గంటా పీహెచ్డీ ఎక్కడ చేస్తారో? | tdp leader ramanaidu takes on minister ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

గంటా పీహెచ్డీ ఎక్కడ చేస్తారో?

Published Mon, Mar 2 2015 12:54 PM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

గంటా పీహెచ్డీ ఎక్కడ చేస్తారో?

గంటా పీహెచ్డీ ఎక్కడ చేస్తారో?

విశాఖ : విశాఖ తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య పొసగని విషయం తెలిసిందే. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై జిల్లా టీడీపీ నేత రామానాయుడు సోమవారమిక్కడ విరుచుకుపడ్డారు. పూటకో పార్టీ మార్చే గంటా... అయ్యన్నపాత్రుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.

గంటా..తన రాజకీయ లబ్ది కోసం ...'టెన్త్ చంద్రబాబు స్కూల్, ఇంటర్ చిరంజీవి కాలేజ్, డిగ్రీ కిరణ్ కుమార్ రెడ్డి కళాశాలలో గంటా చేరారు. పీజీ కోసం మళ్లీ చంద్రబాబు కాలేజీలో చేరిన ఆయన...మరి పీహెచ్డీని ఎక్కడ పూర్తి చేస్తారో' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మంత్రి అయ్యన్నపాత్రుడికి వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, అవకాశవాద, పార్టీ మార్చే రాజకీయాలు ఆయనకు లేవని రామానాయుడు అన్నారు.

కాగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి  శ్రీనివాస్‌ల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మాడుగుల నియోజకవర్గంలో మంత్రి అయ్యన్న శుక్రవారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement