‘సురేష్’ ప్రొడక్షన్ బ్యానర్‌లో సుద్దాల రాజమౌళి | Suresh Productions banner in Suddala rajamouli | Sakshi

‘సురేష్’ ప్రొడక్షన్ బ్యానర్‌లో సుద్దాల రాజమౌళి

Published Thu, Feb 19 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

Suresh Productions banner  in Suddala rajamouli

పోచమ్మమైదాన్ : సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రామానాయుడు నిర్మించిన ‘ఆంధ్ర వైభవం’ సినిమాకు కోడెరైక్టర్‌గా వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ సుద్దాల రాజమౌళి వ్యవహరిం చారు. కాగా, సినిమాలో శాతవాహన కాలం నుంచి ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు జరిగిన పరిణామాలను చూపించారు. ఆ సినిమాలో రామనాయుడు శ్రీ కృష్ణ దేవరాయులుగా నటించడం గమనార్హం. ఈ సందర్భంగా రాజమౌళి విలేకరులతో మాట్లాడుతూ రామానాయుడి మృతి సినిమా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. కాగా, రాజమౌళి హైదారాబాద్‌లో రామానాయుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
 
పలువురి నివాళి..

పోచమ్మమైదాన్ జంక్షన్‌లో బాలాజీ ఆర్ట్స్ క్రియేషన్ అధినేత ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో రామానాయుడికి బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన  చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ పలు భాషల్లో సినిమాలు రూపొందించి నిర్మాతగా గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించిన రామానాయుడి మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. తెలంగాణ డెరైక్టర్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి యాసారపు అజయ్‌కుమార్ మా ట్లాడుతూ నూతన దర్శకులను పరిచయం చేసిన ఘనత రామానాయుడుకే దక్కుతుందన్నారు. దేశాయిపేట వర్తక సంఘం కోశాధికారి సిరుపా మదన్‌కుమార్, కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి, బొమ్మన రవి, వెంకటేశ్వర్లు, యోహాన్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement