ఎలాంటి సహాయం కావాలన్నా అగడమనేవారు.
ఎలాంటి సహాయం కావాలన్నా అగడమనేవారు. పొద్దున ఏడింటికెళ్లినా, రాత్రి పన్నెండింటికెళ్లినా కాదనకుండా
డబ్బు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. "నువ్ మంచి సినిమాలు తీస్తున్నావ్. స్టుడియో, ఎక్వీప్మెంట్ను
వాడుకో.. సురేశ్ ప్రొడక్షక్స్ బ్యానర్ మీద తప్పకుండా ఓ సినిమా తీద్దాం' అనేవారు అంటూ మూవీమొఘల్
రామానాయుడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి.
ప్రపంచంలోని అతిగొప్ప నిర్మాతల్లో రామానాయుడు ఒకరని, పరిపూర్ణత్వానికి ఆయన జీవితమే ఉదాహరణ అని
నారాయణమూర్తి అన్నారు.