులు చేసే నరసింహారావు, సుజాత దంపతులు శనివారం ఉదయం వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి గ్రామంలోనే ఉండే ఆఫీస్ మేనేజర్ తాళ్లూరి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అన్ని బీరువాలు, అరమరలు పగులగొట్టి ఉండటంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల రూరల్ సీఐ జె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి క్లూస్ టీమ్‌తో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విషయం తెలిసిన సినీ నిర్మాత, నటుడు, మోహన్‌బాబు బావమరిది కొల్లా అశోక్‌కుమార్ వచ్చి పోలీసులకు వివరాలు అందించారు. సంఘటన స్థలాన్ని చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి పరిశీలించి పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10 కేజీల వెండి మాయం బాధితుల ఫోన్ సమాచారం మేరకు 10 కేజీల వెండి వస్తువులు, మూడు సవర్ల బంగారం, రూ.60 వేల నగదు మాయమయ్యాయని సీఐ శ్రీనివాసరావు వివరించారు. మోహన్‌బాబు దంపతులు హైదరాబాద్ నుంచి వస్తున్నారని, వారు వచ్చిన తర్వాత చోరీ సొత్తు వివరాలు పూర్తిగా తెలుస్తాయని, అప్పుడు పూర్తి స్ధాయి విచారణ చేపడతామని సీఐ వివరించారు. గ్రామస్తుల ఆందోళన ఎప్పుడూ రద్దీగా, పటిష్ట భద్రత ఉండే రామానాయుడు ఇంట్లో దొంగల పడ్డారనే సమాచారంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ఇంట్లో ఎవరూ లేకుండా తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇక్కడ ఇదే మాదిరి దొంగతనాలు జరిగిన విషయాన్ని గ్రామస్తులు చర్చించుకుంటుంన్నారు. గ్రామంలో పోలీసుల గస్తీని ముమ్మరం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. చీరాల రూరల్ సీఐ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
‘నువ్వు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి : రూ. 10 లక్షలు ఖర్చు అయ్యే అన్నా క్యాంటీన్ల వ్యయాన్ని రూ. 35 లక్షలకు పెంచి టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు దోచేశాడని రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ ఆరోపించారు. ‘‘నువ్వ తిన్న అవినీతి సొమ్ము మొత్తాన్ని కక్కిస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక అర్హత రామానాయుడుకు లేదంటూ మండిపడ్డారు. ఆరు నెలలు అన్నా క్యాంటీన్ డబ్బులు చెల్లించకుండా గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. -
ముగిసిన నాటక పోటీలు
ఉత్తమ ప్రదర్శనగా ’చాలు..ఇక చాలు’ పాలకొల్లు టౌన్: సమాజంలోని రుగ్మతలను పాలద్రోలి ప్రజలను చైతన్యవంతులను చేసే శక్తి నాటకరంగానికి ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం రాత్రి డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ పదో జాతీయ స్థాయి నాటిక పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటక రంగం కనుమరుగు కాకుండా భావితరాలకు అందించడానికి కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆ నాటి కళాకారుడు, ప్రముఖ సినీ, నాటక దర్శకుడు పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గర నుంచి నేటి తరం గజల్ శ్రీనివాస్ వరకు ప్రపంచ ఖ్యాతి సంపాదించి కళలతకు పుట్టినిల్లుగా పాలకొల్లు భాసిల్లుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కళాపరిషత్‌లు నిర్వహించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, విన్నకోట వేంకటేశ్వరరావు, డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, మేడికొండ శ్రీనివాసచౌదరి, కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, రంగస్థల వృత్తి కళాకారుల సంఘ జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు, గుండా రామకృష్ణ, రాయప్రోలు భగవాన్, బుద్దాల వెంకట రామారావు, జీవీబీఎస్ మూర్తి, జి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ’చాలు.. ఇక చాలు’ ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా శ్రీ సాయి ఆర్ట్స్కొలకలూరి వారి ’చాలు..ఇక చాలు’ నాటిక ఉత్తమ మొదటి బహుమతిని గెలుచుకుంది. అభినందన ఆర్ట్స్గుంటూరు వారి ’కేవలం మనుషులం’, అరవింద ఆర్ట్స్తాడేపల్లి వారి ’స్వర్గానికి వంతెన’ నాటికలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా ’నాన్నా.. నువ్వో సున్నా’ నిలిచింది. దిష్టిబొమ్మలు నాటక రచయిత తాళాబత్తుల వేంకటేశ్వరరావు ఉత్తమ రచయితగా, నాన్నా నువ్వో సున్నా నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. చాలుఇక చాలులో నీలకంఠం పాత్రధారి కేవీ సుబ్బారాయుడు ఉత్తమ నటుడిగా, దిష్టిబొమ్మలు నాటికలో జానకమ్మ పాత్రధారిణి ఎం.లక్ష్మతులసి ఉత్తమ నటిగా, గోవు మాలచ్చిమిలో గోవిందయ్య పాత్రధారి జానా రామయ్య ఉత్తమ ప్రతినాయకుడిగా, సందడే..సందడి నాటికలో దొంగ పాత్రధారుడు కె.జోగారావు ఉత్తమ హాస్య నటుడిగా, కేవలం మనుషులం నాటికలో మీర్జా ఆలీఖాన్ పాత్రధారి వీసీహెచ్‌కే ప్రసాద్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంపికయ్యారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రసాదరెడ్డి (హైదరాబాద్), కేకేఎల్ స్వామి (విజయనగరం), విన్నకోట వేంకటేశ్వరరావు (పాలకొల్లు) వ్యవహరించారు. -
సింగిల్‌గా హ్యాపీ....పెళ్లికి తొందర లేదు
హైదరాబాద్: ఇంకా ఎవరితోనూ ప్రేమలో పడలేదని, ఒంటరిగా సంతోషంగానే ఉన్నానని టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, విలక్షణ నటుడు దగ్గుబాటి రానా వ్యాఖ్యానించాడు. అప్పుడే పెళ్లికి తొందరేముందంటూ వ్యాఖ్యానించాడు. 2015 సంవత్సరంలో చాలా ఉత్థాన పతనాలను చవిచూసిన బల్లాలదేవ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ఈ ఏడాది బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో ఏకకాలంలో పనిచేయడంలో పెద్ద కష్టమనిపించలేదని రానా తెలిపాడు. ఈ సంవత్సరం తీవ్రమైన ఎత్తు పల్లాల మధ్య గడిచిందని, మంచి, చెడు రెండింటిని మిగిల్చిందని అతడు గుర్తు చేసుకున్నాడు. జీవితంలో 2015 సంవత్సరం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నాడు. ముఖ్యంగా తాతగారు రామానాయుడ్ని కోల్పోవడం చాలా బాధ కలిగించిందని తెలిపాడు. అలాగే రెండు సంవత్సరాల విరామం తరువాత వచ్చిన బాహుబలి, రుద్రమదేవి ఘన విజయం సాధించి తన కెరియర్లో మైలురాళ్లుగా నిలిచాయని రానా పేర్కొన్నాడు. 'కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే, సినిమా అన్నది కలకాలం నిలబడే శిల్పం' అని తాతగారు ఎపుడూ చెప్పే మాటలను గుర్తు చేసుకుంటూ వుంటానని రానా పేర్కొన్నాడు. విలక్షణమైన, విభిన్నమైన క్యారెక్టర్లను చేయడమే తనకిష్టమని సింగిల్ ఫార్ములా పాత్రలంటే తనకు పడదని తెలిపాడు. పాత్ర నచ్చితే దాని ప్రాధాన్యాన్ని బట్టి నిడివితో సంబంధం లేకుండా క్యారెక్టర్‌ను ఎంచుకుంటానని చెప్పాడు. కథ నచ్చితే రెండో ఆలోచనల లేకుండా విలన్ పాత్ర చేయడానికైనా సిద్ధమని, రుద్రమదేవి, బాహుబలి సినిమాల్లో నటించేందుకు అదే కారణమని తెలిపాడు. సినిమాల్లో నటించే పాత్రల ద్వారా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవచ్చని ఈ కండలవీరుడు చెప్పుకొచ్చాడు. బెంగళూరు డేస్ సినిమా తనకు మంచి అనుభవాన్ని మిగిల్చిందని రానా తెలిపాడు. సినిమాల్లో డ్యాన్సులు చేయాల్సిన అవసరం తనకు కనిపించలేదని, అందరూ హీరోలు చేసే పనే అని..మళ్లీ కొత్తగా తనెందుకు చేయాలని ప్రశ్నించారు. వాస్తవానికి అనవసరమైన పాటలు, డ్యాన్సులు తనకు నచ్చవన్నారు. 'నా ఇష్టం' లాంటి సినిమాలు తనకు సరిపడవని, అసలు ఆ సినిమా తాను చేసి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించాడు. చెన్నై వరద బాధితులకు సహాయ పనులతోనూ తన సోదరి మాళవిక కూతురు అయిరాతో ఈ సంవత్సరాంతం గడిచిందని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేకమైన, బెంచ్ మార్క్‌గా నిలిచే సినిమాల్లో నటించాలని ఉందని తెలిపాడు. -
వెంకీ ఇప్పుడేం చేస్తున్నట్లు?
‘గోపాల గోపాల’ చిత్రం విడుదలై ఇప్పటికి నాలుగు నెలల పైనే అయ్యింది. మామూలుగా ఎప్పుడూ సినిమా తర్వాత సినిమా చేసే వెంకటేశ్ నుంచి ఈసారి ఎందుకనో కొత్త సినిమా కబుర్లు వినపడటం లేదు. అసలు ఇంతకూ వెంకీ ఏం చేస్తున్నట్టు? తండ్రి రామానాయుడు ఫిబ్రవరిలో చనిపోవడంతో, వెంకీ చాలా రోజులు సినిమా కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. తాజా సమాచారం ఏమిటంటే, ఆ సమయంలోనే రచయిత ఆకుల శివతో రాబోయే సినిమా స్క్రిప్టు డిస్కషన్లో వెంకటేశ్ పాల్గొన్నారట. ఎలాంటి కథ, ఏ నేపథ్యం, ఎటువంటి పాత్ర లాంటి వివరాలు తెలియలేదు. అయితే, ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో కనిపించే వెంకటేశ్, ఈసారి బాగా గడ్డం పెంచుకుని కనిపిస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో తనయుడు అర్జున్ రామ్‌నాథ్‌తో కలిసి ఆ గెటప్‌లోనే సందడి చేశారు. ఈ గెడ్డం గెటప్ అంతా ఆ కొత్త సినిమా కోసమే అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఆకుల శివ స్క్రిప్టుతో జూన్ 6న రామానాయుడు జయంతి సందర్భంగా వెంకీ కొత్త సినిమా మొదల వుతుందనేది ఫిలిమ్‌నగర్ టాక్. దర్శకుడు మారుతినా లేక ఇంకెవరైనా అనేది త్వరలోనే తెలుస్తుంది. -
గంటా పీహెచ్డీ ఎక్కడ చేస్తారో?
విశాఖ : విశాఖ తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య పొసగని విషయం తెలిసిందే. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై జిల్లా టీడీపీ నేత రామానాయుడు సోమవారమిక్కడ విరుచుకుపడ్డారు. పూటకో పార్టీ మార్చే గంటా... అయ్యన్నపాత్రుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. గంటా..తన రాజకీయ లబ్ది కోసం ...'టెన్త్ చంద్రబాబు స్కూల్, ఇంటర్ చిరంజీవి కాలేజ్, డిగ్రీ కిరణ్ కుమార్ రెడ్డి కళాశాలలో గంటా చేరారు. పీజీ కోసం మళ్లీ చంద్రబాబు కాలేజీలో చేరిన ఆయన...మరి పీహెచ్‌డీని ఎక్కడ పూర్తి చేస్తారో' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మంత్రి అయ్యన్నపాత్రుడికి వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, అవకాశవాద, పార్టీ మార్చే రాజకీయాలు ఆయనకు లేవని రామానాయుడు అన్నారు. కాగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాస్‌ల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మాడుగుల నియోజకవర్గంలో మంత్రి అయ్యన్న శుక్రవారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. -
రామానాయుడికి ప్రముఖుల నివాళి
-
చిత్రసీమను వీడిన మరో తార
ఇన్ బాక్స్ రామానాయుడు మృతితో తెలుగు జాతి మరో తేజోపుంజాన్ని కోల్పోయినట్టయింది. ఆ లోటు పూడ్చలేనిది. నేనూ, శ్రీ రామా నాయుడుగారు 13వ లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ తరఫున మొద టిసారి ఎంపీలం. రాజకీయాలకు కొత్త. 1999 నుంచి ఐదేళ్లపాటు పార్లమెంటులో కలసి పనిచేశాం. ఆయన చిత్తశుద్ధి, పట్టుదల, క్రమ శిక్షణ దగ్గర నుంచి చూడగలిగాం. సాధారణంగా వేరే రంగంలో అప్పటికే లబ్దప్రతిష్టులైన వారు చట్టసభల్లోకి వస్తే, మాతృ రంగా నికి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రజాసేవకి ఇవ్వాలనుకోరు. అయితే ఆయన పార్లమెంటరీ విధివిధానాలు తెలుసుకోవడానికి కనపర్చిన ఆసక్తి, తన విస్తృత పరిచయాల ద్వారా నియోజక అభివృద్ధికి అద నపు నిధులు తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు అబ్బురపరిచేవి. ముఖ్యంగా తన నియోజకవర్గం బాపట్లలో క్రీడామైదాన స్టేడి యంలు ఏర్పాటు చేయమంటూ సంబంధిత మంత్రి ఉమాభార తిని కనబడినప్పుడల్లా కోరేవారు. జన్మభూమి తదితర ప్రభుత్వ నిధులతో బాటు తన సొంత ట్రస్ట్ నిధులతో మంచి అభివృద్ధి కార్య క్రమాలు చేశారు. అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి వెం కయ్యనాయుడు గారిని, ఆ శాఖ సలహా సంఘ సభ్యులమైన నేనూ, మరికొంత మంది పార్లమెంటు సభ్యులందర్నీ బాపట్ల నియోజక వర్గ పర్యటనకి తీసుకువెళ్లారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఎంపీలెంత గానో ప్రభావితులయ్యారు. 2002 డిసెంబర్ 13వ తేదీ బాగా గుర్తు. పార్లమెంటు సమావేశం మొదలయీ అవగానే వాయిదా పడింది. పార్లమెంటు భవనంలో పార్టీ కార్యాలయంలో టీ తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నాం. ఆయన నవ్విస్తూ చెప్పే కబుర్లదే అలాంటి సందర్భాల్లో ముఖ్య భూమిక. ఇంతలో బయట బాంబు శబ్దాలు. తీవ్రవాదుల దాడి. ఒక్కసారిగా అంతా సస్పెన్స్ సినిమా సీనుగా మారిపోయింది. మిగతాదంతా చరిత్ర. ఆయన కొలీగ్స్‌తో ఎంతో కలివిడిగా, స్నేహభావంతో ఉండేవారు. నన్ను వైద్యసలహాలు అడిగేవారు. సరదాగా సినిమా స్క్రిప్టులు చద వమని ఇస్తుండేవారు. నేను ఎంపీగా ఉంటూ, వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ప్పుడు, ఎంతో దూరంలో ఉన్న ఆయన వెంటనే ఫోన్ చేశారు. అలా చెయ్యొద్దు అని చెప్పారు. అయితే ఆ పీరియడ్ తర్వాత ఆయనే రాజకీయాలకు దూరమవడం, అలా ఉండాలనుకోవడం విచిత్రం. ఆయన రాజకీయాల్ని కొనసాగించి ఉంటే ప్రజలకు మరిన్ని సేవలందేవేమో? ఎంచుకొన్న రంగమేదైనా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, క్రమశిక్షణతో ఇష్టపడి చెయ్యడం ఆయన నైజం. అందుకే ఆయన లెజెండ్. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. డా॥డి.వి.జి.శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం శ్రీవారి ఆలయంలో హైరానా? దేశంలోనే అత్యంత పెద్ద ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రంగా యావత్ ప్రజల పూజ లందుకుంటున్న దేవదేవుడి సన్నిధిలో, ఎప్పుడూ ఏదో ఒక సమస్యే!వెంకన్న సన్నిధి అపవిత్రం అవుతోందనడానికి నిలువెత్తు సాక్ష్యం నిన్నటి బంగారు వాకిలి ముందు తలుపులు తెరుచుకోకపోవడం.. అదీ ఒక విదేశీ అతిథి ముందు ఇలా జరగడం దురదృష్టకరం. ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. తిరుమల భక్తులకు అందించే సౌకర్యాలు సమాచారం కేవలం కాగితం మీది రాతలకే పరిమితమౌతోంది. అక్కడ ఎంత మంది సిబ్బంది ఉన్నా సామాన్య భక్తులను పట్టించుకునే నాథుడే లేడన్నది అక్షర సత్యం. ఇంక కొండ మీద జరిగే అపచారాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇంక అలిపిరి దగ్గర భద్ర త అంతంత మాత్రమే! ఇది అవకాశంగా తీసుకుని, మద్యం, సిగరెట్లు మాదక ద్రవ్యాలు మొదలైనవి కొండ మీదకు చేరవేయడం శోచనీ యం. ఏదో రకంగా తిరుమల అపవిత్రం అయిపోతోంది. కాబట్టి అధికారులు తిరుమల పవిత్రతపై ఇకనైనా దృష్టి పెట్టాలి. ఎస్. పద్మావతి చిక్కడపల్లి, హైదరాబాద్ -
రామానాయుడి అంతిమయాత్ర!
-
సినీదిగ్గజానికిది.. సెంటిమెంట్ సిటీ
-
ఇక్కడే ఓనమాలు
బాపట్ల : సినీ వినీలాకాశంలో ధ్రువతార దగ్గుబాటి రామానాయుడు. రాజకీయాల్లోనూ ఆయన తనదైన శైలిలో రాణించారు. బాపట్ల ఎనిమి దో ఎంపీగా పనిచేసిన ఐదేళ్లకాలంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పను లు చేశారు. ప్రజోపయోగ కార్యక్రమాల కోసం తన సొంత నిధులను భారీగా ఖర్చు చేశారు. సాయం చేయడంలో ఆయన చేతికి ఎముక లేదని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చెబుతుంటారు. సినిమా రంగంలో అత్యున్నతస్థాయిలో ఉన్న దగ్గుబాటి బాపట్ల నుంచే రాజకీయ ఓనమాలు దిద్దారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడీ శీలంపై 92,457 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ పరిణితి చెందిన రాజకీయ వేత్తగా ప్రజాసేవకే అంకితమయ్యారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన మార్క్ అభివృద్ధి చేశారు. బాపట్ల మండలం అసోదివారిపాలెం పంచాయతీని దత్తత తీసుకుని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. దాదాపుగా పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రయాణికుల సౌకర్యం కోసం బస్ షెల్టర్లు నిర్మించారు. ఇక్కడి రైతులకు కాలువ పనులు, ఇతర పొలం అవసరాలకు జేసీబీలు అవసరమయ్యేవి. వారి కోసం తన సొంత నిధులతో జేసీబీ, పొక్లెయిన్‌ను ఏర్పాటుచేశారు. ఏ రైతుకు వాటితో అవసరం వచ్చినా వాడుకునేలా ఇక్కడే ఉంచారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేశారు. ట్యాంకర్ కొనుగోలు చేసి వాటితో మంచినీటి సరఫరా చేశారు. నియోజకవర్గంలో రక్షిత మంచినీటి పథకానికి ఓవర్‌హెడ్ ట్యాంకులు కట్టించారు. రైతుల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను నిర్మించారు. బాపట్ల పట్టణంలో పార్కుల అభివృద్ధికి కూడా తోడ్పాటునందించారు. ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఎంపీ నిధులతో పనిలేకుండా సొంత నిధులను అధికంగా ఖర్చు చేశారు. వ్యక్తిగతంగా అడిగిన వారికి లేదనకుండా సాయం చేశారు. ఆయన పనిచేసిన ఐదేళ్లలో పార్లమెంటు నియోజకవర్గంలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేయించినట్లు చెబుతున్నారు. 2004లో ఆయన మళ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి చేతిలో ఓటమి చెందారు. అయినా నియోజకవర్గంపై ఆయనకు మమకారం తగ్గలేదు. నియోజకవర్గంలో ఏ పని కోసం ఎవరు వెళ్లినా పనులు చేసి పెట్టారు. పలువురి సంతాపం .. రామానాయుడు మృతికి పలువురు సంతాపం తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి, మాజీమంత్రి పనబాక లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, కౌన్సిలర్ చేజర్ల కోటేశ్వరమ్మ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. కోన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు - ఎమ్మెల్యే రఘుపతి సినీ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడుకు కోన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. రామానాయుడు మృతి బాధాకరమని కోన సంతాపం తెలిపారు. మద్రాసు నుంచి సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకు వచ్చేందుకు తన తండ్రి కోన ప్రభాకర్ ఆర్థిక శాఖ మంత్రిగా రామానాయుడికి తోడ్పాటు అందించారని గుర్తు చేసుకున్నారు. 2003లో పట్టణంలోని టౌన్‌హాలులో కళాక్షేత్రం నిర్మించేందుకు నిధులు కోరిన వెంటనే రూ.10 లక్షలు విడుదల చేశారని కోన తెలిపారు. సినీ పరిశ్రమలోనూ మాటల రచయిత కోన వెంకట్‌తో రామానాయకుడు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. రామానాయుడు చనిపోవడంతో సినీ పరిశ్రమకే విషాదమని అభిప్రాయపడ్డారు. తెనాలిలో ఎన్టీఆర్ అవార్డు ప్రదానం తెనాలి రూరల్: తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో 2012లో నిర్వహించిన 2వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సినీ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడును ఎన్టీఆర్ అవార్డుతో సత్కరించారు. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు తీసిన తన కెరీర్‌కు ఎన్టీఆర్ నటించిన రాముడు-భీముడు చిత్రం ప్రారంభమైతే, కొన్ని ఫ్లాపుల తర్వాత నిలబెట్టింది ప్రేమ్‌నగర్ సినిమాగా ఆయన చెప్పారు. అవార్డు అందుకున్న రోజునే ఆయన ఇక్కడి వైకుంఠపురంలోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. డాక్టర్ రామానాయుడు మరణవార్త తెలుసుకుని తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ సభ్యులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ది లాస్ట్ మొఘల్
జీవన కాలమ్ నిర్మాతగా చలవ బట్టలు వేసుకుని కుర్చీలో పెత్తనం చేసే మనస్తత్వం కాదు నాయుడుగారిది. సెట్టు మీద లైట్బోయిస్తో కలసి ట్రాలీ నడుపుతారు. తోటి సిబ్బందికి ఆ చర్య ఎంత ఊతాన్నిస్తుందో నాకు తెలుసు. భారతీయ సినీ ప్రపంచంలో మరో రామానాయుడు ఉండరు. ఇది చాలా తేలికగా అని పించే మాటగా చాలామందికి కనిపించవచ్చు కాని- ఆ ప్రత్యే కతని ఒక జీవితకాలం కేవలం పరిశ్రమతో, చిత్తశుద్ధితో నిరూ పించుకున్న వ్యక్తి రామానా యుడుగారు. సినీమా రంగానికి ఏ మాత్రమూ సంబంధం లేని రైతు కుటుంబంలో పుట్టి, ఎన్నో వృత్తుల్ని చేపట్టారు. ఒక పక్క చదువుకొంటూ ఆసుపత్రి కాంపౌండర్‌గా పని చేశారు. రైసు మిల్లు నడిపారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేశారు. చుట్ట, పంచె, లాల్చీతో ఆనాడు మద్రాసుకు కేవలం పొగాకు వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చి, సినీ రంగంలో ముమ్మరాన్ని చూసి- ఓ రోజంతా ఆం ధ్రా క్లబ్బు చెట్టుకింద కూర్చుని ఆ వాతావరణాన్ని పరి కించి, అవగాహన చేసుకుని రంగంలోకి దిగి- సినీరం గంతో ఏ మాత్రం సంబంధం ఉన్న వ్యక్తయినా మరిచి పోలేని శిఖరాలను అధిరోహించిన వ్యక్తి నాయుడుగారు. చదువుతో సంబంధం లేని ఇన్స్టింక్ట్ ఆయన పెట్టుబడి. నేలబారు వ్యక్తి ఆర్తి ఆయన మూలధనం. దేశంలో 13 భాషలలో వందల చిత్రాల్ని నిర్మించారు. నాగిరెడ్డి గారి తో కలసి చిత్రాలు తీశారు. విజయం ఆయన ఊతప దం. ఆయన ఓసారి నాతో అన్నారు - ఏనాటికయినా స్టూడియోని నిర్మించాలని. ఒకటికాదు, రెండు స్టూడి యోలు నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌లో ఎన్నో సినీమాలు నటించాను. కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం అన్నింటిలో వ్యక్తిగతమయిన ప్రమేయం పెట్టుకుని-తను చేసేదేదో ఎరిగి చేసిన నిర్మా త-రామానాయుడుగారు. నటుల ఆహార్యం, పాత్రీక రణ - అన్నింటినీ తన ధోరణిలో ఆపో శన పట్టేవారు. ‘మాంగల్యబలం’లో నేను చేసిన ‘బూతుల బసవయ్య’ పాత్ర ఆయనకి అత్యంత ప్రియమైనది. కార ణం- ఆ పాత్ర ఆయనకి తెలుసు. నా దగ్గర కూచుని ఆ పాత్రను నా కళ్లకు కట్టా రు. కారంచేడులో వారి చెల్లెలుగారింట్లో ఉండి ‘శ్రీకట్నలీలలు’ సినీమా చేశాను. ఇన్ని కమర్షియల్ సినీమాలు నిర్మించినా ఆయనకు ఆర్ట్ ఫిలిం తీయాలని సరదా. నా ‘కళ్లు’ కథని బాలచందర్ నిర్మిస్తున్నా రని తెలిసి నన్ను పిలిచి ఆ కథ హక్కులు తీసుకున్నారు. విచిత్రమేమిటంటే ఎన్నో చిత్రాలలో నటించారు. ఆ మధ్య గోవా చలన చిత్రోత్సవంలో నన్ను చూసి, ‘‘ఈ మధ్య నా సినీమాలు ఏం చూసినా నువ్వు కనిపిస్తున్నావయ్యా!’’ అన్నారు. చాలామందికి తెలియని విషయం- నిర్మాతగా చలవ బట్టలు వేసుకుని కుర్చీలో పెత్తనం చేసే మనస్త త్వం కాదు నాయుడుగారిది. సెట్టు మీద లైట్బోయి స్తో కలసి ట్రాలీ నడుపుతారు. తోటి సిబ్బందికి ఆ చర్య ఎంత ఊతాన్నిస్తుందో నాకు తెలుసు. మేము తేలికగా 40 సంవత్సరాలు ఇరుగు పొరుగు ఇళ్లలో మద్రాసులో జీవించాం. కుటుంబాలతో ఆత్మీయ మైన పరిచయం. ఈ మధ్య ఏదో పని మీద ఒక ఉపకా రం కోసం ఆయనకి ఫోన్ చేశాను. ఆ పని పూర్తి చేసి మర్నాడు రోజంతా నా కోసం ఫోన్ చేస్తున్నారు. స్నేహా నికీ, ఆత్మీయతకూ ఆయన ఇచ్చే ప్రాధాన్యం అది. ఏ షూటింగ్‌లోనో గుర్తులేదు కాని ఓ రోజు ఆల స్యంగా సెట్టు మీదకి వచ్చి ‘‘మా సురేష్ కొడుక్కి నా పేరు పెట్టాడయ్యా!’’ అనడం గుర్తుంది. మనవడిని పరి శ్రమ మళ్లీ ‘రామానాయుడు’ అనలేక ‘రానా’ అంది. రానాతో ‘లీడర్’ చేస్తూ ఈ మాటని గుర్తు చేశాను. సినీ రంగంలో మూడు తరాల వ్యక్తులతో పనిచేసిన అదృష్టం నాది. నాయుడుగారు, వెంకటేష్, రానా. అలాగే కె. ఎస్. ప్రకాశరావుగారు, రాఘవేంద్రరావు, ఇప్పుడు ప్రకాష్. ఒక కళని సంప్రదాయం చేసుకున్న కుటుంబాలివి. తన వైభవాన్నీ, సంపదనీ తన కుటుంబానికే పరి మితం చేసుకోకుండా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక అభివృద్ధికి డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి కేంద్రాన్ని స్థాపించి, మెదక్‌లో ఉదారంగా 33 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. కారంచే డులో, పరిసర ప్రాంతాల్లో ఎన్నో కల్యా ణ మండపాలను నిర్మించారు. సామా జిక చైతన్యానికి అద్దం పట్టే చిత్రం ‘హోప్’ (ఆశ)లో ప్రముఖ పాత్ర ధరిం చారు. కేవలం సామాజిక ప్రయోజనం కారణంగానే ఆ చిత్రానికి జాతీయ బహు మతి లభించింది. అభిరుచికీ, సాటి మనిషి అభ్యుదయానికీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే రామానాయుడుగారు సినీ నిర్మాణంలో గిన్నిస్‌బుక్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన ఒకే ఒక్క నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత. పద్మభూషణ్. ఆయన్ని బాగా, ఆత్మీయంగా తెలిసిన వారికి నాయుడుగారు జీవితాన్ని జీవనయోగ్యం చేసుకున్న మొఘల్. బాగా లోతుకు వెళ్లి చూస్తే మూలాలను మరచి పోని మనిషి. పెదవుల మీద ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే రామానాయుడు గారి జీవితం ఒక సందేశం. మృత్యువు ఒక క్రూరమైన ముగింపు. స్వయంకృషితో తన లక్ష్యాలే పెట్టుబడిగా మానవతా విలువలని రాజీ పరచకుండా విజయానికి మన్నికైన అర్థాన్ని కల్పించిన- మరొక్కసారి- మూవీ మొఘల్ రామానాయుడు. ఎవరో రచయిత అన్నాడు: జీవితం ఒక ఆక్సిడెంట్. ఎక్కువమంది ఆ ప్రయాణంలో గాయపడుతుంటారు- అని. కానీ జీవితంలో ఎందరి ఆక్సిడెంట్లకో మన్నికైన ప్రత్యామ్నాయాన్ని కల్పించిన వ్యక్తి నాయుడుగారు. ఆయన కన్నీరు-నాకు తెలిసి ఎరుగరు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా-ఆయన కారణంగా కన్నీరు ఎరుగరు. -
సినీదిగ్గజానికిది.. సెంటిమెంట్ సిటీ
నగరంతో రామానాయుడుకు విడదీయరాని అనుబంధం ప్రతి సినిమా బాక్స్‌కు దుర్గమ్మ సన్నిధిలో, దాసాంజనేయ ఆలయంలో పూజలు కోలవెన్ను వినాయకుడిపైనా మక్కువ ఎక్కువే.. అక్కడే సోగ్గాడు షూటింగ్ విజయవాడ కల్చరల్/ కంకిపాడు/ భవానీపురం : తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. జిల్లాతో విడదీయలేని అనుబంధం గల ఒక దిగ్గజం దివికేగింది. ప్రతి అపజాయాన్ని విజయానికి మెట్లుగా మార్చుకుని సినీప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన మూవీ మొఘల్.. ఇటీవల కాలం వరకు తన ప్రతి చిత్రం విడుదలకు ముందు మెట్లమార్గంలో నడిచి వెళ్లి దుర్గమ్మను దర్శించుకునేవారు. సినిమా బాక్స్‌లను కూడా ఆయన మోసుకెళ్లి అమ్మవారి చెంత ఉంచి పూజలుచేయించేవారు. మాచవరంలోని దాసాంజనేయ స్వామి ఆలయంపైనా దగ్గుబాటి రామానాయుడుకు అచంచల విశ్వాసం. తాను నిర్మించిన సినిమా బాక్సులకు మాచవరంలోని దాసాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేయిస్తే విజయం లభిస్తుందని నమ్మేవారు. నగరంలోని మమత హోటల్ కూడా ఆయన బాగా సెంటిమెంట్. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువసార్లు ఆ హోటల్లోని ఒకే గదిలో ఉండేవారు. నగరంలో ఉన్న తన బంధువులైన విజయ ఫిలిమ్స్ అధినేతలు సురేటి వెంకటరత్నం, రాజేంద్రప్రసాద్‌ల నివాసానికి కూడా వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. మరో బంధువు సురేటి శాంతాదేవి నివాసానికి కూడా పలుమార్లు వచ్చారు.నగరంలోని పలువురు ప్రముఖులు ఆయనతో సన్నిహితంగా మెలిగేవారు. సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో రామానాయుడు చిత్ర పటం వద్ద ఉద్యోగులు, అభిమానులు ఘన నివాళి అర్పించారు. కామినేనితో బంధుత్వం : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు రామానాయుడుకు మధ్య దగ్గర బంధుత్వం ఉంది. రామానాయుడు చిన్న కుమారుడు, సినీ హీరో వెంకటేష్‌కు కామినేని అక్క ఉషారాణి చిన్న కుమార్తె నీరజను ఇచ్చి వివాహం చేశారు. ఆయన అనేకసార్లు కామినేని స్వగ్రామమైన కైకలూరు మండలం వరహాపట్నం గ్రామానికి వచ్చారు. కోలవెన్నుతో ప్రత్యేక అనుబంధం డాక్టర్ రామానాయుడుకు కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉంది. శోభన్‌బాబు నటించిన ‘సోగ్గాడు’, జితేంద్ర, రేఖ నటించిన దిల్దార్ చిత్రాలను రామానాయుడు ఈ గ్రామంలో చిత్రీకరించారు. గ్రామానికి చెందిన వెంకటరత్నం నివాసంలో నెల రోజులపాటు ఉండి 1975లో సోగ్గాడు చిత్రాన్ని నిర్మించారు. వెంకటరత్నానికి చెందిన ఎడ్ల జతను సోగ్గాడు చిత్రంలో ఎంతో అందంగా చూపి సినిమాలో ఎడ్లకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. గ్రామంలో వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయకుడి విగ్రహంపై పాటను చిత్రీకరించారు. ఆ సినిమా విజయం సాధించడంతో అప్పటి నుంచి ప్రతి సినిమా టైటిల్స్‌లోనూ ఈ వినాయకుడి విగ్రహాన్ని సెంటిమెంట్‌గా చూపిస్తున్నారు. రామానాయుడు మరణవార్త కోలవెన్ను వాసులను కలచివేసింది. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని పలువురు సంతాపం తెలిపారు. సినీ నిర్మాత, పీఏసీఎస్ అధ్యక్షుడు అడుసుమిల్లి వెంకటేశ్వరరావు (పసిబాబు), నకిరికంటి శేఖర్ సంతాపం తెలిపినవారిలో ఉన్నారు. విలువలకు ప్రాధాన్యత ఇస్తారు రామానాయుడు నాతో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. నగరానికి వచ్చిన ప్రతిసారి నా కోసం వాకబు చేసేవారు. నగరంలో గానీ, చుట్టుపక్కల గానీ సినిమా సభలు నిర్వహిం చినప్పుడు నన్నే అధ్యక్షత వహించాలని కోరేవారు. చీరాలలో 1971లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ సభకు నేనే అధ్యక్షత వహించాను. ఆయనలేని తెలుగు సినిమాను ఊహించలేం. కుటుంబ బంధాలు, విలువలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. - తుర్లపాటి కుటుంబరావు, సీనియర్ పాత్రికేయులు కన్నతండ్రిలా ఆదుకొనేవారు నేను 1987లో సురేష్ ఫిలిమ్స్‌లో చేరాను. అప్పటి నుంచి రామానాయుడు నిర్మించిన అన్ని సినిమాలను పంపిణీ చేశాం. విజ యవాడ వచ్చిన ప్రతిసారి తప్పక ఆఫీస్‌కు వచ్చేవారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించేవారు. కన్నతండ్రిలా ఆదుకొనేవారు. - శ్రీరామ్, సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ సున్నిత మనస్కుడు రామానాయుడితో మా అనుబంధం 1953 నుంచి సాగుతోంది. ఆయనది చాలా సున్నితమైన మనసు. చాలా కష్టపడి పైకి వచ్చారు. దేవుడిని విపరీతంగా నమ్మేవారు. తాను నిర్మించిన సినిమా మొదటికాపీని విజయవాడ కనకదుర్గమ్మ, మాచవరం ఆంజనేయస్వామి ఆలయాలకు తీసుకెళ్లి ఆశీస్సులు కోరేవారు. విజయవాడ వచ్చినప్పుడల్లా హోటల్ మమతాలోని ఒకే గదిలో దిగేవారు. ఆయనకు సెంటిమెంట్ ఎక్కువ. - సురేటి వెంకటరత్నం బంధుప్రీతి ఎక్కువ మాది కూడా ప్రకాశం జిల్లా కారంచేడే. రామానాయుడికి బంధు ప్రీతి ఎక్కువ. నా వివాహం కూడా ఆయనే చేయించారు. విజయవాడ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చేవారు. గత వారమే ఆయన్ని చూడటానికి హైదరాబాదు వెళ్లా. ఇంతలో ఇలా జరిగింది. - సురేటి శాంతాదేవి ఇలా జరుగుతుందనుకోలేదు కోలవెన్ను గ్రామంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. చిట్టచివరి రోజుల్లో నన్ను పిలిపించారు. గ్రామానికి ఎంతో కొంత అభివృద్ధి పనుల్లో సాయపడదామనుకుంటున్నానని చెప్పారు. ఇంతలోనే ఇలా జరిగింది. ఆయన కుమారులైనా గ్రామంపై ఉన్న ఆపేక్షతో అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నా. - తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), సర్పంచ్, కోలవెన్ను 40 ఏళ్ల పరిచయం మాది నాకు రామానాయుడుతో 40 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన గతంలో నగరానికి వచ్చినప్పుడల్లా మమ్మల్ని కలిసే వారు. గతంలో మాకు లీలామహల్ సినిమా హాల్ ఉండేది. ఆయన అక్కడకు వచ్చి మావాళ్లతో మాట్లాడేవారు. ఎక్కువ చర్చలు సినిమాల గురించే ఉండేవి. ఆయనతో మాకు బంధుత్వం కూడా ఉంది. దీంతో రాకపోకలు ఎక్కువగా ఉండేవి. మేము హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా ఫిలిం ఛాంబర్లో ఆయన్ను కలిసేవాళ్లం. సినిమా రంగంలో ఆయన నిజంగానే రాజు. ఒక్క సినిమా రంగంలోనే నాలుగు విభాగాల్లో అత్యద్భుతంగా రాణించిన అరుదైన వ్యక్తి ఆయన. రామానాయుడుకు ఒంగోలులో ఒక థియేటర్ ఉండేది. దానిలో ఇంగ్లిష్ సినిమా ఆడించాలన్నది ఆయన అభిమతం. దానికి సంబంధించి సినిమాల లిస్ట్‌లు, ఇతర కార్యక్రమాలు నన్ను చూడాలని కోరారు. - భూపాల్ ప్రసాద్, నవరంగ్ థియేటర్ అధినేత -
‘సురేష్’ ప్రొడక్షన్ బ్యానర్లో సుద్దాల రాజమౌళి
పోచమ్మమైదాన్ : సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రామానాయుడు నిర్మించిన ‘ఆంధ్ర వైభవం’ సినిమాకు కోడెరైక్టర్‌గా వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ సుద్దాల రాజమౌళి వ్యవహరిం చారు. కాగా, సినిమాలో శాతవాహన కాలం నుంచి ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు జరిగిన పరిణామాలను చూపించారు. ఆ సినిమాలో రామనాయుడు శ్రీ కృష్ణ దేవరాయులుగా నటించడం గమనార్హం. ఈ సందర్భంగా రాజమౌళి విలేకరులతో మాట్లాడుతూ రామానాయుడి మృతి సినిమా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. కాగా, రాజమౌళి హైదారాబాద్‌లో రామానాయుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పలువురి నివాళి.. పోచమ్మమైదాన్ జంక్షన్లో బాలాజీ ఆర్ట్స్ క్రియేషన్ అధినేత ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో రామానాయుడికి బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ పలు భాషల్లో సినిమాలు రూపొందించి నిర్మాతగా గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించిన రామానాయుడి మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. తెలంగాణ డెరైక్టర్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి యాసారపు అజయ్‌కుమార్ మా ట్లాడుతూ నూతన దర్శకులను పరిచయం చేసిన ఘనత రామానాయుడుకే దక్కుతుందన్నారు. దేశాయిపేట వర్తక సంఘం కోశాధికారి సిరుపా మదన్‌కుమార్, కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి, బొమ్మన రవి, వెంకటేశ్వర్లు, యోహాన్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. -
సెంటిమెంట్ల చిన్నయ్య
వెండితెర మీదే కాదు... వ్యక్తిగతంగానూ రామానాయుడికి సెంటిమెంట్ ఎక్కువ. అవతలి వారి కష్టాన్ని తన కష్టంగా తీసుకొనే భావోద్వేగ తత్త్వం మొదలు ఏదైనా పని చేసేటప్పుడు ముహూర్తాల కోసం వేచి చూసే నమ్మకాల దాకా అన్నీ ఉన్న పాత తరం పల్లెటూరి పెద్దమనిషి తనం ఆయనది. రామానాయుడి చిత్రమైన అలవాట్లు, నమ్మకాలలో కొన్ని... రామానాయుడు చాలా సెన్సిటివ్. కృత్రిమమైన ప్రవర్తనలు ఎక్కువగా కనిపించే ఈ గ్లామర్ ప్రపంచంలో ఇన్ని దశాబ్దాలుగా ఉంటున్నా, ఆయన గుండెలోని తడి ఇంకిపోలేదు. మనసును బాధించే విషయాలు విన్నా, సంఘటనలు చూసినా ఆయన తట్టుకోలేరు. అప్రయత్నంగానే ఆయనకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. రామానాయుడికి సెంటిమెంట్లు ఎక్కువ. నిర్మాతగా మద్రాసులో తొలిరోజులు గడిపిన రామానాయుడికి రాహుకాలాలు, వారాలు, వర్జ్యాల పట్టింపులున్నాయి. రాహుకాలంలో ఆయన కథలు వినరు. కీలకమైన నిర్ణయాలు తీసుకోరు. అలాగే, మంగళవారాలు ప్రయాణం చేయకపోవడమనేది ఆయనకున్న మరో నమ్మకం. అందుకే, ఏ పని చెయ్యాలన్నా పండితులతో మంచి ముహూర్తం నిర్ణయించుకుంటారు. అలాగని, గాలిలో దీపం పెట్టి, దేవుడా... అంతా నీదే భారమనే తరహా వ్యక్తి కాదాయన. మంచి ముహూర్తంలో పని ప్రారంభించడం వరకే కానీ, ఆ తరువాత కూడా చేసే పని నిజాయతీగా, నిబద్ధతతో చేస్తారు. రామానాయుడికి దైవభక్తి ఎక్కువ. ఆయన ఇంటి ఆరాధ్యదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి. వెంకన్నంటే ఆయనకు అపారమైన గురి. అందుకే, నిర్మాతగా తాను తీసిన ఏ సినిమా అయినా సరే విడుదల కన్నా ముందే రీలు పెట్టెలు తీసుకువెళ్ళి, తిరుమల వెంకన్న దగ్గర పూజలు చేయించడం రామానాయుడి అలవాటు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బలంగా ఉన్న 1960ల నాటి నుంచి రిలీజ్ రోజున విజయవాడకు వచ్చి, జనం మధ్య కూర్చొని సినిమా చూడడం, ప్రేక్షకుల నాడి గమనించడం ఆయన చాలా కాలం కొనసాగించిన సెంటిమెంట్. అలాగే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రామానాయుడు స్టూడియోస్ కట్టాక, స్టూడియో ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండగానే మొదట్లోనే ఎత్తై గుట్ట మీద దేవుడి గుడి కట్టించారాయన. రోజూ ఉదయం స్టూడియోకు వస్తూనే, ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం చేసుకొన్న తరువాతనే ఆఫీసులోకి అడుగుపెట్టడం ఆయన నిత్యకృత్యం. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలోనూ స్టూడియో కట్టాక, రోజూ సాయంత్రం వేళ అక్కడకు కారులో వెళ్ళడం, కాసేపు కాలక్షేపం చేసి, అక్కడ ఖాళీ జాగాలో పండించిన కూరగాయలు వగైరా చూసి రావడం ఆయనకు అలవాటు. అలాగే, ‘నాయుడి గారి హస్తవాసి చాలా మంచిది’ అని సినీ పరిశ్రమలో ఒక నమ్మకం. అలాగే, దర్శకుడు దాసరిది కూడా! అందుకే, ఆయన చేతుల మీదుగా డబ్బు తీసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన తన వద్దకు వచ్చి, శుభాకాంక్షలు చెప్పే సినీ టెక్నీషియన్లు ప్రతి ఒక్కరికీ వంద రూపాయల నోటు ఇవ్వడం రామానాయుడు అలవాటు. ఆయన చేతి మీదుగా ఏడాది తొలిరోజు డబ్బు తీసుకుంటే, ఆ ఏడాది పొడుగూతా ప్రతి రోజూ సంపాదన ఉంటుందని చాలామంది నమ్మకం. రామానాయుడు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ 2015 జనవరి 1న కూడా ఆ నమ్మకం, అలవాటు అలాగే కొనసాగింది. రెండు గంటల పాటు స్టూడియోకు వచ్చి కూర్చున్న రామానాయుడు ఆ ఆనవాయితీని కొనసాగించారు. - రెంటాల జయదేవ -
పోస్టర్ మీద ఆయనకున్నంత ఆసక్తి, అభిలాష
మరి ఏ ఇతర నిర్మాతలోనూ కనిపించవు! ‘రాముడు భీముడు’ అఖండ విజయం తర్వాత విజయాధినేతలైన ‘నాగిరెడ్డి-చక్రపాణి’గార్లు రామానాయుడు గార్ని సంప్రదించి ఇతర భాషల్లో పునర్నిర్మాణానికి హక్కులు తీసుకున్నారు. ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతో 1967లో ‘విజయ సురేష్’ అనే ఉమ్మడి సంస్థను స్థాపించి ‘పాప కోసం’ సినిమా తీశారు. ఆ నిర్మాణ సమయంలోనే నాగిరెడ్డిగారి కుమారులైన ప్రసాద్, వేణుగోపాల్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, బాబ్జి గార్లతో నాయుడిగారికి సన్నిహిత సంబంధం ఏర్పడ్డం, అప్పటికే నేను విజయా సంస్థకు పోస్టర్లు చేస్తున్నందున నన్ను నాయుడుగార్కి పరిచయం చేసి ‘పాప కోసం’ చిత్రానికి కూడా పోస్టర్లు చేసే అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం నన్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది. ‘ప్రేమనగర్’తో అది సుస్థిరమైంది. సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మించిన సుమారు అన్ని చిత్రాల హీరోలకు నేను ‘విగ్’ స్కెచ్ వేసి ఇచ్చాను. ‘ప్రేమనగర్’లో ఏఎన్నార్‌తో ప్రారంభం అయ్యి, సెక్రటరీ, సోగ్గాడు, చిలిపి కృష్ణుడు, ప్రేమ మందిరం, వసంత మాళిగై, ముందడుగు, సావాసగాళ్లు మొదలగు అనేక చిత్రాల హీరోలకు నాయుడుగారు నా చేత స్కెచ్‌లు వేయిస్తేనే గాని మేకప్ చెయ్యనిచ్చేవారు కాదు. ‘ప్రేమనగర్’ హిందీ చిత్రంలో రాజేష్ ఖన్నాకు, ‘దిల్దార్’లో జితేంద్రకు ఇంకా అనేక హిందీ, తమిళ హీరోలకు హెయిర్ స్టైల్ ‘విగ్’ స్కెచ్‌లు నేను వేసి ఇచ్చినవే. నిజానికి ఈ పని కళాదర్శకుల పరిధిలోఉన్నా నా చేతనే వేయించేవారు. నాకున్న సుదీర్ఘ అనుభవంతో చూస్తే పోస్టర్ మీద ఆయనకున్నంత ఆసక్తి, ఆభిలాష, ఏకాగ్రత మరే ఇతర నిర్మాతలోనూ కనిపించదు. ఆయన ఊపిరి సినిమా, ఆయన శ్వాస సినిమా, ఆయన ధ్యాస సినిమా. ప్రేక్షకుణ్ణి మొదటిగా ఆకర్షించేది పోస్టరేనని నమ్మిన వ్యక్తి. నేను ఏదైనా ప్రొడక్షన్ ఆఫీసులో ఆయన్ను చూడ్డం జరిగితే... ‘‘ఎక్కడ చూసినా నువ్వే కనపడతావేమిటయ్యా?.. నువ్వు తప్ప ఈ మద్రాసులో ఇంకో ఆర్టిస్టే లేడా?’’ అని నవ్వుతూ అనేవారు. నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన ఆయన హస్తవాసి అలాంటిది. ‘పాప కోసం’తో ప్రారంభించి పరిశ్రమ హైదరాబాద్ తరలి వెళ్లే వరకు ఆయన నిర్మించిన చిత్రాల్లో 72 చిత్రాలకు డిజైన్లు చేసే అవకాశం నాకు నాయుడుగారిచ్చారు. పబ్లిసిటీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఆయన ప్రతి చిత్రానికి పని ప్రారంభించే ముందు నాకు ప్రొజెక్షన్ వేసి చూపిస్తూ నా పక్కనే కూర్చునేవారు. నా ఫీలింగ్స్‌ను పరిశీలిస్తుండేవారు. ఒకసారి ‘ప్రేమనగర్’ రష్ చూస్తున్నప్పుడు నేను సినిమాలో లీనమైపోయాను. ఎందుకో మధ్యలో రాజబాబు, రమాప్రభ, కె.వి. చలం కామెడీ అడ్డుపడ్డట్టు అనిపించి రష్ చూసి బయటకొస్తున్నప్పుడు ‘‘నాయుడుగారూ... మధ్యలో ఆ కామెడి అక్కడక్కడ అడ్డుపడుతున్నట్టు కనిపిస్తుందండీ’’ అని అన్నాను. దానికాయన ‘‘అమ్మమ్మ... అలాక్కాదు లేవయ్యా... కొంచెం మసాలా ఉండాలి’’ అన్నారు. ఆయనలో ఉన్న అపారమైన అనుభవ లోతులు అప్పుడే నాకు కనిపించాయి. రిలీజ్ అయ్యాక చూస్తే నిజంగా ఆ కామెడీయే ఆ సినిమాకి ‘రిలీఫ్’ అని పత్రికల్లో రివ్యూలు ఇచ్చాయి. జెమిని, ఏవీయం, విజయా సంస్థల గత వైభవం స్ఫురణకు తెచ్చి ఆ అగ్ర సంస్థల స్థానాన్ని అంది పుచ్చుకుని చివరివరకూ ఎదురులేని నిర్మాతగా, స్టూడియో అధినేతగా ప్రకాశించారు. ఆ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు. - ఈశ్వర్, సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ -
నవలా చిత్రాలకు మధుమాసం
కొన్నేళ్ల క్రితం... నేను జర్నలిస్టుగా పని చేస్తున్న రోజుల్లో... రామానాయుడుగారిని కలవడానికి, ఆయన స్టూడియోకి వెళ్లాను. మా సంభాషణ ముగిసిన తర్వాత నాయుడుగారు బయల్దేరుతుంటే - ఓ రచయిత ఆయన దగ్గరకొచ్చి, తను రాసిన నవల ఇచ్చాడు. ‘చదివి చెబుతా’ అన్నారు రామానాయుడుగారు. ఆ రచయిత వెళ్లిన తర్వాత నేను నాయుడుగారిని అడిగాను. ‘‘సార్, నిజంగానే చదువుతారా?’’ అని. ఆయన నవ్వి, ‘‘నా పనే అది. తప్పకుండా చదువుతా. నచ్చితే సినిమాగా కూడా తీస్తా. సినిమాకి అసలు పెట్టుబడి డబ్బులే కాదు, కథ. రూపాయి (ఆయన దృష్టిలో రూపాయి అంటే కోటి) పెట్టాలన్నా, రూపాయి రావాలన్నా - కథ బాగుండాలి. లేకపోతే ఏమీ చెయ్యలేం’’ అంటూ ఆయనొక సూత్రం చెప్పారు. కథలు మన దగ్గరికి రావు. మనం వెదుక్కుంటూ వెళ్లాలి. వినాలి, చదవాలి. ఒకటికి రెండుసార్లు వడపోతే పోస్తేగాని, ఓ నిర్ణయానికి రాకూడదు. వచ్చిన తర్వాత, నమ్మిన తర్వాత అందులో అక్షరమ్ముక్క కూడా మార్చకూడదు. ఇదే ఫార్ములా ఆయన జీవితాంతం ఫాలో అయ్యారు. అర్ధ శతాబ్దంలో పలు భాషల్లో ఆయన తీసిన సినిమాల్లో చారిత్రక విజయాలున్నాయి, పరాజయాలున్నాయి. కథని, అందులోని ఎమోషన్స్‌ని ఆయన ఏనాడూ విస్మరించలేదు. అందుకే కేవలం ఓ నిర్మాతగానే మిగిలిపోకుండా, తన జీవితాన్ని, కుటుంబాన్ని నమ్మదగ్గ ఓ బ్రాండ్‌నేమ్‌గా భారతీయ సినిమాలో నిలబెట్టారు. ఆయన రూపొందించిన వాటిల్లో 10 నవలా చిత్రాలు. 1. ప్రేమనగర్ (1971) ఇండస్ట్రీలో ఉండగలగడమా... కారంచేడు వెళ్లిపోవడమా అన్నంత సందిగ్ధ పరిస్థితుల్లో, అక్కినేని నాగేశ్వరరావుగారి సతీమణి అన్నపూర్ణగారు తను చదివిన ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి నవల గురించి చెప్పారు. అప్పటికి ఒకరిద్దరు నిర్మాతలు ఆ నవలను సినిమాగా తీద్దామనుకుని, ఏవో కారణాల వల్ల వెనకడుగేశారు. రామానాయుడు నవల చదివారు. మరో ఆలోచన లేకుండా సినిమా తీద్దామని నిర్ణయానికొచ్చారు. దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, రచయిత ఆచార్య ఆత్రేయగారితో కూర్చుని - నవలను సినిమాకి అనుగుణంగా మలుచుకున్నారు. నవలకి భిన్నంగా క్లయిమాక్స్ డ్రమటైజ్ చేశారు. ఖర్చు చూస్తే, భారీగా కనబడుతోంది. తేడా వస్తే - పరిస్థితి అగమ్యగోచరం! ‘ప్రేమనగర్’ తాజ్‌మహల్ (సమాధి) అయిపోవచ్చు. భారీ వర్షాల్లో భయపడకుండా సినిమా రిలీజ్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో కమర్షియల్ క్లాసిక్‌గా నిలిచిపోయింది ‘ప్రేమనగర్’. ఈ కథతోనే ఆయన తమిళంలోకి (‘వసంతమాళిగై’ - శివాజీ గణేశన్, వాణిశ్రీ), హిందీలోకి (‘ప్రేమ్‌నగర్’ - రాజేష్‌ఖన్నా, హేమమాలిని) అడుగుపెట్టారు. 2. జీవన తరంగాలు (1973) రైటర్స్‌కి కమర్షియల్ క్రేజ్ తీసుకొచ్చిన రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణిగారు. ఓ వారపత్రికలో ‘జీవన తరంగాలు’ సీరియల్‌గా వస్తుండేది. పాఠకులు వచ్చేవారం వరకూ ఆగలేకపోతుండేవారు. అందువల్ల ఆ సీరియల్ పేజీలు (ఫారమ్) ప్రింట్ కాగానే మార్కెట్లోకి వస్తుండేవి. వాటిని వేడివేడి పచ్చి మిరపకాయ బజ్జీల్లా పాఠకులు ఎగబడి, ఆ కాసిన్ని పేజీలు పావలాకి కొనుక్కుని, చదువుతుండేవారు. ఓ సీరియల్ నవలకు అవసరమైనన్ని ఆసక్తికరమైన మలుపులు, పాత్రలతో ఈ కథ సాగుతుంది. అప్పటికది మల్టీస్టారర్. శోభన్‌బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, వాణిశ్రీ, లక్ష్మి. తమ్ముడి కోసం బలవంతంగా తాళి కట్టిన హీరో - తమ్ముడి కోసం ఎంతో వేదన అనుభవించిన హీరోయిన్ - రసవత్తరమైన డ్రామా. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జీవన తరంగాలు’ను హిందీలో ‘దిల్ అవుర్ దీవార్’, తమిళంలో ‘తిరుమాంగల్యం’ (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి మొదటి సినిమా), కన్నడంలో మాలాశ్రీతో ‘తవరమనె ఉడగురె (1991)’ పేరుతో రీమేక్ చేశారు. అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. కన్నడంలో ఈ సినిమా చూసిన దర్శకుడు ప్రేమ్, ఓ పాటలో (తెలుగులో ‘ఈ జీవన తరంగాలలో’ పాట) తెలియకుండానే తల్లి పాడె మోసే కొడుకు క్యారెక్టర్ చూసి, ఆ స్ఫూర్తితో ‘జోగి’ అనే కథ రాసుకుని, సినిమా తీశాడు. సెన్సేషనల్ హిట్. (తెలుగులో ప్రభాస్‌తో ‘యోగి’ పేరుతో వచ్చింది). హిందీలో ‘దిల్ అవుర్ దీవార్’ స్ఫూర్తితో టీవీ సీరియల్ వచ్చింది. తెలుగులో కూడా మొన్నమొన్నటి దాకా ప్రసారమైంది. మరో విశేషం - హీరో కృష్ణంరాజు ఇదే నవలను ‘జీవన తరంగాలు’ అనే టీవీ సీరియల్‌గా నిర్మించారు. 3. చక్రవాకం (1974) ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి రాసిన మరో నవల ‘చక్రవాకం’. నవలగా పాఠకుల ఆదరణ పొందినా, విషాదాంతం కావడంతో సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అంతవరకూ చిన్న చిన్ని పాత్రలు చేసిన రామానాయుడుగారు ‘చక్రవాకం’లో శోభన్‌బాబు అన్నగా ఓ కీలకమైన పాత్ర పోషించారు. పాటలు ఇప్పటికీ హిట్టే. 4. సెక్రటరీ (1976) యద్ధనపూడి సులోచనారాణిగారి మొదటి పాపులర్ నవల ‘సెక్రటరీ’. ఆరడుగుల అందగాడు. ‘ఆత్మవిశ్వాసం’ ఓ పాలు ఎక్కువైన హీరోయిన్, పొడవాటి కారు - పెద్ద పెద్ద బంగళాలు. ఓ రొమాంటిక్ నవలకు పెద్ద బాలశిక్ష ‘సెక్రటరీ’ నవల. ‘జ్యోతి’ మాసపత్రికలో సీరియల్‌గా వచ్చిన ఈ నవల సినిమా తీస్తున్నారంటే - ప్రేక్షకుల్లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా అక్కినేని - వాణిశ్రీ, కె.ఎస్. ప్రకాశరావుగారు, ఆత్రేయగారు, కె.వి. మహదేవన్, అన్నింటికి మించి రామానాయుడుగారు. ఆ రోజుల్లో సోషల్ పిక్చర్స్‌కి అడ్వాన్స్ బుకింగ్ జరిగిన వాటిల్లో ‘సెక్రటరీ’ది మంచి రికార్డ్. సినిమా టైటిల్స్‌లో ఆర్టిస్టుల పేర్ల బదులు, పాత్రల పేర్లే (రాజశేఖరం, జయంతి..) వేశారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదే! 5. ఒక చల్లని రాత్రి (1979) డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన నవల ఆధారంగా కె. వాసు దర్శకత్వంలో చంద్రమోహన్, మాధవి జంటగా ‘ఒక చల్లని రాత్రి’ సినిమా నిర్మించారు. భార్యను అనుమానించే ఓ భర్త కథతో తీసిన ఈ సినిమా హిట్ కాలేదు. 6. అగ్నిపూలు (1981) సీరియల్ నవలలు రాజ్యమేలుతున్న రోజుల్లో యద్ధనపూడి సులోచనారాణి రాసిన డెరైక్ట్ నవల ‘అగ్నిపూలు’. కృష్ణంరాజు ద్విపాత్రాభినయంతో జయప్రద, జయసుధ లాంటి భారీ తారాగణంతో కె. బాపయ్య దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. అయితే అనుకున్నంత విజయం సాధించలేదు. జయప్రద చేసిన స్నేక్‌డాన్స్ పాపులరైంది. 7. అహ నా పెళ్ళంట (1987) రచయిత ఆదివిష్ణు ‘పల్లకి’ వార పత్రికలో రాసిన ‘సత్యంగారిల్లు’ నవల ఆధారంగా తీశారీ సినిమా. ‘రాజేంద్రప్రసాద్, రజని నటించారు. పిసినారితనం గురించి కాళ్లకూరి ‘వరవిక్రయం’ నాటకంలో చూచాయగా ఉంటే, ‘అహ నా పెళ్లంట’ సినిమాకు వచ్చేటప్పటికి పరాకాష్టకు చేరుకుంది. బ్రహ్మానందానికి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమానే. అప్పటి శ్లాబ్ సిస్టమ్‌లో కనకవర్షం కురిపించిందీ చిత్రం. 8. సర్పయాగం (1991) పరుచూరి సోదరులు సినిమాల్లో బిజీగా ఉండి కూడా కొన్ని నవలలు రాశారు. భరతఖండం భగ్గుమంటోంది (భారతీరాజా ఈ నవల ఆధారంగా సినిమా తీద్దామనుకునేవాళ్లు), ‘నల్లపూసలు’ (శోభన్‌బాబుతో కార్తీకపౌర్ణమి’ సినిమా తీశారు) నవలలు రాసిన తర్వాత, ‘ఉదయం’ వీక్లీలో ‘సర్పయాగం’ రాశారు. ప్రాణాలు పోసే డాక్టర్ కొందరి ప్రాణాలు తీయమని కిరాయి హంతకులను ఆశ్రయించడం ఈ సినిమాలోని ఆసక్తికరమైన అంశం. అది రామానాయుడుగారికి నచ్చడంతో - శోభన్‌బాబు రీలాంచింగ్ ప్రాజెక్ట్‌గా పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలోనే ఈ సినిమా నిర్మించారు. రోజా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందీ సినిమా. 9. పెద్ద మనుషులు (1999) 90వ దశకం దాటేటప్పటికి తెలుగులో నవలలకు ఆదరణ తగ్గింది. అయినా కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన ‘శతదినోత్సవం’ నవల ఆధారంగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో ‘పెద్ద మనుషులు’ చిత్రం తీశారు రామానాయుడు. సత్యనారాయణ, కోట ‘పెద్ద మనుషులు’గా నటించారు. 10. మధుమాసం (2007) బలభద్రపాత్రుని రమణి రాసిన ‘నీకూ నాకూ మధ్య’ నవల ఆధారంగా ‘మధుమాసం’ సినిమా తీశారు. చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో సుమంత్, స్నేహ జంటగా నటించారు. నవలల్లో ఉన్న భావం చెడకుండా, చక్కగా తెరకెక్కించారు. - తోట ప్రసాద్, సినీ రచయిత మరికొన్ని విశేషాలు... రామానాయుడు గారికి ఇష్టమైన నవలల్లో ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి రాసిన ‘శాంతినికేతన్’ ఒకటి. సినిమాగా తీయడం సాధ్యపడలేదు. దాంతో, అపర్ణ (వెంకటేశ్ ‘సుందరకాండ’ హీరోయిన్) నాయికగా టీవీ సీరియల్ తీశారు. అలాగే యద్ధనపూడి రాసిన ‘అభిశాపం’ అనే నవల కూడా ఆయనకు చాలా ఇష్టం. చాలాసార్లు అనౌన్స్‌మెంటు వచ్చి, ఎందుకో కార్యరూపం దాల్చలేదు. రచయిత శ్రీరాజ్ ‘యువ’ (‘విజయ’ చక్రపాణి గారిది) మాసపత్రికలో రాసిన ఓ కథకు బహుమతి వచ్చింది. అదే కథ నాటకమై చివరికి ‘కలికాలం’ సినిమా అయ్యింది. సురేష్ సంస్థలో ‘సూరిగాడు’ సినిమాకు కథ అందించిన తర్వాత శ్రీరాజ్ ఓ స్క్రిప్ట్ రాశారు. అది నాయుడుగారికి ఎంత నచ్చిందంటే - వెంకటేశ్‌తో సినిమా తీయాలని ప్లాన్ చేశారు. జరగలేదు. కొన్నేళ్లపాటు ఆ స్క్రిప్ట్ ఆయన దగ్గర అలానే ఉంది. ఓసారి పాత స్క్రిప్ట్‌లు తిరగేస్తుండగా కనపడింది. వెంటనే ఆ హీరో పాత్రను హీరోయిన్గా మార్పులు చేర్పులు చేయించి ‘ప్రేమించు’ సినిమా తీశారు. అది మంచి విజయం సాధించింది. -
ఆయన గుడ్‌విల్ అది!
తెలుగు సినిమా జర్నలిస్ట్‌ల్లో రామానాయుడు గారిని అతి తక్కువగా కలిసింది నేనేనేమో. అయినప్పటికీ కలిసినప్పుడల్లా ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు ఎటువంటి దాపరికమూ లేకుండా నాతో మాట్లాడేవారు. ఆయనతో నాకు గల అనుభవాలలో కొన్ని... ఒకసారి ఓ ఆడియో ఫంక్షన్లో రామానాయుడు ఏదో పని మీద అటు వచ్చారు. కూచొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఏవీయస్ కనిపించారాయనకి. ‘‘హలో ఏవీయస్... ఎలా ఉన్నావ్?’’ అంటూ లేచి వెళ్లి కౌగలించుకున్నారు. ఏవీయస్ వెళ్లిపోయాక ‘‘మీకు సూపర్ ఫ్లాప్ ఇచ్చాడు (‘సూపర్ హీరోస్’ సినిమా) కదా... అంత ఆనందంగా ఎలా కావలించుకోగలుగుతున్నారు?’’ అని అడిగాను. ‘‘అతన్ని డెరైక్టర్‌గా పెట్టడంలో నా తప్పు కూడా ఉంది కదా... అతన్నొక్కణ్ణే తప్పు పడితే ఎలా? అది తప్పిస్తే అతను నాకు నటుడిగా ఓకే... నేను ఏదైనా ఓ ఫంక్షన్ అనుకుంటే నాకు రైట్ హ్యాండ్‌లా అన్నీ తానే అయి నడిపిస్తాడు. ఎప్పుడైనా మా సినిమాల గురించి ఓ చిన్న ప్రెస్ మ్యాటర్ మంచి మంచి పాయింట్స్‌తో నాకు ఎలా కావాలంటే అలా క్షణాల్లో ఇవ్వగలిగేది ఏవీయస్సే. ఇన్ని ప్లస్సులు పెట్టుకుని ఒక్క మైనస్‌నే మనసులో పెట్టుకుంటే ఎలా?’’ అని జవాబిచ్చారు రామానాయుడు. హృదయాన్ని రకరకాల అరలుగా విభజించుకుని దేనికదే అని అనుకోగలగడం, తన మీద తనకు ఎంతో కంట్రోల్ ఉంటేనే గాని సాధ్యంపడదు. తెలుగు సినిమాల్లో వృద్ధ పాత్రలకు తనకు తానే సాటి అయిన నిర్మలమ్మ షూటింగ్ గ్యాప్‌లో సెట్ బైట కూచొని ఉన్నారు. ఆవిడ అక్కడ ఉన్నారని తెలుసుకున్న రామానాయుడు వచ్చి ‘‘అమ్మా... మూడు సినిమాల పేమెంట్స్ మీకు పెండింగ్ ఉండి పోయిందమ్మా... ఎన్నిసార్లు మావాళ్లు అడిగినా మీరు తీసుకోవడం లేదట. ఇలా అయితే ఎలా? నేను మా ఆడిటర్లక్కూడా చెప్పుకోవాలి కదా?’’ అన్నారు. దానికావిడ ‘‘నీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది నాయుడూ.. ఉంచు.. రేప్పొద్దున్న ఎలా ఉంటుందో ఏమిటో.. నా అంత్యక్రియలకైనా ఉపయోగపడుతుంది’’ అన్నారావిడ. ‘‘అలా అనకమ్మా... ఎవరు ముందో ఎవరికి తెలుసు.. నాకే ఏమైనా అయితే నీ డబ్బు నీకెవరిస్తారు చెప్పు?’’ అన్నారాయన. ‘‘నాకా భయం లేదు. నీ పిల్లలు రత్నాలు. నేను అబద్ధం ఆడినా సరే నీకు మాత్రం మాట రానివ్వరు’’ అని అన్నారు నిర్మలమ్మ. అదీ రామానాయుడు గారు సంపాదించుకున్న గుడ్ విల్. సినిమా పరిశ్రమలో రాహుకాలాన్ని ఎంతో నమ్మకంతో, నియమబద్ధంగా, క్రమం తప్పకుండా పాటించడంలో రామానాయుడు తరువాతే ఎవరైనా. ఈ రాహుకాలం ప్రతి రోజూ గంటన్నర పాటు ఉంటుంది. ‘‘ఈ గంటన్నరా ఏం చేస్తారు?’’ అని అడిగితే ‘‘ఫోన్లు తీసి పక్కన పడేస్తాను. సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసేస్తాను. ఎటువంటి వార్తలు నాకు చేరకుండా, నేనెవరితో మాట్లాడకుండా తలుపులేసుకుని మంచం మీద మౌనంగా పడుకుంటాను’’ అని జవాబిచ్చారు. దీని గురించి ఇంకా మాట్లాడుతూ - ‘‘మద్రాసు నుంచి ఈ అలవాటు ఉంది. హైదరాబాద్ వచ్చాక కొన్నాళ్లు రాహుకాలాన్ని మానేసి మనదైన పద్ధతిలో వర్జ్యం పాటించా. వరుసగా ఫ్లాపులు రావడంతో, తిరిగి రాహుకాలాన్ని మొదలు పెట్టాను. విజయాలు రావడం మొదలయింది. అలా రాహుకాలం నాకు పర్మినెంట్ అయిపోయింది’’ అని మనసులోని నిజాన్ని ఎటువంటి భేషజం లేకుండా చెప్పేశారు రామానాయుడు. ఇంకోసారి ‘‘మిమ్మల్ని డాడీ రామానాయుడు అని అంటారు కదా. దానర్థం తండ్రి అని కాదుటండీ. డాక్టర్ డి. రామానాయుడు అని షార్ట్‌కట్ అండీ’’ అని జోక్ చేస్తే ‘‘భలే చెప్పావయ్యా... అందమైన హీరోయిన్లు డాడీ అంటుంటే ఇబ్బందిగానే ఉంటోంది’’ అన్నారు స్పోర్టివ్‌గా తీసుకుని కన్నుకొడుతూ. - రాజా, మ్యూజికాలజిస్ట్ -
రామానాయుడు వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ
హైదరాబాద్: మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రామానాయుడు భౌతిక కాయం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామానాయుడు మృతి చాలా బాధాకరం అన్నారు. రామానాయుడు 13 భాషలలో చిత్రాలు నిర్మించినట్లు తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేశాడని కొనియాడారు. రామానాయుడు రాజకీయాల్లోనూ సేవా కార్యక్రమాలు చేశారని చంద్రబాబు తెలిపారు. -
ప్రపంచంలోని గొప్ప నిర్మాతల్లో ఒకరు
ప్రముఖ నిర్మాత రామానాయుడి మృతి పట్ల నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి సంతాపం వ్యక్తం చేశారు. రామానాయుడితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 'ఎలాంటి సహాయం కావాలన్నా అగడమనేవారు. పొద్దున ఏడింటికెళ్లినా, రాత్రి పన్నెండింటికెళ్లినా కాదనకుండా డబ్బు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. నువ్వు మంచి సినిమాలు తీస్తున్నావ్.. స్టుడియో, ఎక్వీప్‌మెంట్‌ను వాడుకో అని ప్రోత్సహించేవారు. సురేశ్ ప్రొడక్షక్స్ బ్యానర్ మీద తప్పకుండా ఓ సినిమా తీద్దాం అని రామానాయుడు చెప్పారు' అని ఆర్. నారాయణమూర్తి మూవీమొఘల్ రామానాయుడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలోని అతిగొప్ప నిర్మాతల్లో రామానాయుడు ఒకరని, పరిపూర్ణత్వానికి ఆయన జీవితమే ఉదాహరణ అని నారాయణమూర్తి నివాళులు అర్పించారు. -
అదిరిపోయిన అహనా పెళ్లంట!
ఆహా నా పెళ్లంట.. ఈ చిత్రం పేరు వింటే చాలు.. మొన్న, నిన్నటి, నేటి తరాలేకాదు ఇక ముందు వచ్చే తరాలు కూడా కడుపుబ్బ నవ్వాల్సిందే. ఈ చిత్రానికి ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించగా దానికి రామానాయుడే నిర్మాతగా వ్యవహరించారు. బ్రహ్మానందాన్ని కమెడియన్‌గా పూర్తిస్థాయిలో నిలబెట్టిన సినిమా అది. కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్.. ఇలా ఎంతోమందికి ఆ సినిమా మంచి లైఫ్ ఇచ్చింది. సున్నితమైన అంశాలతో కుటుంబ కథ చిత్రాలను నిర్మించడంలోనే కాకుండా మనుసును రంజింప చేసే చిత్రాలను నిర్మించడంలోను ఆయనది అందె వేసిన చేయి. ప్రేక్షకులకు ఏ మాత్రం నష్టం జరగని విధంగా కథలను ఎంపిక చేయడంలోను, అలాంటి కథలను తీసుకొచ్చినవారికి అవకాశం ఇవ్వడంలోనూ రామనాయుడు ఎప్పుడూ ముందుండేవారు. ఇలా 155 చిత్రాలను ఒంటి చేత్తో నిర్మించి ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దక్కించుకున్నారు. -
ప్రపంచంలోని గొప్ప నిర్మాతల్లో ఒకరు
ఎలాంటి సహాయం కావాలన్నా అగడమనేవారు. పొద్దున ఏడింటికెళ్లినా, రాత్రి పన్నెండింటికెళ్లినా కాదనకుండా డబ్బు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. "నువ్ మంచి సినిమాలు తీస్తున్నావ్. స్టుడియో, ఎక్వీప్‌మెంట్‌ను వాడుకో.. సురేశ్ ప్రొడక్షక్స్ బ్యానర్ మీద తప్పకుండా ఓ సినిమా తీద్దాం' అనేవారు అంటూ మూవీమొఘల్ రామానాయుడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి. ప్రపంచంలోని అతిగొప్ప నిర్మాతల్లో రామానాయుడు ఒకరని, పరిపూర్ణత్వానికి ఆయన జీవితమే ఉదాహరణ అని నారాయణమూర్తి అన్నారు. -
మనసున్న మహారాజు.. రామానాయుడు..
-
రామానాయుడు.. 7 ప్రత్యేకతలు
ప్రముఖ నిర్మాత రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమకు సుపరిచితులు. నిర్మాతగానే గాక రామానాయుడిని చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవడానికి 7 ప్రత్యేకలున్నాయి. 1. రామానాయుడు తన కొడుకు సురేష్ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు. సురేష్ ప్రొడక్షన్స్ లోగో 'ఎస్పీ'కి ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా మంది ప్రముఖులు ఈ బ్యానర్లో నటించారు. 2. రామానాయుడు తాను నిర్మించిన చాలా చిత్రాల్లో నటించారు. చిన్న చిన్న పాత్రల్లో ఆయన కాసేపు కనిపించేవారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్, కలెక్టర్, జడ్జి వంటి పాత్రలను పోషించేవారు. 3. స్టూడియోలను నెలకొల్పిన అతికొద్దిమంది ప్రముఖుల్లో రామానాయుడు ఒకరు. విశాఖపట్నంలో స్టూడియో ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి రామానాయుడే. రాష్ట్ర విభజన జరగకముందే ఆయన విశాఖలో స్టూడియోను స్థాపించారు. 4. 1991లో రామానాయుడు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ను నెలకొల్పారు. గ్రామీణ యువతలో నైపుణ్యం పెంచేందుకు ఈ సంస్థ కృషిచేస్తోంది. ఇందుకోసం మెదక్ జిల్లా తునికి గ్రామంలో 33 ఎకరాలను విరాళంగా ఇచ్చారు. 5. అంజలి, షాజన్ పదంసీ, తన్వీ వ్యాస్, సంజన, మేఘన, కామ్న జెఠ్మలాని, మదాలసా శర్మ, ఆర్తీ అగర్వాల్, కత్రినా కైఫ్ (తెలుగులో), హరిత, అంజలా జవేరి, దివ్య భారతి తదితర తారలను పరిచయం చేశారు. 6. ప్రముఖ నటుడు వెంకటేష్.. రామానాయుడు కొడుకు. ప్రఖ్యాత నిర్మాత సురేష్ ఆయన పెద్ద కుమారుడు. యువ నటులు రానా, నాగ చైతన్య.. రామానాయుడి మనవళ్లు. 7. కేన్సర్ బాధితులకు రామానాయుడు ఏడాది పాటు ఉచితంగా మందులు అందిస్తున్నారు. -
ఆ క్యాన్సర్ వదల్లేదు..
అత్యధిక చిత్రాల నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు గడించిన రామానాయుడు గత పదమూడేళ్ల కింద ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆ మహమ్మారి ఆయనను బాధపెడుతూనే ఉంది. దీంతో ఆయన తరుచుగా ఆస్పత్రులకు వెళుతూపలుమార్లు చికిత్సలు పొందారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నారని అనుకుంటుండగానే, క్యాన్సర్ తిరగబడిందని తెలిసింది. దీంతో ఆయన గత కొద్దికాలంగా కృత్రిమశ్వాస ద్వారా చికిత్స పొందుతున్నారు. ఈయన చికిత్స పొందుతున్న తీరును సినీ నటుడు రాజశేఖర్ కూడా పర్యవేక్షించారు. రామానాయుడు కుమారుడు సినీ నటుడు వెంకటేష్ ఇటీవల తన తండ్రి కోలుకుంటున్నారని చెప్పారు. ఆయన మనసంతా సినిమామీదే ఉందని, వైజాగ్‌లో సినీ పరిశ్రమను ఎలా అభివృద్ధి చేయాలనే విషయాన్ని తన సోదరుడు సురేశ్‌తో మాట్లాడుతున్నారని చెప్పారు. కానీ ఇంతలోనే ఆయన తన కుటుంబ సభ్యులను, అశేష అభిమానులను శోకసంద్రంలో ముంచి ఈ లోకాన్ని వీడారు. -
ఫిలించాంబర్ లో బాపు సంతాప సభ
-
తెలుగు జాతి గర్వపడాలి!
‘‘రామానాయుడు లాంటి నిర్మాతలు ఇప్పుడు లేరు. భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు తీసిన ఆయన మన పరిశ్రమలో ఉన్నందుకు తెలుగు జాతి గర్వపడాలి’’ అని దాసరి వ్యాఖ్యానించారు. రామానాయుడు గురించి సీనియర్ సినీ పాత్రికేయుడు వినాయకరావు రచించిన ‘మూవీమొఘల్’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించి, తొలి ప్రతిని కృష్ణకు అందించారు. సినిమా పరిశ్రమకు రామానాయుడు మరువలేని సేవలందించారని కృష్ణ పేర్కొన్నారు. తనపై మంచి పుస్తకాన్ని రూపొందించినందుకు రామానాయుడు ఆనందం వెలిబుచ్చారు. భావితరాలకు తెలుగు సినిమా చరిత్రను అందించే ఉద్దేశంతోనే వరుసగా పుస్తకాలు వెలువరిస్తున్నానని రచయిత వినాయకరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి, బి. గోపాల్, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎన్. శంకర్, చదలవాడ శ్రీనివాసరావు, సారిపల్లి కొండలరావు తదితరులు మాట్లాడారు. -
వెంకన్న సేవలో బుద్ధప్రసాద్, రామానాయుడు
తిరుమల : శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఉదయం నైవేద్య విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారు లడ్డూ ప్రసాదాలు అందచేశారు. -
'అక్కినేని లేరనేది నమ్మలేని నిజం'
హైదరాబాద్ : అక్కినేని లేరనేది నమ్మలేని నిజమని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్ అధినేత , దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన బుధవారం ఉదయం ఏఎన్నార్ భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అక్కినేనితో తన అనుబంధం విడదీయలేనిదన్నారు. ఆయనతో కలిసి తాను 14 సినిమాలు చేసానన్నారు. తామిద్దరం ఒక కంచం ....ఒకే మంచం అనేలా ఉండేవారిమని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నాటికి...నేటికీ అక్కినేని అందరికి ఆదర్శమని ఆయన అన్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మహా వృక్షం రాలిపోయిందన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రపరిశ్రమకు రెండు పిల్లర్లుగా ఉండేవారని అన్నారు. అక్కినేనితో తాను తీసిన 'ప్రేమ్ నగర్' చిత్రం తన జీవితంలో ఓ శక్తిలా మారిందన్నారు. ఆ సినిమాతో అప్పటివరకూ తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను తట్టుకున్నట్లు చెప్పారు. అక్కినేని కుటుంబంతో బంధుత్వం ఉండని... ఆయన మరణం బాధాకరమని రామానాయుడు అన్నారు. నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ అక్కినేని లేరనే వార్త జీర్ణించుకోలేనిదన్నారు. ఆయనతో కలిసి రెండు సినిమాలు చేసినట్లు తెలిపారు. -
కన్నడంలో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ కన్నడంలో పునర్నిర్మాణమవుతోంది. ఎన్.షసూన్ రాజు దర్శకత్వంలో మలినేని ప్రొడక్షన్స్ పతాకంపై మలినేని లక్ష్మయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంస్థ లోగోని హైదరాబాద్‌లో రామానాయుడు ఆవిష్కరించి, ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మలినేని లక్ష్మయ్య మాట్లాడుతూ -‘‘వచ్చే నెలలో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం. అలాగే తెలుగులో సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో ఫిబ్రవరి నుంచి ఓ సినిమా చేయబోతున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగర్, సి.కల్యాణ్, రవికుమార్ చౌదరి, షసూన్ రాజు తదితరులు మాట్లాడారు. -
లెజెండ్స్: Dr.D రామానాయుడు