narayanamurthy
-
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్‌డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్‌లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్‌టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. వారంలో 72 గంటలు పనిచేయాలని ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో కొందరు ప్రముఖులు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరు టెక్ సమ్మిట్‌లో నారాయణమూర్తి మాట్లాడారు. ప్రస్తుతం చైనా జీడీపీ 19 ట్రిలియన్లుగా ఉందని, చైనా మోడల్‌ను అధ్యయనం చేసి అక్కడ అవలంబిస్తున్న పద్ధతులను దేశంలో అనుసరించాలని సూచించారు. దాంతోపాటు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అయితే అందుకు బదులుగా సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలని ఆయన కోరారు. ఆయన ఉచితాలకు వ్యతిరేకం కాదని పరిస్థితులను అర్థం చేసుకోగలనని అన్నారు. తాను పేద కుటుంబానికి చెందినవాడినని, ఉచిత రాయితీలను పొందిన వారు సమాజానికి తమ బాధ్యతగా కొంత తిరిగి ఇవ్వాలన్నారు. ఉదాహరణకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తే అందుకు బదులుగా పిల్లలను బడికి పంపించి బాగా చదివేలా చూడాలన్నారు. ఏదీ ఉచితంగా ఉండకూడదని, ఏదో రూపకంగా సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. ఇదీ చదవండి: రూ.12 వేల కోట్ల వ్యాపారాధిపతి.. రూ.200 కోసం బేకరీలో పని..! చైనా జీడీపీ 19 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. భారత్ జీడీపీ మాత్రం 3.4-4 ట్రిలియన్‌లోనే ఉందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు చైనాలోనూ ఉన్నాయి. కానీ భారత్ కంటే 5-6 రెట్లు జీడీపీ అధికంగా ఉందన్నారు. చైనా మోడల్‌ను అధ్యయనం చేసి, ఉత్పత్తి పెంచి సమాజానికి లబ్ధి చేకూరే విషయాలు ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. -
ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు అసలు పని చేశామా లేదా అన్నది పాయింట్
వర్క్ కల్చర్‌పై ‘ఇన్ఫోసిస్’ కో–ఫౌండర్ నారాయణమూర్తి చేసిన కామెంట్ ‘70 హవర్స్ ఏ వీక్’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రకరకాల కోణాలలో ఈ కామెంట్ గురించి చర్చోపచర్చల మాట ఎలా ఉన్నా స్టాండప్ కమెడియన్లు, మీమ్స్ సృష్టించే వాళ్లకు మాత్రం చేతినిండా పని దొరికింది. స్టాండప్ కమెడియన్ వివేక్ మురళీధరన్ వీడియోలో... ‘ఇప్పుడు మనం 70 హవర్స్ ఏ వీక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం’ అంటూ సెల్ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ‘వారానికి 70 గంటలు పని చేయాలంటే’ అంటూ లెక్కలు వేయడం మొదలు పెడతాడు. రోజుకు, వారానికి, నెలకు ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుందో చెబుతాడు. టోటల్‌గా చెప్పాలంటే సంవత్సరంలో మనకంటూ మిగిలేది రెండు నెలలే. అందుకే తరచుగా ఈ సంవత్సరం తొందరగా గడిచినట్లు అనిపిస్తుంది అంటుంటాం’ అని వివేక్ అన్నప్పుడు ప్రేక్షకులు గట్టిగా నవ్వారు. ఒకరు ‘పోకిరి’ సినిమా ‘ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా’ డైలాగుతో మీమ్ చేశారు... ‘ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదన్నయ్యా,,,, అసలు పనిచేశామా లేదా అన్నది పాయింట్’. -
ఈ గంటల లెక్క సరైనదేనా?!
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం అని కవి వాక్కు. కాకపోతే ఎలా శ్రమించాలి? ఎంతసేపు శ్రమించాలి? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకే కావచ్చు... వారానికి 70 గంటలు పని చేయాలంటూ ఇన్ఫోసిస్ సంస్థ సహ–వ్యవస్థాపకులు నారాయణమూర్తి తాజాగా చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యువతరంలో పెద్ద చర్చ రేపుతోంది. ఐటీ వృత్తినిపుణుల్ని ఉద్దేశించి ఓ పాడ్ క్యాస్ట్‌లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయమది. రానున్న దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్త మార్పులతో వచ్చిపడే డిమాండ్లను అందుకొని, భారత ఉత్పాదకతను పెంచుకోవాలంటే ఈ అధిక పని గంటల విధానం అవసరమనేది ఆయన మాట. కార్పొరేట్ దిగ్గజాలు ఆ ప్రతిపాదనను సమర్థిస్తుంటే, శ్రామికవర్గాలు ఈ సుదీర్ఘ పనిగంటల ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి. వెచ్చించిన కాలం, ఉత్పాదకత... ఈ రెంటి మధ్య సంబంధం అన్నిసార్లూ అనులోమానుపాతంలోనే ఉంటుందా అనే మౌలిక ప్రశ్న మొదలైంది. పనిగంటలు పెంచి, ఎక్కువ పని చేయడమనే ప్రతిపాదన పట్ల పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు కారణాలు లేకపోలేదు. మన దేశంలో ఇప్పటికే అధిక సంఖ్యాకులు ఎక్కువ పని చేస్తూ, తక్కువ వేత నాలు పొందుతున్నారు. ఇక, ఇంటిని చక్కబెట్టే మహిళలు, అసంఘటిత రంగ శ్రామికులు లక్షల మంది ఈ 70 గంటల లెక్కకు మించే పనిచేస్తున్నారు. జీతం బత్తెం లేని కుటుంబ స్త్రీలు, వేతనం పొందినా లెక్కల్లోకి రాని అసంఘటిత శ్రామికుల రీత్యా ఉత్పాదకతలో అది కనిపించకపోవచ్చు. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) గణాంకాల ప్రకారం అధిక పనిగంటల విషయంలో మొత్తం 187 దేశాల్లో మనది 136వ ర్యాంకు. భారతీయ శ్రామికులు సగటున ఏటా 1660 గంటలు పనిచేస్తూ, 2,281 డాలర్ల మేర తలసరి జీడీపీ అందిస్తున్నారు. ఇండొనేసియా, ఆస్ట్రేలియా వగైరా దాదాపు అంతే గంటల్లో అధిక తలసరి జీడీపీ సాధిస్తున్నాయి. నిజానికి, రోజుకు గరిష్ఠంగా 8 గంటల పని మాత్రమే అనే పద్ధతిని భారతీయ కార్మిక చట్టాల్లోకి తేవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వారానికి 70 గంటలు, అంటే రోజుకు 11.5 గంటలు అనే పద్ధతి తెస్తే మునుపటి పోరాటాల ఫలితమంతా గంగలో కలిసిపోతుందనే భయమూ శ్రామికుల్లో ఉంది. అదనపు జీతం, పరిహారాల ఊసెత్తకుండా కేవలం అధిక పని గంటల ప్రతిపాదన తీసుకురావడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఒకవేళ ఉత్పాదకత, అభివృద్ధి పెరగాలనుకుంటే... శ్రామికులు తమ ఉద్యోగంతో పాటు నచ్చిన మరో పని కూడా ఏకకాలంలో చేసుకొని అదనంగా సంపాదించుకొనేలా ‘మూన్‌లైటింగ్’కు అనుమతించాలని కొందరు నిపుణుల సూచన. తద్వారా శ్రామికులకూ, దేశానికీ ఉపయోగమనేది వారి వాదన. అయితే, పలు దిగ్గజ టెక్ సంస్థల భావన తద్భిన్నంగా ఉంది. మారుతున్న శ్రామిక సంస్కృతిలో మూన్‌లైటింగ్ విడదీయరాని భాగమని కేంద్ర ఐటీ అమాత్యులంటున్నా, దాన్ని శిరోధార్యమంటున్న కార్పొరేట్ల సంఖ్య తక్కువే! వృత్తి పట్ల అంకితభావం, అచంచలమైన శ్రద్ధ కావాల్సిందే! కానీ, పని మీద దృష్టి అనేది చివరకు ఉద్యోగ జీవితానికీ – కుటుంబ జీవితానికీ మధ్య సమతౌల్యం దెబ్బ తీయకూడదు. మనిషి పూర్తిగా డస్సిపోయే పరిస్థితి తేకూడదు. శారీరక, మానసిక సమస్యలకు కారణం కాకూడదు. ఏ పని చేసినా సంతోషంగా చేస్తే ఫరవాలేదు. ఆ పరిస్థితి అంతటా సాధ్యం కాదు. సంతోషమే సగం బలం అనే మనం అందులో వెనకబడ్డాం. ఇప్పటికే ప్రపంచ సంతోషసూచిలో మన దేశపు స్కోరు గణనీయంగా తగ్గుతోంది. దశాబ్దం క్రితం 2013లో 4,772 స్కోరుతో సంతోషసూచిలో భారత్ 111వ ర్యాంకులో ఉండేది. తీరా ఈ ఏడాది మన స్కోరు 4,036కు పడిపోయింది. మన ర్యాంకు 126కు దిగజారింది. ఈ పరిస్థితుల్లో సంతోషంగా పని చేయాలనే పద్ధతికి నీళ్ళొదిలి, మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, అధిక గంటల పనితో ఉత్పాదకత పెంచాలని భావిస్తే, మొదటికే మోసం వస్తుంది. దీర్ఘకాలంలో అది దేశానికి నష్టదాయకంగా పరిణమించే ప్రమాదం ఉంది. నారాయణమూర్తి అన్నట్టు దేశాభివృద్ధికి మరింత శ్రమించాలనడంలో సందేహం లేదు. అయితే ఆ శ్రమను పని గంటలతో కొలవాలనుకుంటేనే చిక్కు. భారత్‌ను ఇప్పటికీ నిరుద్యోగం, తక్కువ ప్రతిఫలానికే పనిచేయాల్సి రావడం పట్టిపీడిస్తున్నాయి. స్వయం ఉపాధికి దిగుదా మంటే కావాల్సిన పెట్టుబడి దొరకని పరిస్థితి. విద్య, ఆరోగ్య వసతులూ అంతంత మాత్రమే. అవ్యవస్థీకృత ఆర్థికరంగంలో వారానికి 48 గంటల పైనే పని చేస్తున్నా, వేతనాల్లో వ్యత్యాసం, ఉపాధి భద్రత లేమి లాంటి సమస్యలు సరేసరి. ఈ నేపథ్యంలో జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచేలా ప్రభుత్వ విధానాలు మారాలి. పనిగంటల కన్నా మానవ సంక్షేమ మూలధనంపై దృష్టిపెట్టడం కీలకం. అప్పుడు ఉత్పాద కత పెరుగుతుంది. అందుకు పాలకులు ప్రాథమిక వ్యవస్థాగత లోపాలను సవరించడం అవసరం. గమనిస్తే, అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా సగటు భారతీయ శ్రామికుడు ఎక్కువ సేపు పనిచేస్తున్నా, ఉత్పాదకత తక్కువగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే, ఎంత నాణ్యమైన పని చేశావనేది ప్రధానం కావాలి కానీ, ఎంతసేపు గానుగెద్దులా పని చేశావనేది కాదు. గంటలకొద్దీ శ్రమను పెంచే కన్నా, నైపుణ్యాలకు పదునుపెట్టి, కొద్దిపాటి పరిశ్రమతో అధిక ఫలితం అందించే నవీన మార్గాలను అన్వేషించాలి. పారిశ్రామిక శిఖరం జేఆర్డీ టాటా మాటల్లో చెప్పాలంటే, ‘భారత్ ఆర్థిక అగ్రరాజ్యం కావడం కన్నా, ఆనందమయ దేశం కావాలి.’ అంచనాలు, అంతకు మించి ఒత్తిడి అంతకంతకూ అధికమవుతున్న కాలంలో అది చాలా ముఖ్యం. సంతోషం, సామర్థ్యం పెరిగితే సంపద అదే సృష్టి అవుతుంది. శ్రమజీవి ప్రతి చెమటచుక్క సిరులు పండిస్తుంది. -
మళ్లీ వస్తా.. విద్యార్థులతో మాట్లాడతా..
ఎచ్చెర్ల క్యాంపస్: ‘యూనివర్సిటీ’ సినిమా ప్రమోష న్ వర్కులో భాగంగా సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి గురువారం ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్‌లో ఈ సినిమా నిర్మించారు. వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్యను కలిసి విద్యార్థులతో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. అయితే ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలు జరగుతున్నాయని, మరోసారి రావాలని కోరారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ యూనివర్సిటీ సినిమా ను ఆదరించాలని కోరారు. అక్టోబర్ 4న శ్రీకాకుళం పట్టణంలో యూనివర్సిటీ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యా ప్రమాణాలు, రాజకీయ జోక్యం, విద్యార్థుల సమస్యలను సినిమా లో ప్రస్తావించామన్నారు. తప్పకుండా విద్యార్థుల ను ఆకట్టుకుంటుందన్నారు. మరోసారి విశ్వవిద్యాలయం సందర్శించి విద్యార్థులతో మాట్లాడతానని చెప్పారు. -
అన్ని ప్రాంతాలపై సీఎం జగన్ సమదృష్టి
అనంతపురం కల్చరల్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని ప్రాంతాల పట్ల సమాన భావన ఉందని సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రముఖ కథా రచయిత డాక్టర్ శాంతి నారాయణ రచించిన ‘సాధన’ నవలావిష్కరణ సభ ఆదివారం అనంతపురంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ రాయలసీమ గొప్ప సంస్కృతీ సంప్రదాయాలకు నెలవన్నారు. కానీ సినీ పరిశ్రమలోని కొందర స్వార్థపరులు సీమ సంస్కృతిని కించపరిచేలా ఫ్యాక్షన్ ముద్ర వేసి చూపించడం తనకు వేదన కల్గిస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తనతోపాటు కొంతమంది కలసి వెనుకబడిన ఉత్తరాంధ్ర పరిస్థితుల గురించి వివరించిన వెంటనే తాండవ రిజర్వాయర్, ఏలూరు కాలువ ఎత్తిపోతల పథకానికి రూ.470 కోట్లతో అనుమతులివ్వడం సంతోషదాయకమన్నారు. అంతకుముందు నారాయణమూర్తిని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ రాగే హరిత, వైఎస్సార్సీపీ నాయకులు చామలూరు రాజగోపాల్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు బండి నారాయణస్వామి, డాక్టర్ శాంతినారాయణ ఘనంగా సత్కరించారు. ఈ సభకు ఉప్పరపాటి వెంకటేశు అధ్యక్షత వహించగా, రాయలసీమ ఉద్యమ నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి, మాలపాటి అశోకవర్ధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ -
విశాఖలో ఉక్కు ఉద్యమం ప్రజా వేదిక..
-
డిసెంబర్ 17న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం డిసెంబర్ 17వ తేదీన నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తెలిపారు. ఏయూ సెనేట్ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ప్రత్యేక అతిథిగా అవంతి ఫీడ్స్ లిమిటెడ్ సీఎండీ ఎ.ఇంద్రకుమార్ హాజరవుతారని చెప్పారు. పూర్వ విద్యార్థుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు జీఎంఆర్ సంస్థల అధినేత జీఎం రావు(జీఎంఆర్) అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. దేశం గర్వించే సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి డిసెంబర్ 17న ఏయూలోని ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఫార్మసీ విభాగం, అమెరికన్ కార్నర్ వంటివి సందర్శిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఇటీవల విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థ సేవలు ప్రారంభించిందని, యువతకు రోల్ మోడల్‌గా నిలుస్తున్న నారాయణమూర్తి ఏయూకు అతిథిగా రావడం శుభపరిణామమన్నారు. త్వరలో ఇథియోపియాలోనూ ఏయూ పూర్వవిద్యార్థుల సంఘ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వ్యవస్థాపక ఉత్సవ సమారోహన కార్యక్రమాలను 2023, ఏప్రిల్ 26 నుంచి ఘనంగా ప్రారంభిస్తామని, శతాబ్ది ఉత్సవాలు 2025, ఏప్రిల్ 26వ తేదీన ప్రారంభమవుతాయని వివరించారు. అనంతరం పూర్వవిద్యార్థుల సంఘ కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్‌ను వీసీ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పూర్వవిద్యార్థుల సంఘ చైర్మన్ ఆచార్య బీల సత్యనారాయణ, ఉప్యాధ్యక్షుడు ఎ.మన్మోహన్, రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య బి.మోహన వెంకటరామ్, సంయుక్త కార్యదర్శి కుమార్ రాజా పాల్గొన్నారు. -
సినిమాలు తీసి నవల రాసింది
41 ఏళ్ల అశ్వినీ తివారీ అయ్యర్ మొన్న కంగనా రనౌత్‌తో ‘పంగా’ తీసింది. నిన్న లాక్డౌన్లో కూచుని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి – సుధామూర్తిల బయోపిక్ కోసం స్క్రిప్ట్ పూర్తి చేసింది. అదే సమయంలో మొదటిసారిగా ఒక నవల రాసి మార్కెట్లోకి ఆగస్టు 1న విడుదల చేస్తోంది. అందరిలానే ఆమెకూ రెండు చేతులే ఉన్నాయి. కాని స్త్రీలు ఇన్ని పనులు చేయగలరు అని సృజనాత్మకంగా ఉండగలరని చెబుతోంది. ‘ది హిడెన్ పవర్స్ ఇన్ ఎవ్రి ఉమన్’ అని నాలుగేళ్ల క్రితం బెంగళూరు టెడ్ఎక్స్ కోసం ఒక ఉపన్యాసం ఇచ్చింది అశ్వినీ తివారీ అయ్యర్. ప్రతి స్త్రీలో ఉండే అంతర్గత శక్తులను ఆ స్త్రీలు తెలుసుకోవాలని, వాటిని ఉపయోగంలోకి తేవాలని ఆమె మాట్లాడింది. ముంబైలో పుట్టి పెరిగిన అశ్వినీ తివారీ అయ్యర్ నిజానికి అడ్వర్టైజ్మెంట్ రంగంలో విశేష గుర్తింపు పొందింది. ‘లియో బర్నెట్’ వంటి అంతర్జాతీయ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా పని చేసింది. కాని ఆమె తనలో ఒక సినిమా దర్శకురాలు దాగి ఉందని గ్రహించిన మరుక్షణం 2013లో ఆ మంచి ఉద్యోగానికి రాజీనామా చేసి బాలీవుడ్లో పని చేయడం మొదలెట్టింది. ‘నీల్ బత్తి సన్నాట’, ‘బరేలీకి బర్ఫీ’, ‘పంగా’ సినిమాలకు దర్శకత్వం వహించింది. ఆమె దర్శకత్వ ప్రతిభకు అవార్డులు వచ్చాయి. ‘ఏ క్షణమూ ఖాళీగా ఉండటం నాకు నచ్చదు’ అని చెప్పే అశ్వినీ అయ్యర్ గత రెండేళ్లుగా కరోనా వల్ల పని సరిగ్గా జరక్కపోయినా సోనీ లివ్ కోసం ‘ఫాడు’ అనే ప్రేమ కథను తీసింది. ఇన్ఫోసిస్ దిగ్గజాలు సుధామూర్తి, నారాయణమూర్తి జంట జీవిత కథను అధ్యయనం చేసి వారి బయోపిక్కు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంది. అంతేనా? ఒక నవల కూడా రాసేసింది. దాని పేరు ‘మాపింగ్ లవ్’. గణితంలో మేప్‌ల ద్వారా అంచనాలను చేస్తారు. అలా ప్రేమను మేప్ చేయగలమా? అదే ఈ కథాంశం. ‘ఇది నా మొదటి నవల. లాక్డౌన్లో దొరికిన ఏకాంతంలో కూచుని రాశాను. రాయడంలో ఉండే ఆనందాన్ని అనుభవించాను’ అంటుంది అశ్వినీ అయ్యర్. ఈ నవల ఆగస్టు 1న మార్కెట్లోకి రాబోతోంది. అశ్విని తన సినిమా కథాంశాలకు గాని నవలకు గాని స్త్రీల జీవితాన్నే తీసుకుంది. ‘నీల్ బత్తి సన్నాట’లో చిన్న ఊళ్ల స్త్రీలు కనే కలలను ఆమె చూపించింది. ఇక ‘పంగా’ అయితే వైవాహిక జీవితంలో మునిగిపోయిన స్త్రీ తిరిగి తన క్రీడా సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది. ‘స్త్రీలు ఎన్నో చేయగలరు. ఎన్నో చేయాలి’ అంటుంది అశ్వినీ. ‘దంగల్’ దర్శకుడు నితేష్ తివారి ఈమె భర్త. సుధామూర్తితో...,; కంగనా రనౌత్‌తో... -
తప్పు తేలితే బోర్డు సభ్యులను బ్లాక్ చేయాలి
న్యూఢిల్లీ: కార్పొరేట్ పాలన విశ్వసనీయంగా ఉండే దిశగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పలు సూచనలు చేశారు. తప్పిదాలకు పాల్పడిన బోర్డు సభ్యులు, అధికారులను సెబీ బ్లాక్ లిస్ట్ (నిషేధిత జాబితా)లో పెట్టాలని, అప్పటి వరకు వారికి చెల్లించిన పారితోషికాలను ముక్కు పిండి వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. పోటీ సంస్థలకు మేలు చేసే విధంగా లేకపోతే తప్ప.. ప్రజావేగులు చేసే ఫిర్యాదులపై దర్యాప్తు సమాచారాన్ని కూడా వాటాదారులకు అందించాలన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ‘కార్పొరేట్ గవర్నెన్స్’పై నిర్వహించిన కార్యక్రమంలో మూర్తి పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజా వేగు ఫిర్యాదుపై విచారణలో భాగంగా కంపెనీ బోర్డు సభ్యులు, అధికారులు తమ విశ్వసనీయ విధులను సరిగ్గా న్విహించలేదని, పాలనా లోపం ఉన్నట్టు తేలితే రాజీనామా చేయాలని కోరాలి. ప్రజా వేగు ఫిర్యాదు అన్నది అసంతృప్త ఉద్యోగి నుంచి ప్రతీకార చర్య రూపంలో ఉండరాదు. తన ఫిర్యాదుకు ఆధారంగా అవసరమైన డేటా, వాస్తవాలను ఫిర్యాదిదారు అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఫిర్యాదిదారుకు వేధింపుల్లేకుండా కంపెనీ సరైన రక్షణ కల్పించాలి’’ అని నారాయణమూర్తి తన అభిప్రాయాలను వినిపించారు. పారదర్శకత అవసరం..‘‘ప్రజా వేగు ఫిర్యాదును పరిష్కరించే విధానం పారద్శకంగా, విశ్వసనీయతను పెంచే విధంగా ఉండడం తప్పనిసరి. ఒకవేళ ఫిర్యాదు మధ్య స్థాయి లేదా దిగువ స్థాయి ఉద్యోగికి వ్యతిరేకంగా వచ్చినట్టయితే.. ఆ ఉద్యోగితో సంబంధం లేని సీనియర్ ఉద్యోగులతో ఓ కమిటీని నియమించి విచారణ నిర్వహించాలి. ఒకవేళ బోర్డు సభ్యులు లేదా చైర్మన్ లేదా సీఈవోకు వ్యతిరేకంగా పిర్యాదు దాఖలైతే.. చాలా వరకు భారతీయ కంపెనీల బోర్డులు బయటి నుంచి ఓ న్యాయ సేవల సంస్థ సహకారంతో విచారణ చేసి అస్పష్టంగా ముగించేస్తున్నారు. కానీ ఇది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే మీరు న్యాయమూర్తిగా వ్యవహరించకూడదు. అంతర్జాతీయంగా పేరున్న సంస్థలు ఇటువంటి ప్రజావేగు ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో టాప్ టెన్ వాటాదారులు, సమాజంలో ఎంతో గౌరవనీయులైన వ్యక్తులను విచారణలో భాగం చేస్తున్నాయి’’ అంటూ నారాయణ మూర్తి కంపెనీల బోర్డులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదుల విచారణలో నిజాయితీ అవసరమని గుర్తు చేశారు. -
సీఎం జగన్‌పై నారాయణమూర్తి ప్రశంసలు
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవ్వరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం జగన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. జనాభాలో 54శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, అది అభినందనీయమని నారాయణమూర్తి స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కొరకు పార్లమెంట్లో బిల్లు పెట్టినందుకు సీఎం వైఎస్ జగన్‌కు నారాయణమూర్తి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. -
‘ఆధార్’పై వాగ్వాదం
ముంబై: పలు పథకాలకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేయడంపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్.నారాయణమూర్తి మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది. ఐఐటీ బాంబే శుక్రవారం నాడిక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. సమావేశంలో తొలుత చిదంబరం మాట్లాడుతూ.. ఎలాంటి సహేతుక కారణం లేకుండా ప్రతీదానికి ఆధార్‌ను అనుసంధానం చేస్తూ కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు. ‘వివాహం కాని ఓ యువజంట ఏకాంతంగా గడపాలనుకుంటే తప్పేంటి? ఓ యువకుడు కండోమ్స్ కొనాలంటే ఆధార్ లేదా మరో గుర్తింపు కార్డును చూపించాల్సిన అవసరమేంటి? నేనేం మందులు కొంటానో, ఏ సినిమాలు చూస్తానో, ఏయే హోటళ్లకు వెళ్తానో ప్రభుత్వం తెల్సుకోవాల్సిన అవసరం ఏమిటి?’ అని ప్రశ్నించారు. దీంతో చిదంబరం వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు మూర్తి ప్రకటించారు. చిదంబరం చెప్పిన వివరాలన్నీ గూగుల్లోనే లభ్యమవుతున్నాయన్నారు. చిదంబరం మాట్లాడుతూ.. బ్యాంక్ ఖాతాను తానింతవరకు ఆధార్‌తో లింక్ చేసుకోలేదన్నారు. దేశంలో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా జరగటంలేదని, ప్రజల్ని ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిళ్లతో బెదరగొడుతున్నారన్నారు. పథకాల అమలు, సబ్సిడీల కోసం ఆధార్ వినియోగానికి తాను వ్యతిరేకం కాదన్నారు. మూర్తి స్పందిస్తూ ఆధార్ వివరాలు దుర్వినియోగం కాకుండా చట్టం చేయాల్సిన బాధ్యత పార్లమెంటుదేనన్నారు. వ్యక్తిగత గోప్యతకు తగిన రక్షణ తీసుకుంటే ఆధార్ కూడా డ్రైవింగ్ లైసెన్సులాగా ఓ గుర్తింపు పత్రంగా ఉంటుందని మూర్తి అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ ఇతర వినోద కార్యక్రమాలకు ఆధార్ కోరాలనడం సరైంది కాదన్నారు. -
రుద్రమదేవికి ‘నంది’ రావాల్సింది
సాక్షి, హైదరాబాద్: సంస్కృతి, విలువలు, మానవీయతకు అద్దంపట్టిన చిత్రాలకు గతంలో నంది అవార్డులు ఇచ్చేవారని ప్రముఖ సినీ దర్శక నటుడు ఆర్.నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పుడు అవార్డులు అంటే, ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారాయని అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ సినిమాను వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్లో చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి హరీశ్ రావును కోరేందుకు గురువారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆ సినిమాలో నారాయణమూర్తి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈసారి అవార్డుల్లో రుద్రమదేవి సినిమాకు నంది అవార్డు రావాల్సింది. రుద్రమదేవి లాంటి మహనీయురాలి జీవితాన్ని సెల్యులాయిడ్కు ఎక్కించడం అంత తేలిక కాదు. అలాంటి సినిమాను గుర్తించాల్సింది. బాహుబలి సినిమా సాంకేతికంగా, వాణిజ్యపరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అందుకు ఆ సినీమా దర్శకుడు రాజమౌళికి సెల్యూట్. కానీ, బాహుబలికి జాతీయ ఉత్తమ అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయింది. ఆ సినిమా చరిత్ర కాదు, సందేశాత్మకం కాదు. అది పూర్తిగా కమర్షియల్ సినిమా. ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది’అని నారాయణమూర్తి పేర్కొన్నారు. -
నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు
ధర్మవరం టౌన్ : మరణానంతరం నేత్రదానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించారు పట్టణానికి చెందిన నారాయణమూర్తి (50). స్థానిక శాంతినగర్‌కు చెందిన ఆయన ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ సభ్యులు నేత్రదానం ఆవశ్యకతను అతడి కుటుంబసభ్యులకు వివరించారు. వారు అంగీకరించడంతో డాక్టర్ బీవీ సుబ్బారావు ఆధ్వర్యంలోని వైద్య బృందం శస్త్ర చికిత్స నిర్వహించి నేత్రాలను భద్రపరచి అనంతపురంలోని బాలాజీ ఐకేర్ ట్రస్ట్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ నేత్రదానం కోసం 99851 46362, 94406 83100 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు వైకే శ్రీనివాసులు, సభ్యులు బీఆర్ రంగనాథ్, పోలా ప్రభాకర్, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచంలోని గొప్ప నిర్మాతల్లో ఒకరు
ప్రముఖ నిర్మాత రామానాయుడి మృతి పట్ల నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి సంతాపం వ్యక్తం చేశారు. రామానాయుడితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 'ఎలాంటి సహాయం కావాలన్నా అగడమనేవారు. పొద్దున ఏడింటికెళ్లినా, రాత్రి పన్నెండింటికెళ్లినా కాదనకుండా డబ్బు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. నువ్వు మంచి సినిమాలు తీస్తున్నావ్.. స్టుడియో, ఎక్వీప్‌మెంట్‌ను వాడుకో అని ప్రోత్సహించేవారు. సురేశ్ ప్రొడక్షక్స్ బ్యానర్ మీద తప్పకుండా ఓ సినిమా తీద్దాం అని రామానాయుడు చెప్పారు' అని ఆర్. నారాయణమూర్తి మూవీమొఘల్ రామానాయుడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలోని అతిగొప్ప నిర్మాతల్లో రామానాయుడు ఒకరని, పరిపూర్ణత్వానికి ఆయన జీవితమే ఉదాహరణ అని నారాయణమూర్తి నివాళులు అర్పించారు. -
రియల్ ఎస్టేట్ కోసమే లక్ష ఎకరాలు
రిటైర్డ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి తాడేపల్లి రూరల్ : రియల్ ఎస్టేట్ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష ఎకరాలు సేకరిస్తున్నారని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరె డ్డి విమర్శించారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో శుక్రవారం రాత్రి జరిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు అన్యాయం చేస్తే ఏ చట్టం ఒప్పుకోదన్నారు. ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునే అవకాశం లేదని స్పష్టం చేశారు. రైతు ఇష్టపడి భూములు ఇస్తే తప్ప బలవంతంగా తీసుకునేందుకు ఏ చట్టం ఒప్పుకోదన్నారు. భూ సమీకరణతో వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, భూమిని నమ్ముకున్న అన్నదాతలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రతను కల్పించే ఇటువంటి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అమెరికా వంటి దేశంలోనే కొద్ది పాటి స్థలంలో రాజధాని నిర్మించుకుంటే, మన రాష్ట్రంలో లక్ష ఎకరాలు ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని సంస్థ బిల్లు ద్వారా ఇష్టానుసారంగా భూములు సేకరించే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు, రుణమాఫీకి సంబంధంలేదని, ఖజానాలో సొమ్ము లేకుండా ఏ మాఫీ చేయలేమని, చెప్పారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించి, వారి పక్షాన న్యాయ పోరాటం చేసేందుకు తాము సిద్ధమని లక్ష్మణరెడ్డి వెల్లడించారు. -
ఏసీబీ వలలో పౌరసరఫరాల డీటీ
రేషన్ డీలర్ భర్త వద్ద రూ.8వేల లంచం తీసుకుంటూ .. గురజాల: రేషన్ డీలర్ భర్త వద్ద రూ.8 వేల లంచం తీసుకుంటూ సీఎస్‌డీటీ మాలెపాటి వీరవెంకటనారాయణమూర్తి ఏసీబీ వలలో పడిన సంఘటన గురజాలలో గురువారం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఎం.రాజారావు తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతలకు చెందిన ఏశమ్మ గ్రామంలో షాపు నం.3 చౌకధరల దుకాణం నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టులో సోషల్ ఆడిట్ నిర్వహించగా.. సరుకు వివరాలు సరిగ్గా లేకపోవడంతో రేషన్ డీలర్‌ను సస్పెండ్‌చేసి షోకాజ్ నోటీసు అందజేశారు. ఆర్డీవోకు సమాధానం చెప్పి యధావిధిగా దుకాణాన్ని ప్రారంభించారు. అయితే, గత నెలలో గుర్తుతెలియని వ్యక్తులు డయల్ 100కు కాల్చేసి రెంటచింతల గ్రామంలో అక్రమంగా కిరోసిన్ తరలిస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఆ మేరకు పౌరసరఫరాల అధికారులు గత నెల 19న రేషన్ షాపులను తనిఖీచేశారు. రికార్డుల్లో కన్నా షాపు నం.3లో అదనంగా ఉన్న 50 కేజీల బియ్యం, 200 లీటర్ల కిరోసిన్, సుమారు ఐదు కేజీల పంచదారను పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్ (సీఎస్‌డీటీ) నారాయణమూర్తి సీజ్‌చేశారు. పౌరసరఫరాల చట్టం ప్రకారం రేషన్ డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేయాల్సివుంది. అయితే సీఎస్‌డీటీ రేషన్‌షాపు డీలర్ ఏశమ్మ భర్త ఓర్సు ప్రేమ్రాజుతో రూ.10 వేలు లంచం ఇస్తే ఎలాంటి కేసు లేకుండా చూస్తానని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని రూ.8 వేలు ఇస్తాననగా సీఎస్‌డీటీ సరేనన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రేమ్‌రాజ్ గుంటూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథక రచనలో భాగంగా రూ.8వేల (8 వెయ్యి నోట్లు) నగదును ప్రేమ్‌రాజ్ గురువారం మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న సీఎస్‌డీటీ నారాయణమూర్తికి అందించాడు. అదేసమయంలో ఏసీబీ డీఎస్పీ రాజారావు తన సిబ్బందితో దాడి చేసి సీఎస్‌డీటీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ మేరకు విచారించి కేసు నమోదుచేశారు. దాడుల్లో రేంజ్ ఎస్ఐ కె.సీతారామయ్య, నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘రచ్చ’న పడేశారు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కల్లూరు మండల పరిధిలోని 21, 22, 23 వార్డులకు సంబంధించి నగరంలోని మాధవనగర్‌లో రచ్చబండ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు. విషయం తెలిసి స్థానికులురేషన్కార్డులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు, పక్కా ఇళ్లు, ఇంటి స్థలాలు, బంగారుతల్లి పథకం కోసం పెద్ద ఎత్తున వినతి పత్రాలు సమర్పించారు. పనులన్నీ వదులుకుని క్యూలో నిల్చొని ఎమ్మెల్యే, అధికారులకు అర్జీలు అందించారు. వీటన్నింటినీ ఓ మూట కట్టి.. ఆ తర్వాత అక్కడే ఓ మూలన పడేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఈ మూటను గుర్తించిన స్థానికులు పత్రికల కార్యాలయాలకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత మూటను విప్పి చూడగా రచ్చబండ దరఖాస్తులు బయటపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ వినతులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 46 చోట్ల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించినా.. వినతుల స్వీకరణలో అధికారులు అయిష్టత చూపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. సమస్యలపై నోరు విప్పడమే తరువాయి.. పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమేస్తున్నారు. ఫలితంగా కార్యక్రమాలు నామమాత్రం అవుతున్నాయి. విషయం తెలిసి చాలా మంది ప్రజలు దూరంగానే ఉండిపోతున్నారు. మొదటి, రెండు విడతలను పరిశీలిస్తే ఈ విడతలో దరఖాస్తులు తగ్గేందుకు నాయకులు, అధికారుల తీరే కారణంగా తెలుస్తోంది. గ్రామాల్లో కాకుండా మండల కేంద్రాలకే రచ్చబండను పరిమితం చేయడంతో గ్రామీణులు తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. నాయకులు సైతం మొక్కుబడిగానే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం రాజకీయ పార్టీ సమావేశాన్ని తలపిస్తుండటం గమనార్హం.