షష్టి పూర్తి! | Celebrating 60 Years Of Suresh Productions, More Details Inside | Sakshi
Sakshi News home page

60 Years Of Suresh Productions: షష్టి పూర్తి!

Published Wed, May 22 2024 12:45 AM | Last Updated on Wed, May 22 2024 12:39 PM

Celebrating 60 Years of Suresh Productions

తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రోడక్షన్స్‌ షష్టి పూర్తి (60 ఏళ్లు) ప్రయాణం పూర్తి చేసుకుంది. పద్మభూషణ్, దివంగత నిర్మాత డా. డి. రామానాయుడు 1964లో స్థాపించిన సురేష్‌ ప్రోడక్షన్స్‌ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు పొందడంతో పాటు ప్రేక్షకుల మన్ననలను పొందింది. ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టారు రామానాయుడు. రైసు మిల్లు వ్యాపారం చేస్తున్న సమయంలో ఆయన మద్రాసు వెళ్లారు. అక్కడ కొందరు సినీ ప్రముఖుల పరిచయం ఆయన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. భాగస్వామ్యంతో ‘అనురాగం’ చిత్రం నిర్మించారు రామానాయుడు.

ఆ చిత్రం విజయవంతం అయింది. ఆ తర్వాత తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరుతో సురేష్‌ ప్రోడక్షన్స్‌ స్థాపించి, ఎన్టీఆర్‌తో ‘రాముడు–భీముడు’ (1964) సినిమా నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్నుంచి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ వస్తోంది సురేష్‌ ప్రోడక్షన్స్‌. శతాధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుని, చరిత్ర సృష్టించారు రామానాయుడు.

2015 ఫిబ్రవరి 18న ఈ మూవీ మొఘల్‌ తుది శ్వాస విడిచారు. అప్పటికే తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సురేష్‌బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు వెంకటేశ్‌ హీరోగా కొనసాగుతున్నారు. మనవడు రానా నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్‌ కూడా హీరో (‘అహింస’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు)గా చేసిన విషయం తెలిసిందే. ఇక సురేష్‌ ప్రోడక్షన్స్‌ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement