ప్రముఖ నిర్మాత రామానాయుడి మృతి పట్ల నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి సంతాపం వ్యక్తం చేశారు. రామానాయుడితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
'ఎలాంటి సహాయం కావాలన్నా అగడమనేవారు. పొద్దున ఏడింటికెళ్లినా, రాత్రి పన్నెండింటికెళ్లినా కాదనకుండా డబ్బు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. నువ్వు మంచి సినిమాలు తీస్తున్నావ్.. స్టుడియో, ఎక్వీప్మెంట్ను వాడుకో అని ప్రోత్సహించేవారు. సురేశ్ ప్రొడక్షక్స్ బ్యానర్ మీద తప్పకుండా ఓ సినిమా తీద్దాం అని రామానాయుడు చెప్పారు' అని ఆర్. నారాయణమూర్తి మూవీమొఘల్ రామానాయుడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలోని అతిగొప్ప నిర్మాతల్లో రామానాయుడు ఒకరని, పరిపూర్ణత్వానికి ఆయన జీవితమే ఉదాహరణ అని నారాయణమూర్తి నివాళులు అర్పించారు.
ప్రపంచంలోని గొప్ప నిర్మాతల్లో ఒకరు
Published Wed, Feb 18 2015 4:47 PM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement