
రామానాయుడు వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ
హైదరాబాద్: మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రామానాయుడు భౌతిక కాయం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామానాయుడు మృతి చాలా బాధాకరం అన్నారు.
రామానాయుడు 13 భాషలలో చిత్రాలు నిర్మించినట్లు తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేశాడని కొనియాడారు. రామానాయుడు రాజకీయాల్లోనూ సేవా కార్యక్రమాలు చేశారని చంద్రబాబు తెలిపారు.