వెంకీ ఇప్పుడేం చేస్తున్నట్లు? | prasent venki what are doing | Sakshi

వెంకీ ఇప్పుడేం చేస్తున్నట్లు?

May 25 2015 11:56 PM | Updated on Sep 3 2017 2:40 AM

వెంకీ ఇప్పుడేం చేస్తున్నట్లు?

వెంకీ ఇప్పుడేం చేస్తున్నట్లు?

‘గోపాల గోపాల’ చిత్రం విడుదలై ఇప్పటికి నాలుగు నెలల పైనే అయ్యింది. మామూలుగా ఎప్పుడూ సినిమా తర్వాత సినిమా చేసే వెంకటేశ్ నుంచి ఈసారి ఎందుకనో కొత్త సినిమా కబుర్లు వినపడటం లేదు.

‘గోపాల గోపాల’ చిత్రం విడుదలై ఇప్పటికి నాలుగు నెలల పైనే అయ్యింది. మామూలుగా ఎప్పుడూ సినిమా తర్వాత సినిమా చేసే వెంకటేశ్ నుంచి ఈసారి ఎందుకనో కొత్త సినిమా కబుర్లు వినపడటం లేదు. అసలు ఇంతకూ వెంకీ ఏం చేస్తున్నట్టు? తండ్రి రామానాయుడు ఫిబ్రవరిలో చనిపోవడంతో, వెంకీ చాలా రోజులు సినిమా కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
 
 ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. తాజా సమాచారం ఏమిటంటే, ఆ సమయంలోనే రచయిత ఆకుల శివతో రాబోయే సినిమా స్క్రిప్టు డిస్కషన్‌లో వెంకటేశ్ పాల్గొన్నారట. ఎలాంటి కథ, ఏ నేపథ్యం, ఎటువంటి పాత్ర లాంటి వివరాలు తెలియలేదు. అయితే, ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో కనిపించే వెంకటేశ్, ఈసారి బాగా గడ్డం పెంచుకుని కనిపిస్తున్నారు.
 
 ఇటీవలే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో తనయుడు అర్జున్ రామ్‌నాథ్‌తో కలిసి ఆ గెటప్‌లోనే సందడి చేశారు. ఈ గెడ్డం గెటప్ అంతా ఆ కొత్త సినిమా కోసమే అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఆకుల శివ స్క్రిప్టుతో జూన్ 6న రామానాయుడు జయంతి సందర్భంగా వెంకీ కొత్త సినిమా మొదల  వుతుందనేది ఫిలిమ్‌నగర్ టాక్. దర్శకుడు మారుతినా లేక ఇంకెవరైనా అనేది త్వరలోనే తెలుస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement